నోటి నుంచి దుర్వాసన వస్తుందా? కారణాలివే!

Written By: Bharath
Subscribe to Boldsky

కొందరి నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. దీనికి చాలా కారణాలుంటాయి. సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం ఇలా చాలా కారణాలుంటాయి. దీంతో న‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు స‌రిగ్గా మాట్లాడ‌లేరు. న‌వ్వ‌లేరు.

అలాగే దుర్వాసన వల్ల పక్కన వారు చాలా ఇబ్బందిపడతారు. ఇలా నోటి దుర్వాస‌న చాలా రకాలుగా ఇబ్బందులను క‌లిగిస్తుంది. నోటి దుర్వాస‌న గురించి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే ఈజీగా నోటి దుర్వాసన నుంచి బయటపడొచ్చు. మరి అవి ఏమిటో చూద్దామా.

1. నీరు ఎక్కువగా తాగండి

1. నీరు ఎక్కువగా తాగండి

నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. నీరు మీ బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అందువల్ల ఎక్కువగా నీరు తాగాలి. అలాగే మీ నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. నీరు తక్కువ తాగితే నోరు పొడిగా మారి దుర్వాసన వస్తుంది.

2. కాఫీ ఎక్కువగా తాగకండి

2. కాఫీ ఎక్కువగా తాగకండి

కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ నోట్లో లాలాజలం ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మీ మొత్తం పొడిబారుతుంది. దీంతో నోటి నుంచి వచ్చే శాస్వలో దుర్వాసన వస్తుంది. అందువల్ల కాఫీ ఎక్కువగా తాగకండి.

3. మీ దంతాలను బాగా శుభ్రపరుచుకోండి

3. మీ దంతాలను బాగా శుభ్రపరుచుకోండి

మీ దంతాలను బాగా శుభ్రపరుచుకోవాలి. దంతాల్లో ఎక్కువ బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది. అందువల్ల రోజూ మీరు మీ పళ్లను బాగా తోముకోవాలి. ఉదయం, రాత్రి వేళల్లో దంతాలను శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యం.

4. భోజనం తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి

4. భోజనం తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి

మీరు భోజనం చేశాక కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ ఆహారం తిన్నా కూడా దానివల్ల మీ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆహారం తిన్న తర్వాత బాక్టీరియా నోటిలోనే ఉంటుంది. దానివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందువల్ల తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలి.

5. టూత్ బ్రష్ ను మార్చుకోండి

5. టూత్ బ్రష్ ను మార్చుకోండి

మీ టూత్ బ్రష్ ను రెగ్యులర్ మార్చుకుంటూ ఉండాలి. ఒకే బ్రష్ ను ఎక్కువ రోజులు ఉపయోగిస్తే నోటి నుంచి దుర్వాసన వస్తుంది. టూత్ బ్రష్ నోటిలో బ్యాక్టీరియా ఏర్పడడానికి కారణం అవుతుంది. అందువల్ల, మీ టూత్ బ్రష్ ని తరుచుగా మార్చడం అవసరం.

6. నాలుకను శుభ్రపరుచుకోవాలి

6. నాలుకను శుభ్రపరుచుకోవాలి

రోజూ ఉదయం పళ్లు తోముకున్న తర్వాత నాలుకను బాగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే అక్కడ బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది. నాలుకపై ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల రోజూ ఉదయం నాలుకను బాగా క్లీన్ చేసుకోవాలి.

7. మంచి మౌత్ వాష్ ఉపయోగించండి

7. మంచి మౌత్ వాష్ ఉపయోగించండి

చాలా మౌత్ వాష్ ల్లో సుమారు 27% ఆల్కహాల్స్ ఉంటాయి. ఇవి మీ నోటిని పొడిగా మారుస్తాయి. అందువల్ల మీరు ఉపయోగించే మౌత్ వాష్ ఎలాంటిదో మీరు తెలుసుకోవాలి. మంచి మౌత్ వాష్ ను ఉపయోగిస్తుండాలి.

8. సుగర్ మింట్స్ వద్దు

8. సుగర్ మింట్స్ వద్దు

చాలా మంది భోజనం చేశాక సుగర్ మింట్స్ తింటూ ఉంటారు. దీని వల్ల నోట్లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీనివల్ల కూడా మీ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత వీటిని నమలకండి.

9. మెడిసిన్ విషయంలో జాగ్రత్త

9. మెడిసిన్ విషయంలో జాగ్రత్త

యాంటి డిప్రెసెంట్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీ హిస్టామైన్లు వంటి మెడిసిన్స్ కొందరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి నోటిలో లాలాజలం ఏర్పడకుండా చేస్తాయి. అంతేకాకుండా నోటి నుంచి చెడ్డ వాసన వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే మెడిసిన్స్ లో ఇవి ఉండకుండా చూడండి.

10. టాన్సిల్ స్టోన్స్

10. టాన్సిల్ స్టోన్స్

టాన్సిల్ స్టోన్స్ వల్ల కూడా మీ నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొందరి నోటిలో ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి తెల్లగా ఉంటాయి. ఇవి నోటిలో ఏర్పడ్డాయంటే ఆ స్మెల్ భరించలేం.

English summary

things to do to avoid bad breath

Bad breath is a common condition and there are several ways to prevent it. Read further to know how to avoid bad breath.
Story first published: Friday, December 1, 2017, 9:40 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter