క్రోనిక్ స్ట్రెస్ (దీర్ఘకాలిక ఒత్తిడి)కి సైలెంట్ లక్షణాలు ఇవే...

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

దీర్ఘకాలిక ఒత్తిడి, ఆంగ్లంలో దీన్ని క్రానిక్‌ స్ట్రెస్‌ అంటారు. రాత్రంతా చక్కగా నిద్రపోయినా ఏదో అలసట, మతిమరుపు, ఉన్నపళంగా ఆందోళన.. ఇవన్నీ దీనికి సంకేతాలు. తెలుగులో దీన్ని దీర్ఘకాలిక ఒత్తిడి అనుకోవచ్చు.

నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధి పరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయం సాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో ఏ పనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తి చేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే. ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా!

causes for stress

అవి మనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా. అయితే, ఈ ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్‌గా మారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగా ఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి. ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడి ఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.

సహజంగా ఏర్పడే ఒత్తిడిని జయించే శక్తి సామర్థ్యం శరీరానికున్నా, క్రోనిక్ స్ట్రెస్ ను వదిలించుకోవడం మాత్రం కష్టం అవుతుంది. సహజంగా మనందరం బిజీలైఫ్ స్టైల్లో ఒత్తిడికి గురిఅవుతుంటారు . అయితే ఇలా ఒత్తిడికి గురైనవారు కొంత మంది తేరుకోగలుగుతారు. లేదా ఓర్చుకోగలుగుతారు.

ఒత్తిడితో బాధపడుతున్నా, ఇతరులకు మాత్రంమీరు ఫర్ ఫెక్ట్ గా ఉన్నట్లు చెబుతూ స్ట్రెస్ ను దాటవేస్తుంటారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముందు ముందు మరింత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఒత్తిడి బాధపడే వారిలో ముందుగా వారిలో ఏర్పడే స్ట్రెస్ లక్షణాలను గుర్గించటం ద్వారా ఆరోగ్యానికి మరింత ప్రమాదం జరకుండా కాపాడుకోవచ్చు. మరి ఆ సైలెంట్ స్ట్రెస్ లక్షణాలేంటో ఈ క్రింది విధంగా గుర్గించండి...

1. తలనొప్పి

1. తలనొప్పి

మీరు అనుకోవచ్చ తలనొప్పి చాలా సహజం అని, కానీ క్రోనిక్ స్ట్రెస్ కు ఇది ఒక కామన్ కండీషన్ అని కూడా చెప్పవచ్చు. అందుకే తలనొప్పి నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం వస్తుంటే అది క్రానిక్ స్ట్రెస్ కు సంకేతంగా తీసుకోవాలి. ఇది స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ వల్ల తలనొప్పిని సూచిస్తుంది.

2. పెయిన్ ఫుల్ పీరియడ్స్

2. పెయిన్ ఫుల్ పీరియడ్స్

చాలా మంది మహిళలలో పీరియడ్స్, మజిల్ క్రాంప్స్ వస్తాయి, ఈ పెయిన్ ఫుల్ క్రాంప్స్ క్రోనిక్ స్ట్రెస్ కు ఒక సంకేతం. పీరియడ్స్ సమయంలో హార్మోనులు అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది.

3. గడ్డ క్రింద నొప్పి

3. గడ్డ క్రింద నొప్పి

క్రోనిక్ స్ట్రెస్ తో బాధపడే వారిలో గడ్డం, దవడల క్రింద బాగంలో నొప్పి వస్తుంది.ఇది ఓవర్ స్ట్రెస్ వల్ల ఫేషియల్ మజిల్స్ టైట్ అవడం వల్ల నొప్పి కలుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ రోజుల నుండి ఉండటం వల్ల ఫేషియల్, మరియు దవడల నొప్పి ఎక్కువగా ఉంటుంది. మీ దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా దవడల్లో నొప్పి వస్తుంది.

4. చిగుళ్ళ నుండి రక్తస్రావం

4. చిగుళ్ళ నుండి రక్తస్రావం

రీసెంట్ గా ఒక బ్రెజీలియన్ రీసెర్చ్ స్టడీ ప్రకారం చిగుళ్ళ నుండి రక్తస్రావం అవ్వడం అనేది క్రోనిక్ స్ట్రెస్ కు ఒక సైలెంట్ సంకేతంం. చాలా మంది ఈ చిగుళ్ళు సమస్యకు గురి అవుతుంటారు. సాధారనంగా చిగుళ్ళ సమస్య ఉన్న వారు కూడా శరీరంలో కార్టిసోల్ హార్మోన్స్ లెవల్స్ పెరగడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఇదే చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని గుర్తిస్తుంది.

5. యాక్నే

5. యాక్నే

యాక్నే కామన్ స్కిన్ ఎలిమెంట్, చాల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, యాక్నే సెడెన్ గా వస్తుంది, ఇతర ఏ కారణాలు లేకుండా చర్మంలో మచ్చలు, మొటిమలు ఏర్పడుతాయి. సరైన ఆహారం తీసుకుంటే, చర్మ సంరక్షణ చిట్కాలను పాటిస్తున్నా, స్ట్రెస్ కారణంగానే హార్మోనుల అసమతుల్యతల వల్ల యాక్నే సమస్య దీర్ఘకాలిక స్ట్రెస్ కు సంకేతంగా సూచిస్తుంది.

6. స్వీట్స్ తినాలనే కోరిక

6. స్వీట్స్ తినాలనే కోరిక

గతంలో చదివిన విధంగా , అధిక ఒత్తిడి వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. రక్తంలో కార్టిసోల్ లెవల్స్ పెరిగినప్పుడు, గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయి. దాంతో స్వీట్స్ తినాలనే కోరక పెరుగుతుంది. కాబట్టి క్రానిక్ స్ట్రెస్ కు ఇది కూడా ఒక సైలంట్ సంకేతమే..!

7. చర్మంలో దురద

7. చర్మంలో దురద

ఒక జపనీస్ రీసెర్చ్ స్టడీస్ ద్వారా 20శాతం మందిలో చర్మం దురద బట్టి, చికిత్సను అందించిన తర్వాత అందుకు క్రోనిక్ స్ట్రెస్ కారణం అని కనుగొన్నారు. .

8. శ్వాస సంబంధిత అలర్జీలు

8. శ్వాస సంబంధిత అలర్జీలు

తరచూ ముక్కుదిబ్బడ, డ్రై కఫ్, ముక్కులు మూసుకోయిన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వల్ల నాజల్స్ దురదగా అనిపించడం , కాలుష్యం, కొన్ని ఆహారాల వల్ల రెస్పిరేటరీ అలర్జీ వంటిని క్రానిక్ స్ట్రెస్ సంకేతాలను సూచిస్తుంది.

9. పొట్ట సమస్యలు

9. పొట్ట సమస్యలు

హైల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్ ను అనుసరిస్తున్నా, క్రమంగా పొట్టనొప్పి, అజీర్తి, మలబద్దకం, లేదా డయేరియా వంటి లక్షణాలు కనబడితే అది దీర్ఘకాలిక స్ట్రెస్ కు కారణం అని గుర్తించాలి.

English summary

Silent Signs Of Chronic Stress

Stress, when it is extreme can be hard to manage and can take over our lives. There are a few obvious signs of stress that we all may know. However, there are a few silent signs of chronic stress that we must all become aware of.