For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లిని పరగడుపుతోనే ఎందుకు తినాలి? ఆరోగ్య రహస్యాలేంటి...

వెల్లుల్లి శాస్త్రీయ నామము " అల్లియమ్ సాటివుమ్(allium sativum) " , వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర

|

సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు న్యూజెర్సీకి చెందిన వైద్యులు. పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు.

వెల్లుల్లి శాస్త్రీయ నామము " అల్లియమ్ సాటివుమ్(allium sativum)", వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి ... నీరుల్లికి దగ్గర చుట్టం ..అందుకే దాని కన్నా ఔషధ గుణాలు ఎక్కువ.

READ MORE: రోజూ ఉదయం తేనె+ఒక్క వెల్లుల్లిపాయ 7 రోజులు తింటే బాడీలో జరిగే అద్భుత మార్పులు

వంటిట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని, గుమగుమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుందని, తింటే వాసన వస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ... ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది , కాలేయము ఆరోగ్యానికి ,కీళ్ళనొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే శరీరాన్ని ఇతర వ్యాధుల బారినపడకుండా కాపాడుతుంది.

READ MORE: ఒక వెల్లుల్లి రెబ్బను దిండు కింద పెట్టి చూడండి..! ఏమవుతుంది ?

దాదాపు అన్ని ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డానికి వెల్లుల్లి వాడుతారు. ఆయుర్వేద ఔష‌ధాల త‌యారీల‌లో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది. మ‌రి ఎన్నో ఔష‌ధ గుణాలున్న వెల్లుల్లిని ఉద‌యం ఖాళీ క‌డుపుతో తీసుకుంటే ఇంకెన్ని లాభాలుంటాయో తెలుసా. ఉద‌యాన్నే వెల్లుల్లి తింటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చంటున్నారు నిపుణులు. దీన్ని పరగడుపున తింటే సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌లా పనిచేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి పరగడుపున వెల్లుల్లి ఎందుకు తినాలి తెలుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

 పొట్టలోని బ్యాక్టీరియాను నశింపచేస్తుంది:

పొట్టలోని బ్యాక్టీరియాను నశింపచేస్తుంది:

ఇది నాచురల్‌ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ.

 ఔషధ విలువలు:

ఔషధ విలువలు:

ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యుల ప్రకారం హృదయ సంబంధ వ్యాధులు, కేశవృద్ధికి, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ల్యుకోడెర్మా కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఆధునిక పరిశీలనలు కూడా వీటిని నిరూపిస్తున్నాయి.

ఛాతీ సంబంధ వ్యాధులు:

ఛాతీ సంబంధ వ్యాధులు:

ఛాతీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాధులను వెల్లుల్లి సమర్ధవంతంగా నివారిస్తుంది. శ్వాసకోశాలకు పట్టిన కొవ్వును కరిగించి శ్వాస సక్రమంగా జరిగేట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల క్షయ వ్యాధికి వెల్లుల్లి సరిఅయిన ఔషధం అని డాక్టర్‌ మెక్‌డుఫీ కనుగొన్నారు. న్యుమోనియాకు వెల్లుల్లి అద్భుతమైన ఔషధమని డాక్టర్‌ ఎఫ్‌. డబ్లూ్య, క్రాస్‌మాన్‌ అంటారు. 48 గంటల లోపల టెంపరేచరును, నాడీ చలనాన్ని, శ్వాసను దారిలోకి తెస్తుందని అంటున్నారు. వెల్లుల్లిని నీటిలో మరగబెట్టి క్షయవ్యాధి రోగులు సేవిస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది. ఒక గ్రాము వెల్లుల్లిని ఒక లీటరు పాలు, ఒక లీటరు నీటిలో కలిపి ఆమొత్తం నాలుగోవంతు మిగిలేదాకా మరగబెట్టి ఆ వచ్చిన డికాక్షన్‌ని రోజుకు 3 సార్లు సేవిస్తే క్షయ నయమవుతుంది.

ఉబ్బసం:

ఉబ్బసం:

వెల్లుల్లిలోని 3 పాయలను పాలలో కలిపి మరగబెట్టి రాతవేళల్లో సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లిలోని ఒక పాయను చితకకొట్టి 120 మిల్లిలీటర్ల మాల్‌‌ట - వెనిగార్‌తో కలిపి మరగబెట్టి, తర్వాత చల్లార్చి పడగట్టి, అంతే పరిమాణవు తేనెను అందులో కలిపి ఒక సీసాలో నిలవ ఉంచుకోవాలి. రెండు లేక మూడు మూడు స్పూన్లు ఈ సిరప్‌ను మెంతికూర డికాక్షన్‌తో కలిపి సాయంత్రం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారీ ఒకటి లేక రెండు సార్లు చొప్పున సేవిస్తే ఉబ్బసం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి.

