మీ స్పెర్మ్(వీర్యం) మీ గుండె ఆరోగ్యం గురించి కూడా తెలిపే విచిత్ర విషయం!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ నెమ్మదైన వీర్యకణాలు మీ మిగతా శరీరాన్ని కూడా నెమ్మదింపచేస్తున్నాయా? వీర్యకణాల నాణ్యత ఇతర ఆరోగ్యస్థితులకి కూడా కారణం కావచ్చని, సంబంధం ఉండొచ్చని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కొత్త పరిశోధన తెలుపుతోంది.

ఈ అధ్యయనంలో, ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్న పురుషుల వీర్యకణాల సంఖ్య, గాఢత, పరిమాణం, మరియు కదలిక కూడా మామూలు ఆరోగ్యంతో వున్నవారి కన్నా తక్కువేనని తేలింది. ఈ వీర్యకణాల సమస్యలు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులైన అధిక రక్తపోటు, గుండె జబ్బులు మరియు చర్మవ్యాధులను కూడా సూచిస్తాయి.

The Weird Thing Your Sperm Could Tell You about Your Heart

అదేకాక, వీర్యంతో ఎన్నిరకాల సమస్యలుంటే , ఈ వ్యాధులు కూడా అన్ని వచ్చే అవకాశం ఉంటుంది.

పరిశోధకులకి సంతానలేమి సమస్య మిగతా ఆరోగ్యసమస్యలకి ఎలా కారణమవుతుందో సరిగ్గా తెలీలేదు కానీ వారు హార్మోనల్, జన్యు మరియు జీవన విధాన కారణాల వల్లనే అని భావిస్తున్నారు.

The Weird Thing Your Sperm Could Tell You about Your Heart

ఉదాహరణకి టెస్టోస్టిరాన్ నే తీసుకోండి ; సంతానలేమి సమస్యతో బాధపడే మగవారికి సాధారణంగా ఈ హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది సమస్యాత్మకం కావచ్చు, ఎందుకంటే తక్కువ స్థాయిల్లో ఉండటం గుండె, ఎముకల,కండరాల ఆరోగ్యానికి అంత మంచిది కాదని స్టాన్ ఫర్డ్ లోని ప్రత్యుత్పత్తి విభాగం ఎండి, డైరక్టర్ మైఖేల్ ఈసెన్ బెర్గ్ తెలిపారు.

The Weird Thing Your Sperm Could Tell You about Your Heart

మరియు వీర్యకణాల ఉత్పత్తిని మొదలుపెట్టే జన్యువులు శరీరం మొత్తం ఇతర పనులు కూడా చేస్తాయి. శుక్రకణాల ఉత్పత్తిలో సమస్య వుంటే ఇతర సమస్యలు కూడా రావచ్చు. పైగా జీవనశైలి సరిగాలేక, కదలిక,వ్యాయామం లేక, స్థూలకాయం వంటి సమస్యలు- సంతానలేమికి కారణమవుతాయి- మీ శరీరం, జీవితం రెండూ భారమనిపిస్తాయి.

నిజంగా సంతానలేమి సమస్యనే ఇతర ఆరోగ్యసమస్యలకి కారణమవుతోందా లేదా వ్యతిరేకంగా జరుగుతోందా అని ఖచ్చితంగా తెలుసుకోడానికి మరిన్ని పరిశోధనలు జరగాలి.

The Weird Thing Your Sperm Could Tell You about Your Heart

ఈ మధ్య సమయంలో మీ సంతాన సాఫల్యంలో సమస్యలను హెచ్చరికగా తీసుకోండని డా. ఈసెన్ బెర్గ్ సూచిస్తున్నారు.

పిల్లలు కలగడంలో మీకూ, మీ భాగస్వామికి సమస్యలు కలుగుతుంటే, శుక్రకణాల పరీక్ష చేయించుకోండి, ఇంకా వైద్యునితో శరీరం మొత్తం ఒకసారి చెక్ చేయించుకోండి.

English summary

The Weird Thing Your Sperm Could Tell You about Your Heart

In the study, men with the poorest health were more likely to have lower sperm counts, semen concentration, volume, and movement than those in better overall shape. These semen abnormalities were also associated with specific conditions like hypertension, heart disease, and skin disorders.
Subscribe Newsletter