గ్రీన్ టీనే కాదు...చామంతి టీలో కూడా బోలెడు ప్రయోజనాలు..!!

Posted By:
Subscribe to Boldsky

నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైంది. మ‌నిషికి ప్ర‌శాంతంగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి హెర్బ‌ల్ టి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

హెర్బల్ ట్రీట్మెంట్సే బెటర్ సాధారణంగా టీ, కాఫీలు అనారోగ్యమని చెబుతుంటారు. కానీ హెర్బల్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్థాలలో టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

Reasons Why You Should Drink Chamomile tea

అలసటగా అనిపించినప్పుడు చాలా మంది టీ తాగాలనుకుంటారు. అయితే సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు, హెల్త్ కి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక ఔషధాలు మెండుగా ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

సాధారణంగా తేయాకుతో తయారు చేసిన టీలతో పాటు గ్రీన్‌ల టీల గురించే ఎక్కువగా తెలుసు. కానీ, ఇపుడు చామంతి టీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చామంతి పూల తేనీరు సేవించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలువురు పరిశోధకులు చెపుతున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.

1. వ్యాధినిరోధకతశక్తిని పెంచుతుంది:

1. వ్యాధినిరోధకతశక్తిని పెంచుతుంది:

హెర్బల్ టీలో యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వివిధ రకాల వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఇంటర్నల్ గా వ్యాధులతో పోరాడి, ఇంటర్నల్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. తలనొప్పి నుండి రక్షణ కల్పిస్తుంది:

2. తలనొప్పి నుండి రక్షణ కల్పిస్తుంది:

చమోమెలీ టీ తాగడం వల్ల తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ నెర్వెస్ సిస్టమ్ ను ప్రశాంత పరిచి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది

3. నిద్ర బాగా పడుతుంది

3. నిద్ర బాగా పడుతుంది

రోజూ చామంతి టీ తాడం వల్ల నాడీవ్యవస్థ స్మూత్ గా ఉంటుంది. స్లీపింగ్ ప్రొసెస్ మెరుగ్గా ఉంచుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి చామంతి టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల బేబీలాగా బాగా నిద్రపోతారు.

4. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది

4. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది

చామంతి హెర్బల్ టీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్స్ లో కొన్ని రకాల కాంపౌండ్స్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది

5. వైరల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది

5. వైరల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది

సాధారణ జలుబు మరియు దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ పొందాలంటే చామంతి టీని ఎంపిక చేసుకోవాలి. అన్ని రకాల బ్యాక్టీరియా మరియు వైరస్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇది గొప్పగా సహాయపడుతుంది

6. జీర్ణ శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది

6. జీర్ణ శక్తిని పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది

చామంతి టీని రెగ్యులర్ గా తాగుతుంటే, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్ , కడుప్పబ్బరం, వంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది.

7. ఆందోళ తగ్గిస్తుంది

7. ఆందోళ తగ్గిస్తుంది

ఈ టీలో ఉండే కొన్ని గుణాలు నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. ఆందోళన తగ్గించడంలో మరియు స్ట్రెస్ తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. ఈ చామంతి టీ తాగడం వల్ల మనస్సు ప్రశాంతగా ఉంటుంది

English summary

Reasons Why You Should Drink Chamomile tea

Chamomile is a multi-purpose herb that has been used as a traditional medicine for thousands of years to treat a myriad of health-related issues.This ancient medicinal herb is composed of antioxidant and antibacterial properties that have a curative and preventive effect on several health problems.
Story first published: Thursday, February 23, 2017, 10:45 [IST]
Subscribe Newsletter