నడుస్తూ లేదా ప్రయాణిస్తూ ఆహారాన్ని తినకూడదు అని చెప్పేందుకు గల 7 కారణాలు!

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనలో చాలామంది తినేటప్పుడు - నడవటం, మాట్లాడటం వంటి వాటిని అలవాటుగా కలిగి ఉంటారు. నిజానికి, ఇది చాలా చెడ్డ పద్ధతి. పాతకాలంలో మన తాతలు ఒక మాట మాట్లాడకుండా, పద్ధతిగా కూర్చుని భోజనం చేసేవారని మనము వింటూనే ఉన్నాము.

ఇలా చేయడం వల్ల ఆహారము యొక్క రుచిని పెంచడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తినేటప్పుడు కదలడం వల్ల అనేక జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు మరియు మీరు అనారోగ్యానికి గురైనట్లుగా భావిస్తారు.

కాబట్టి ఆరోగ్యంగా ఉండేటట్లుగా తినడం మాత్రమే ముఖ్యమైనది కాదు, సరైన ఆహారపు అలవాట్లను ఒక క్రమపద్ధతిలో పాటించడం కూడా చాలా ముఖ్యమైనది. తినేటప్పుడు నడవటం అనే చర్య ఎక్కువగా కార్యాలయంలో పనిచేసే వ్యక్తులలో కనిపిస్తుంది.

eating etiquettes

అదేపనిగా ఆఫీసులో గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల విసుగు చెందినప్పుడు, మీ విరామ సమయాల్లో సహోద్యోగులతో కలిసి ఉండటం కోసం, ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడానికి నడకను ఉపయోగించండి.

అన్ని బాగానే వున్నా, తినే సమయంలో నడవడం అనేది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఇది ఆచరణీయమైన చర్య మాత్రం కాదు.

మీరు పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవచ్చు, కానీ భోజన సమయంలో మాత్రం మీరు ప్రశాంతంగా కూర్చోని మరియు మీ సహోద్యోగులు మరియు కుటుంబ సభ్యులతో ఆస్వాదించడం మంచిది.

ఈ రోజుల్లో, ఎలాంటి సందర్భంలోనైనా ఆహారాన్ని అందించే బఫే పద్ధతి చాలా ప్రముఖమైనదిగా వుంది. అలాంటి సందర్భంలో పూర్తిగా ఆహారంతో నిండిన మీ ప్లేటును పట్టుకొని, కూర్చోవాల్సిన ఏర్పాటును చేసుకొని మీ భోజనాన్ని ఆస్వాదించడం చాలా మంచిది.

తినేటప్పుడు నడవటం వల్ల కలిగే పరిణామాలలో కొన్నింటిని చూద్దాము...

1. కడుపు అసిడిటి (ఆమ్లత) :

1. కడుపు అసిడిటి (ఆమ్లత) :

మనము ఆహారాన్ని తినేటప్పుడు, పైన ఉన్న ఆహార నాళం నుండి కడుపులో వున్న జీర్ణాశయానికి పంపుతుంది. మీరు తీసుకొనే ప్రతి ఆహారపు ముద్దకు జరిగే ఒక క్లిష్టతరమైన ప్రక్రియ. అలా భోజనం చేసేటప్పుడు మీరు నిరంతరం కదులుతూ ఉన్నట్లయితే, మీ జీర్ణక్రియ యొక్క ప్రక్రియకు ఆటంకం వాటిల్లుతుంది, దాని ఫలితంగా గుండెల్లో మంట, అసిడిటి మరియు వికారం వంటి వాటిని అనుభూతి చెందుతారు.

2. అజీర్ణం:

2. అజీర్ణం:

మీరు తినేటప్పుడు కదులుతూ ఉండటం వల్ల వచ్చే అజీర్ణం అనేది సాధారణంగా ఎదురయ్యే ఒక సమస్య. ఎందుకంటే ఆహారమును సరైన రీతిలో విచ్ఛిన్నం కాలేవు, అవి అలానే ప్రేగులలోనే ఉంటాయి. ఈ కారణంగా ఆకలి మందగించటం, అసిడిటీ (ఆమ్లత్వం), అజీర్ణము వంటి ఇతర సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా కూర్చోవడం చాలా మంచిది.

3. కడుపు ఉబ్బరం:

3. కడుపు ఉబ్బరం:

అజీర్ణం అనేది తరచుగా కడుపు ఉబ్బరమునకు దారితీస్తుంది మరియు వాంతులు, వికారం మరియు మలబద్ధకం వంటి వాటితో కలిసి కూడా ఉంటుంది. ఒక వ్యక్తిలో అననుకూలముగా ఉన్న భావన మొదలయ్యి, తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటాడు. కాబట్టి, మీరు మీ ఆఫీస్ కు ఆలస్యంగా బయలుదేరేటప్పుడు, ప్రయాణంలో ఒక ఆపిల్ను పట్టుకోవడం గురించి ఆలోచిస్తే, ఆ మిగిలిన రోజు మొత్తం మీ కడుపు మిమ్మల్ని చాలా బాధపడుతుందని తెలుసుకోండి.

