For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఓవర్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తాయి!

By Ashwini Pappireddy
|

ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సరైన పోషకాహారం తీసుకోకుండా, శరీరానికి వ్యాయామం లేకుండా, నిద్ర లేచినప్పుటి నుండి, తిరిగి పడుకునే వరకూ ఒత్తిడితో జీవిస్తున్నారు.

మనం బాగా ఒత్తిడికి గురైనప్పుడు, మన శరీరంలో అనేక లక్షణాలను గమనించవచ్చు. ఇది మనల్ని చాలా అన్ బ్యాలన్సుడ్ స్థితిలో ఉంచుతుంది.

అంతే కాదు మీరు కలిగి ఉన్న వివిధ ఆరోగ్య సమస్యలకు ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. ఒత్తిడి వల్ల కేవలం మానసిక స్థితి మాత్రమే కాదు, శరీరక స్థితి కూడా మారుతుంది.

ఒత్తిడి అనారోగ్యానికి దారి తీసే రోగనిరోధక వ్యవస్థను తగ్గిస్తుంది మరియు మీ శరీరంలో నొప్పిని పొందవచ్చు, ఇది మీరు పాలిపోయినట్లుగా మరియు బలహీనంగా కనిపించేలా చేస్తుంది.

<strong>ఒత్తిడి(స్ట్రెస్)తగ్గించుకోవడానికి 10 ఉత్తమ యోగాసనాలు</strong>ఒత్తిడి(స్ట్రెస్)తగ్గించుకోవడానికి 10 ఉత్తమ యోగాసనాలు

మీరు బాగా ఒత్తిడికి గురైనట్లు భావిస్తే, మీరు కొంత పనిని తగ్గించడం లేదా పోస్టుపోన్ చేసుకోవడం మంచిది మరియు సాధ్యమైతే సోషల్ మీడియా నుండి దూరంగా వుండండి.

symptoms of stress

మనలో చాలామంది ఎంత కష్టంగా ఉన్నా ఓవర్ స్ట్రెస్ అయినా కూడా పట్టించుకోకుండా చేస్తూనే వుంటారు.

అలాంటి సుదీర్ఘ పరిస్థితులలో, రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరు బలహీనమవుతుంది మరియు మీరు భావోద్వేగ సమస్యల ను ఎదుర్కొంటారు.

<strong>మానసిక ఒత్తిడిని జయించడానికి సెక్సీ మార్గాలు..!</strong>మానసిక ఒత్తిడిని జయించడానికి సెక్సీ మార్గాలు..!

ఈ ఆర్టికల్లో, మన శరీరం ఒత్తిడి కి గురైనప్పుడు కలిగే కొన్ని లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. శరీరం మీద చూపించే ఒత్తిడి సంకేతాలు ఏవి అని మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి

1. హెయిర్ నష్టం:

1. హెయిర్ నష్టం:

తీవ్రమైన ఒత్తిడి కి గురైనప్పుడు అది మానసిక స్థితి మీద ప్రభావితం చేయవచ్చు దీనివలన హఠాత్తుగా మీరు జుట్టు రాలడం లేదా జుట్టుని కోల్పోవడం జరుగుతుంది.

2. ఇతరుల విషయంలో సహనం తక్కువడం:

2. ఇతరుల విషయంలో సహనం తక్కువడం:

మీరు అకస్మాత్తుగా అసహనంతో, కోపంగా, భరించలేనంతగా మరియు మీ దగ్గరి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల ఇబ్బంది పడుతున్నట్లయితే, మీరు బహుశా మీరు చేస్తున్న అన్ని విషయాలపై బాగా ఒత్తిడికి గురైవుంటారు.

3. నిరంతరం మీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండటం:

3. నిరంతరం మీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉండటం:

మీరు నిరంతరం మీ ఉద్యోగం, పని మరియు బాధ్యతలు గురించి ఆలోచిస్తూ ఉంటే, మీరు భారీ ఒత్తిడి కి గురైవుతారు. మీరు ఈ సమస్య నుండి మిమ్మల్ని దూరం ఉంచే వరకు, మీరు దీనిని పరిష్కరించలేరు.

4. బలహీనమైన లిబిడో:

4. బలహీనమైన లిబిడో:

లిబిడో ఒత్తిడి ద్వారా ప్రభావితమవుతుంది. కాబట్టి ఒత్తిడి ఉన్నత స్థాయిలలో వున్నప్పుడు, లైంగిక స్పందన హార్మోన్లు తక్కువగా ఉంటాయి. ఒత్తిడి అలసటతో పాటు సాన్నిహిత్యాన్ని అనుభవించే సామర్ధ్యం లేకుండా చేస్తుంది.

5. ప్రశాంతంగా వుండలేకపోతారు:

5. ప్రశాంతంగా వుండలేకపోతారు:

మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, చివరకు మీ మనసు లో బాధపడటం, చిరాకు, అలసటతో పాటు చాలా అసౌకర్యవంతంగా ఉంటుంది.

6. శరీరంలో నొప్పి:

6. శరీరంలో నొప్పి:

సాధారణంగా చాలామంది వారి శరీరంలో అనుభూతి చెందే బాధను విస్మరిస్తారు. కానీ ఇది నిజంగా ప్రమాదకరమైన మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. ఒత్తిడి మీ శరీరాన్ని విచ్ఛిన్నం చేయగలదు మరియు ఛాతీ నొప్పి, కడుపు నొప్పి సమస్య, కండరాల సమస్య మరియు గుండె సంకోచాలకు కూడా దారితీయవచ్చు.

7. స్లీపింగ్ ఇష్యూస్:

7. స్లీపింగ్ ఇష్యూస్:

మీ నిద్రించే విధానాలు ఇటీవలే మారినప్పుడు లేదా మీరు చాలా అలసటతో నిద్రపోకపోతే, వెంటనే మీరు మీ జీవనశైలిని మార్చాల్సివుంటుంది.

8. బరువు ఫ్లక్యుటేషన్స్:

8. బరువు ఫ్లక్యుటేషన్స్:

ఒత్తిడి కి గురైనప్పుడు ఉన్నట్టుండి జీవక్రియ రేటును తగ్గిస్తుంది మరియు బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇది కూడా ఆకలి ని తగ్గించడం మరియు బరువు నష్టానికి కూడా దారితీయవచ్చు.

9. మేజర్ మూడ్ స్వింగ్స్:

9. మేజర్ మూడ్ స్వింగ్స్:

ఒత్తిడి ఇప్పటికే మీ హార్మోన్ల స్థాయి మీద ప్రభావితం చేసినట్లయితే, మీరు తీవ్రమైన వైవిధ్యాలతో ఉన్నటుండి మీ మూడ్ మారవచ్చు.

English summary

These Symptoms Can Show Up On Your Body If You're Overstressed

Stress can turn out to be the main reason for various health issues that you can have. It can lower the immune system that leads to sickness and you can also get pain in the body, which makes you look pale and weak.
Desktop Bottom Promotion