మద్యరాత్రుల్లో ఉలిక్కిపడి లేవడం వెనుక అసలు కారణాలు ఇవే...వీటి నుండి మీరు తప్పించుకోలేరు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీకు గనుక తరచూ మధ్య రాత్రుల్లో మెలుకువ గనుక వస్తూ ఉంటే, 7 నుండి 8 గంటల సేపు ఎంతో అవసరమైన నిద్ర మీకు లభించడం లేదు అని అర్ధం.

ఈ స్థితిని మధ్యస్థ నిద్రలేమిగా అభివర్ణిస్తుంటారు. ఈ స్థితిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నట్లే ఉంటారు, కానీ అంతలోనే మధ్య రాత్రుల్లో మెలుకువ వచ్చేస్తుంది.

నిద్రలేమితో బాధపడుతున్నారనటానికి సంకేతాలివే

చాలాా మంది ప్రజలు ఉదయం పూట విడతలవారీగా లేదా అప్పుడప్పు లేదా కొద్ది కొద్దిగా నిద్రపోతుంటారు. మీకు గనుక మద్యరాత్రుల్లో మెలుకువ వచ్చి అర్ధగంట కంటే ఎక్కువ సేపు అలానే గనుక మెలుకువగా ఉంటే, ఇలానే గనుక, ఒక వారంలో మూడు రోజులు ఈ పరిస్థితి గనుక మీకు తలెత్తితే అది విపరీతమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

నిద్రలేమితో బాధపడే ప్రజలకు నిద్ర రాకపోవడం ఒకటే సమస్య కాదు. దీనికి తోడు రాత్రుల్లో తరచూ మెలుకువ వచ్చేస్తుంటుంది.

దీని వెనుక సాధారణ కారణం కంటే కూడా ఇంకేదో పరిస్థితులు అయి ఉండొచ్చు. అవి మీకు తెలియకపోవచ్చు. మధ్యరాత్రుల్లో ఎందుకు మెలుకువ వస్తుంది అనే విషయమై అతి ముఖ్యమైన కారణాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ఒకే ఒక పవర్ ఫుల్ స్పైస్ తో ఒబేసిటీ, డయాబెటిస్, అనీమియా నయం..!

1. నిద్రలో నిర్ధారించబడని అప్నియా ( శ్వాస నిరోధం ) :

1. నిద్రలో నిర్ధారించబడని అప్నియా ( శ్వాస నిరోధం ) :

ఏ వ్యక్తి కి అయినా నిద్రలో అప్నియా ( శ్వాస నిరోధం ) సంభవిస్తే ఆ వ్యక్తికి ఊపిరి తీసుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో రాత్రంతా దానంతటికి అదే ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంటుంది మరియు మొదలవుతుంది. ఈ కారణాల వల్ల రాత్రుళ్ళు అనూహ్యంగా మెలుకువ వస్తుంది. టాన్సిల్స్ ఉబ్బిపోవడం లేదా ఊబకాయం కారణంగా ఇలా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2. అజీర్తి చేయడం :

2. అజీర్తి చేయడం :

అజీర్తి వల్ల కూడా మధ్య రాత్రుల్లో మెలుకవ వచ్చేస్తుంటుంది. పడుకొనే కొద్ది సమయం ముందు మరీ ఎక్కువగా ఆహారం తీసుకోవడం లేదా ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల మెలుకువ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నిద్రకు ఉపక్రమించే ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడాన్ని నిషేధించండి లేదా తక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి.

3. ఒత్తిడి :

3. ఒత్తిడి :

ఒక్కమాటలో చెప్పాలంటే ఒత్తిడి అనేది ముఖ్యంగా నిద్రను చంపివేస్తుంది, నిద్ర అస్సలు పట్టకుండా చేస్తుంది. నిద్ర పోయే ముందు మీరు గనుక ఎక్కువగా ఒత్తిడికి లోనైనట్లు భావిస్తే కొన్ని రకాలు వ్యాయామాలు చేయడం ద్వారా మీరు కొద్దిగా ఉల్లాసాన్ని పొందుతారు మరియు మీకు కొద్దిగా స్వాంతన చేకూరుతుంది. మద్యరాత్రుల్లో నిద్రలో ఉన్నప్పుడు మెలుకువ రావడానికి ఒత్తిడి ఒక చాలా ముఖ్యమైన కారణం అని గ్రహించండి.

4. వెలుగు :

4. వెలుగు :

కొంతమందికి వెలుగు ఎక్కువగా ఉన్నా లేదా లైట్లు వెలుగుతూ ఉన్నా నిద్ర అనేది సరిగ్గా పట్టదు లేదా నిద్ర నుండి లేచిపోతారు. అందుచేత మీరు పడుకునే గదిలో మీకు నిద్ర వచ్చే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని, అందుకు అనుగుణంగా లైట్లను అమర్చుకోవడం మంచిది.

