పొగత్రాగే వారిలో సామాజిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని స్వచ్ఛంద సంస్థలు,ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా పొగ రాయుళ్ల చెవులకు ఎక్కటం లేదు.దీంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను సిగరెట్లను కొని,వాటిని త్రాగటం ద్వారా తమ శరీరాల్లోకి ఆహ్వానిస్తున్నారు.

ఫ్రెంచ్ దేశానికి చెందిన ఒక పరిశోధనా సంస్థ పొగత్రాగే వాళ్లలో సామాజిక ఒత్తిడి రోజు,రోజుకి పెరిగిపోయి వాటిని తట్టుకునే శక్తీ తగ్గిపోతోందని వెల్లడించింది.అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా బహిర్గత పరిచింది.పొగత్రాగే వాళ్లలో సామాజిక ఒత్తిడి పెరిగిపోవటానికి కారణం సిగరెట్లలో వాడే నికోటిన్ పదార్థమే అని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని నిరూపించడానికి కొన్ని పరిశోధనలు జరిపారు.అందులో భాగంగా ,కొన్ని ఎలుకల శరీరంలోకి నికోటిన్ పదార్థాన్ని ప్రవేశపెట్టారు,మరి కొన్ని ఎలుకలలో ఎలాంటి నికోటిన్ పదార్థాన్ని ప్రవేశపెట్టలేదు.ఈ ఎలుకలని వీటికంటే దూకుడుగా,దుందుడుగా వ్యవహరించే ఎలుకల మందలోకి పంపించారు.

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

పొగత్రాగే వారిలో సామాజిక ఒత్తిడి పెరుగుతుంది: స్టడీ

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలుక మెదళ్లలో జరుగుతన్న ప్రక్రియను విశ్లేషించడం ప్రారంభించారు.ఈ పరిశోధన ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే,ఏ ఎలుకలలో అయితే నికోటిన్ పద్దార్థము లేదో ఆ ఎలుకలు ఎటువంటి ఒత్తిడి కి లోనుకావడం లేదు. ఏ ఎలుకలలో నికోటిన్ పదార్థము ఉందొ ఆ ఎలుకలు విపరీతమైన ఒత్తిడి కి లోనవుతున్నాయని, అంతే కాకుండా ఇవి ఒత్తిడిని తట్టుకునే మానసిక శక్తిని కూడా కోల్పోతున్నాయని గమనించారు శాస్త్రవేత్తలు.

అంతే కాకుండా ఏ ఎలుక తన జీవిత కాలం లో కనీసం ఒక్క సారైనా నికోటిన్ పదార్థాన్ని స్వీకరించిందో, ఆ ఎలుకలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయనే విషయాన్ని గుర్తించారు.ఈ పరిశోధన ఎలుకల పైన చేసినప్పటికీ,ఇదే పరిశోధన ను మనుషుల పైనా కూడా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు శాస్త్రవేత్తలు.ఈ విషయాలన్నింటిని యూనివర్సిటీ అఫ్ పారిస్ కు సంబందించిన శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు.

స్మోకింగ్ తో పొంచి ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు

మనుషుల్లో కూడా ఇంచుమించుగా ఇలాంటి ఫలితాలే రావొచ్చని,కాబట్టి వీలైనంత వరకు సిగరెట్లకు,నికోటిన్ తో తయారు చేయబడే వస్తువులకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

With Inputs From IANS

English summary

Smoking Can Increase Sensitivity To Social Stress: Study

Researchers found that exposure to nicotine, rather than withdrawal from it, which is commonly seen as anxiety-inducing in smokers, produced a stressing effect on lab mice, reports Efe news.
Subscribe Newsletter