జీర్ణకోశ వ్యాధులు:

జీర్ణకోశ వ్యాధులు:

జీర్ణకోశ వ్యాధులకు వెల్లుల్లి చక్కటి ఔషదంగా ఉపయోగపడుతుంది. ఇది లింఫ్‌ గ్రంధుల మీద ప్రభావాన్ని చూపి శరీరంలో ఉన్న మలిన పదార్థాలను బయటికి పంపటంలో సహకరిస్తుంది. వెల్లుల్లి అరుగుదలకు ఉపయోగపడే రసాలను ప్రేరేపిస్తుంది. వెల్లుల్లిని ముద్దలుగా నూరి పాలతో గాని నీటితో గాని కలిపి సేవిస్తే అరుగుదల చక్కగా ఉంటుంది. జీర్ణయంత్రాంగానికి సోకే అన్ని రకాల అంటురోగాలనూ వెల్లుల్లి సమర్థవంతంగా అరికడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. అందుకు కారణం- వెల్లుల్లిలో ఉన్న యాంటీ సెప్టిక్‌ గుణం!

హై బీపి నియంత్రణలో:

హై బీపి నియంత్రణలో:

బీపిని తగ్గించటానికి సమర్థవంతమైన వైద్యంగా వెల్లుల్లి తగ్గిస్తుంది. చిన్న ధమనులు మీద పడే ఒత్తిడిని, టెన్షన్‌నూ వెల్లుల్లి తగ్గిస్తుంది. నాడి చలనాన్ని నిదానపరిచి గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఊపిరి అందకపోవటం, కళ్ళు తిరగటం, కడుపులో వాయువు ఏర్పడటం లాంటివాటిని అరికడుతుంది. మందుల షాపులలో లభించే వెల్లుల్లి క్యాప్యూల్‌‌సని రోజుకు రెండు లేదా మూడిటిని వేసుకోవటం ద్వారా బీపిని దారిలోకి తెచ్చుకోవచ్చు.

 వాత రోగాలు:

వాత రోగాలు:

వెల్లుల్లిలో వాపును తగ్గించే గుణం ఉంది. వాతరోగానికి గురైన ప్రదేశాన వెల్లుల్లి రసాన్ని మర్ధన చేయటం వల్ల ఆ భాగంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. వెల్లుల్లి తైలాన్ని చర్మం పీల్చుకొని రక్తంలో కలిసి వేగంగా నొప్పులను నివారిస్తుంది.

 గుండెపోటు నివారణలో:

గుండెపోటు నివారణలో:

ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనలలో వెల్లుల్లి గుండెపోటును సమర్థవంతంగా నివారిస్తుందని వెల్లడించారు. వెల్లుల్లి రక్త కణాల్లో కొలెస్ట్రాల్‌ని కరిగించి రక్తం సాఫీగా సాగేట్లు సహకరిస్తుందనీ, దీనితో హైబీపీ, గుండెపోటు నివారించబడతాయనీ నిర్ధారించారు. గుండె పోటు వచ్చిన రోగి వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట్రాల్ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల అంతకు పూర్వం గుండెకు జరిగిన డామేజ్‌ అయితే తొలగిపోదు గాని తిరిగి గుండెపోటు వచ్చే అవకాశాలు మాత్రం తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

 లైంగిక సంబంధ వ్యాధులు:

లైంగిక సంబంధ వ్యాధులు:

వంధ్యత్వ నివారణకు వెల్లుల్లి ఉపయోగపడుతుందని ప్రముఖ ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సెక్స్ సామర్ధ్యం సన్నగిల్లడం, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం తదితర సెక్స్ సంబంధ లోపాలకు వెల్లుల్లి దివ్యౌషధమని అంటారు.

వంటకాలలో:

వంటకాలలో:

మన ఆహారంలో ఉల్లిని తరచుగా ఉపయోగిస్తే, వెల్లుల్లిని అరుదుగా ఉపయోగిస్తుంటాం. కానీ వెల్లుల్లిని వాడటం దీర్ఘకాల ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. వెల్లుల్లిని వంటకాలలో బహు విధాలుగా వాడతారు. వెల్లుల్లిని నీరుల్లి, అల్లం, టమోటాలతో కలిపి వాడితే రుచిగా ఉండడమే కాక చాలా రోజులపాటు చెడిపోకుండా కూడా ఉంటుంది.

 విటమెన్లూ అధికమే:

విటమెన్లూ అధికమే:

వెల్లుల్లిని పచ్చిగా కాని, ఆహార పదార్థాలతో గానీ వండుకుని, వేయించుకుని మందులాగా కానీ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయం. వెన్నలో వేయించుకుని రోజుకు ఏడు, ఎనిమిది వెల్లుల్లి పాయల్ని తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా తయారై క్రియాశీలతను పెంచుకుంటుంది. ఇందులో విటమిన్‌- సి, బి6, సెలీనియమ్‌, జింక్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌ వంటి లక్షణాలు ఉన్నాయి. విటమిన్‌-సితో అల్లిసిన్‌ కలిపి పని చేయడంవల్ల బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను నిరోధించడం చాలా తేలిక అవుతుంది. అంతేకాదు వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడంవల్ల విటమిన్‌-సి, అల్లిసిన్‌ల పనితనం మరింతగా పెరుగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి:

రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి:

జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శికాల ఉంటాయి. ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆస్త్మాను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది.

