ఈ పుడ్స్ పెయిన్ కిల్లర్స్ కంటే పవర్ ఫుల్..అందుకే వీటినే ఎంపిక చేసుకోండి..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మన వంటగదిలో ఉండే అనేక పదార్థాలు పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తాయంటే మీరు నమ్ముతారా?శరీరంలో ఏదైనా ఒక చిన్న నొప్పి వస్తే చాలు వెంటనే ఫార్మసీకి వెల్లి ఏదో ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకుని, మింగేస్తుంటారు.?

అయితే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల మీరు ఊహించిన దానికంటే మరిన్ని ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు అలాంటి మందులకోసం ఎందుకు పరుగెత్తాలి. నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే ఆహారాలనే పెయిన్ కిల్లర్స్ గా ఎందుకు తీసుకోకూడదు?

These 10 Foods Act Like Painkillers

మనం నిత్యం తినే ఆహారాలే పెయిన్ కిల్లర్స్ గా పినిచేస్తాయని కొన్ని పరిశోధనలు నిరూపించాయి. ఒకటి కాదు, రెండు కాదు పెయిన్ కిల్లర్స్ గా పనిచేసే ఆహారాలు చాలనే ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. పెయిన్ సిగ్నెల్స్ ను నివారిస్తాయి, ఒంటినొప్పులకు సంబంధించిన వ్యాధులను నివారిస్తాయి.

ఆహారాలు పెయిన్ కిల్లర్స్ గా పనిచేయడం మాత్రమే కాదు, ఇవి సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. దాంతో హెల్తీ బాడీని పొందుతారు. అయితే ఈ ఆహారాలను తీసుకోవడానికి ముందు అన్ని రకాల జంక్ ఫుడ్స్ లేదా అనారోగ్యకరమైన ఆహారాలకు గుడ్ బై చెప్పాల్సిందే ..మరి నొప్పులను తగ్గించి అలాంటి ఫుడ్ పెయిన్ కిల్లర్స్ మన వంటగదిలో లేదా గార్డెన్ లో ఉండే వాటి గురించి తెలుసుకుందాం..

అల్లం:

అల్లం:

అల్లం చౌకైనది. చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. ఎఫెక్టివ్ ఫుడ్ . పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. రెగ్యులర్ డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్, వాపులు, కండరాల పట్టివేత వంటి సమస్యలను నివారిస్తుందని టెస్ట్ చేసి, ఫ్రూవ్ చేయబడినది. పచ్చి అల్లంతో పాటు, డ్రై జింజర్ కూడా బాడీ పెయిన్స్ ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

లవంగాలు :

లవంగాలు :

దంతాలు మరియు చిగుళ్ల సమస్య ఉన్నప్పుడు లవంగాలు నమలడం మంచిది. లవంగాల్లో యాంటీసెప్టిక్ యుజనాల్ అనే గుణాలుండటం వల్ల దంతాల నొప్పిని తగ్గిస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

చెవినొప్పితో బాధపడుతున్నారా? చెవినొప్పి తగ్గించుకోవడానికి ఇయర్ డ్రాప్స్ కోసం ఫార్మసీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. గార్లిక్ ఆయిల్ ను చెవిలో రెండు డ్రాప్స్ 5 రోజుల పాటు వేసుకుంటే చాలు. తప్పకుండా ఫలితం ఉంటుంది. లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి, ఆలివ్ ఆియల్ తో మిక్స్ చేసి ఫ్రిజ్ లో ఉంచాలి. దీన్ని రెండు వారాలు వాడితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

చేపలు:

చేపలు:

సాల్మన్, సార్డిన్స్, తున వంటి ఆయిల్ ఫిష్ తినడం వల్ల పొట్ట సమస్యలతో పోరాడుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇర్రిటేబుల్ బౌల్ సిడ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ , క్రాంపింగ్, బెల్లీ పెయిన్ తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు ఎఫెక్టివ్ నేచురల్ పెయిన్ కిల్లర్ , ఎవరైతే ప్రిమెనుష్ట్రువల్ సిండ్రోమ్ తో బాధపడుతుంటారో వారు రోజూ రెండు కప్పుల పెరుగు తింటే , సమస్యను పూర్తిగా నివారిస్తుంది. పెయిన్ ఫుల్ లక్షణాలు పూర్తిగా తగ్గుతాయి,

పసుపు:

పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది ఆప్సిరిన్ , ఐబ్రూఫిన్, మరియు నాప్రోస్కెన్ వలే పనిచేస్తుంది. తద్వారా నొప్పులు ఎఫెక్టివ్ గా తగ్గుతాయి.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఎండో మెట్రోసిన్ పెయిన్ తగ్గించడంలో ఓట్ మీల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి దీన్ని డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎండో మెట్రోసిస్ పెయిన్ ఓట్స్ తో తగ్గించుకున్నట్లు చాలా మంది మహిళ చెబుతున్నారు. ఓట్ మీల్లో ఉండే గ్లూటెన్, ప్రోటీన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

ద్రాక్షను రెగ్యులర్ గా రోజూ తింటుంటే రక్తనాళాలు విశ్రాంతి పొందుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రెగ్యులర్ డైట్ లో ద్రాక్షను చేర్చుకోవాలి.

తేనె :

తేనె :

నోటి పుండ్లను నివారించడంలో తేనె గొప్పగా సహాయపడుతుంది. ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. పెదాల పగుళ్లను నివారిస్తుంది. తేనెను నోటిలో అప్లై చేయడం వల్ల మౌత్ అల్సర్ తగ్గుతుంది.

వాటర్ :

వాటర్ :

ఒక గ్లాసు నీటితో దినచర్యను ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల పాదాలు, మోకాళ్లు, భుజాల నొప్పులు తగ్గుతాయి. నీళ్లు శరీరానికి కణజాలాకు హైడ్రేషన్ అందిస్తుంది. బ్లాక్ అయిన టిష్యులను నివారిస్తుంది. దాంతో ద్రవాలు మెరుగ్గా ప్రసరిస్తాయి.

English summary

These 10 Foods Act Like Painkillers

Did you know that certain foods act like painkillers? Listed in this article are a few of the best foods that act like a painkiller.
Story first published: Monday, May 8, 2017, 18:00 [IST]