4. పెరిగిన మూత్రాశయ పనితీరు:

4. పెరిగిన మూత్రాశయ పనితీరు:

నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు (లేదా) డ్రైవింగ్ చేస్తున్నప్పుడు - కాఫీ (లేదా) టీ ని చాలా వ్యక్తులు కలిగి ఉన్నట్లుగా కనిపిస్తారు. డ్రైవింగ్ చేస్తూ కాఫీని తాగటం అనేది ఆరోగ్యకరమైనదిగా అనిపించవచ్చు, అయితే ఇది మూత్రాశయ పనితీరును పెంచేదిగా ప్రేరేపిస్తుంది. కెఫిన్ ఫలితంగా తరచుగా మూత్ర విసర్జనను చేసేటందుకు మీలో అధికమైన కోరికను పెంచుతుంది. అలాగే, ఇది అసిడిటీకి మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.

5. వికారం:

5. వికారం:

మీరు చాలా తరచుగా "వికారమును" అనుభూతి చెందినట్లయితే, మీరు తినేటప్పుడు మీ కదిలికల చర్యే దానికి కారణం కావచ్చు. మన శరీర పనితీరును పెంచడానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి, మనము తినే ఆహారం ద్వారా మాత్రమే రూపొందించబడింది. కానీ మన కడుపుకి తగినంత విశ్రాంతి ఇవ్వకపోతే అది ప్రతికూలమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఒక వ్యక్తి ఆతురుతలో వెచ్చని పాలను (లేదా) ప్రోటీన్లను బాగా కదిలించి త్రాగటం వల్ల వికారం అనే భావన బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణం చేతనే శరీరానికి వాటిని విచ్చిన్నం చేసి జీర్ణం చేయడానికి సమయం అవసరమవుతుంది. మన శరీరం కొన్ని ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైతే, అప్పుడు అది పూర్తిగా ఆహారంపై దృష్టిని పెట్టలేదు, దాని ఫలితంగా మనకి ఒక అసంతృప్తికరమైన భావానను కలుగ చేసేందుకు దారితీస్తుంది.

6. గ్యాస్ నిర్మాణం:

6. గ్యాస్ నిర్మాణం:

గ్యాస్ ఏర్పడటం అనేది అజీర్ణం మరియు ఉబ్బరంతో కలిగి ఉన్న సంబంధం కారణంగా తలెత్తే ఒక సాధారణమైన సమస్య. ఇది మీకు ప్రతికూలమైనదిగా మరియు అసౌకర్యమైనదిగా ఉంటుంది. ప్రతికూల సందర్భాలలో గ్యాస్ ఏర్పడడం వల్ల తీవ్రమైన ఛాతీ నొప్పికి మరియు తేలికపాటి స్ట్రోకులకు కూడా దారితీస్తుంది. కాబట్టి ప్రయాణిస్తున్నప్పుడు కార్బొనేటెడ్ను మరియు కెఫిన్ వంటి పానీయాలను త్రాగటం వైపు మొగ్గు చూపించే వారిలో మీరు ఒకరు అయితే, ఈ సమస్యను మీ ఆరోగ్యం కోసం తీవ్రమైన ప్రమాదకారిగా పరిగణించబడి ఉండవచ్చు.

7. మరిన్ని తినండి:

7. మరిన్ని తినండి:

కదులుతూ తినడం వల్ల ఆ వ్యక్తికి మరింత ఎక్కువగా తినాలని ప్రయత్నించే మరొక ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. అతను / ఆమె వారి యొక్క ఆకలి స్థాయిని అంచనా వేయటంలో విఫలమవుతారు మరియు లోతైన సంభాషణలో నిమగ్నమైనప్పుడు మీరు తీసుకునే ఆహారపు మోతాదును అలా కొనసాగిస్తూనే ఉంటారు. ఇలా అతిగా తినటం వల్ల, మీ నడుము చుట్టూ అదనపు బరువుని కలిగివుండే కారణంతో, మీరు ఉబ్బిన కడుపును కలిగి ఉండేదిగా దారితీస్తుంది.

కాబట్టి మీరు తినేటప్పుడు పరుగెత్తటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగి ఉన్నారు. కాబట్టి, మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండేందుకు, మరియు అజీర్ణం మరియు దానికి సంబంధించిన ఇతర సమస్యలను నివారించేందుకు; సరైన పద్దతిలో ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకోవటం అనేది చాలా ముఖ్యము.

English summary

Why You Should Not Eat While Moving

It is important to maintain proper eating habits. This practice of moving while eating is mostly seen among individuals working in an office. Eating while you are on the move can cause serious health issues
Story first published: Wednesday, December 6, 2017, 17:00 [IST]