5. శబ్దం :

5. శబ్దం :

పడకగదిలో ఉన్నప్పుడు బయట నుండి లేదా వెలుపల నుండి వచ్చే శబ్దాల వల్ల కూడా నిద్రా భంగం కలిగే అవకాశం ఉంది. మీరు గనుక పట్నాల్లో ఉన్నట్లయితే, తప్పక తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అన్ని రకాల శబ్దాలను భరించవలసి ఉంటుంది, తప్పించుకొనే అవకాశమే ఉండదు.

6. ఉష్ణోగ్రత :

6. ఉష్ణోగ్రత :

ఎప్పుడైతే పడుకుంటామో ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గడం మొదలవుతుంది క్రమంగా శరీరం అంతా చల్లబడుతుంది. శరీరంలో నూతన ఉత్తేజం మరియు మనస్సులో ఉల్లాసం నింపడానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. మరీ ఎక్కువ చలిగా లేదా మరీ ఎక్కువ వెచ్చగా ఉన్నా గదుల్లో పడుకోకండి. ఆలా గనుక చేస్తే మీకు మంచి నిద్ర కలగడం అసాధ్యం అవుతుంది.

7. మీ పక్కన పడుకొనే వ్యక్తి :

7. మీ పక్కన పడుకొనే వ్యక్తి :

ఏ వ్యక్తి అయితే మీ పడకగదిలో మీ పక్కన పడుకుంటారో వారు గనుక ఎక్కువగా గురకపెట్టినా లేదా తరచూ నిద్రలో లేస్తూ బాత్ రూమ్ కి వెళ్ళడానికి లైట్లు ఆన్ చేస్తున్నాలేదా మీరు మంచి నిద్రలో ఉన్నప్పుడు మీ పై చేతులు వేయడం వంటివి చేసినా అది మీ నిద్ర పై ప్రభావం చూపుతుంది. మీకు గనుక ఇలా విసిగించే భాగస్వామి గనుక ఉంటే, మీరు ఒంటరిగా పడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నిద్ర చాలా ముఖ్యం కదా.

స్త్రీలు పరాయి పురుషుణ్ణి ఎప్పుడు కోరుకుంటారో తెలుసా..?

8. పడుకొనే ముందు అవసరానికి మించి ఎక్కువగా నీళ్లు త్రాగటం :

8. పడుకొనే ముందు అవసరానికి మించి ఎక్కువగా నీళ్లు త్రాగటం :

నిద్రా భంగం కలిగించే అతి ముఖ్యమైన కారణాల్లో రాత్రిపూట లేచి మూత్రానికి వెళ్ళటం కూడా ఒకటి. మీరు నిద్రకు ఉపక్రమించే అర్ధ గంట ముందు నీరు త్రాగటం మంచిది. దాని తర్వాత అస్సలు త్రాగకుండా ఉండటం ఉత్తమం.

9. పడకగదిలో పడుకున్నప్పుడు ఫోన్ ని ఉపయోగించడం :

9. పడకగదిలో పడుకున్నప్పుడు ఫోన్ ని ఉపయోగించడం :

ఫోన్ లో నుండి వచ్చే కిరణాలు మీ యొక్క కళ్ళ పై ప్రభావం చూపిస్తాయి. అందువల్ల మీ శరీరంలో మెలటోనిన్ అనే నిద్రను కలిగించే హార్మోన్లని ఉత్పత్తిచేయడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను మీ ముఖానికి అతి దగ్గరగా పెట్టుకొని చూడటం వల్ల నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. అందుచేతనే మధ్య రాత్రుల్లో అనూహ్యంగా మెలుకువ వస్తుంది.

10. నిద్రకు ఉపక్రమించే ముందు త్రాగటం :

10. నిద్రకు ఉపక్రమించే ముందు త్రాగటం :

కాక్ టైల్ గనుక త్రాగితే నిద్ర బాగా పడుతుంది. కానీ అదే మీ నిద్రకు ఆటంకం కూడా కలిగిస్తుంది. కొద్ది సేపు తర్వాత మీకు తల అంతా దిమ్మెక్కిపోయే అవకాశం ఉంది. అందుచేత మంచి నిద్రలో ఉన్న మీకు మద్య రాత్రుల్లోనే అనూహ్యంగా మెలుకువ వచ్చేస్తుంది.

English summary

Reasons For Waking Up At Night

There can be several reasons on why you might be waking up in the middle of the night. Read to know why do you keep waking up at night.
Story first published: Saturday, October 21, 2017, 19:00 [IST]
Subscribe Newsletter