ముఖవర్చస్సు పెంచుకోవడానికి :

ముఖవర్చస్సు పెంచుకోవడానికి :

ముఖం , శరీరం వర్చస్సు ఆకర్షణీయంగా ఉండాలంటే రెండు వెల్లుల్లి పాయల రసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి . దీనివల్ల రక్తం శుభ్రపడి దేహకాంతి పెరుగుతుంది . అపుడు చాక్లెట్లు , మసాలా వస్తువులు తినకూడదు . మొటిమలకి కారణమయ్యే బ్యాక్టీరీయాని చంపే గుణం వెల్లుల్లికి ఉంది. అందుకని మొటిమలపైన వెల్లుల్లి రెబ్బని మెత్తగా చేసి రాస్తే అవి త్వరగా పోతాయి.

బ్లడ్ ఫ్యూరిఫైయర్:

బ్లడ్ ఫ్యూరిఫైయర్:

ఒక వెల్లుల్లి పాయ తిని , రాగిచెంబు లో నీరు సాధ్యమైనంత ఎక్కువ తాగితే రక్తంలోని వ్యర్ధ పదార్ధాలు మూత్రం ద్వారా వచ్చేసి కిడ్నీలు శుభ్రపడుతాయి. దాంతో మన శరీరం మొత్తం శుభ్రపడుతుంది.

బరువు తగ్గించుకోవచ్చు:

బరువు తగ్గించుకోవచ్చు:

ఒళ్ళు తగ్గాలని అనుకుంటున్నారా .. సగం నిమ్మకాయ రసం లో కొంచెం వేడి నీళ్లు కలిపి అందులో రెండు వేల్లుల్లిపాయల రసం కలిపి ఉదయము , సాయంత్రం తీసుకుంటే క్రమముగా ఒళ్ళు తగ్గుతుంది . ఈ సమయం లో కొవ్వుపదార్ధాలు , పగటి నిద్ర మానేయాలి . . . కొంచెం వ్యాయాయం చేయాలి ( నడక).

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

మనం తినే ఆహారంలోని కలుషిత, మలిన పదార్థాల వల్ల మన శరీరంలో వయసు పెరగడాన్ని ప్రేరేపించే ఫ్రీరాడికల్స్ పెరుగుతాయి. ఇవి వయసు పెంచడంతో పాటు కొందరిలో ఒక్కోసారి క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే యాంటాక్సిడెంట్ ఫ్రీ-రాడికల్స్‌ను వెంటనే హరిస్తుంది. ఫలితంగా మనలో అది వయసు పెరగడాన్ని, క్యాన్సర్‌ను నిరోధిస్తుంది.వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల‌ పెద్ద పేగు క్యాన్సర్, పురీషనాళ, స్టమక్, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను నివారించటానికి తోడ్ప‌డుతుంది.

గాయాలను మాన్పుతుంది:

గాయాలను మాన్పుతుంది:

అంతే కాకుండా. ఒక్కో సారి అనుకోకుండా శరీరంపై గీసుకుపోయినప్పుడు సమయానికి ఏ మందూ అందుబాటులో లేనప్పుడు వెల్లుల్లిని కాస్తంత రుద్దితే చాలు బ్యాక్టీరియాను అది నిరోధిస్తుంది.

రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది:

రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది:

వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాల్లోని సాగే గుణం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లి తిననివారిలో కంటే దాన్ని క్రమం తప్పకుండా తినే వారిలో రక్తనాళాలు సాగే గుణం 72% అధికంగా ఉంటుంది.

స్ట్రెస్ బూస్టర్ :

స్ట్రెస్ బూస్టర్ :

వెల్లుల్లి ఆకలిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని పూర్తీగా తగ్గించే శ‌క్తి వెల్లుల్లికి ఉంది. ఒత్తిడికి గురైనప్పుడు, కడుపులో ఆసిడ్ లు అధిక మొత్తంలో విడుదలవుతాయి. అలాంటి సమయంలో వెల్లుల్లి ఈ ఆసిడ్ ల స్థాయిలను తగ్గించి, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అలర్జీలను నివారిస్తుంది:

అలర్జీలను నివారిస్తుంది:

అలర్జీని తరిమికొట్టాలంటే వెల్లుల్లి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మూడు వారాల పాటు రోజుకు మూడు వెల్లుల్లి పాయలను తింటే అలర్జీకి చెక్ పెట్టవచ్చు. దంతసమస్యలను కూడా వెల్లుల్లి నయం చేస్తుంది. రోజూ మూడు వెల్లుల్లి పాయల్ని తీసుకుంటే జలుబు, అంటువ్యాధులు, ఉదరసంబంధిత వ్యాధులు దరిచేరవు.

English summary

Why Eat Garlic On Empty Stomach

Why Eat Garlic On Empty Stomach,You must have tried consuming lemon and honey in the morning. You might have also tried drinking green tea first thing in the morning but have your tried garlic on empty stomach? It is healthy. Eating raw garlic on empty stomach offers several health benefits and we shall discuss about them in this article.
Desktop Bottom Promotion