For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి సందర్భాలలో మీరు ఎక్కువ ఉప్పుని తీసుకోవచ్చు?

By Ashwini Pappireddy
|

వాస్తవానికి కొన్ని సందర్భాలు లేదా వైద్య పరిస్థితులు మిమల్ని ఎక్కువ ఉప్పును తినమని డిమాండ్ చేస్తాయని మీకు తెలుసా?

ప్రస్తుతం రోజుకి 2300 mg చొప్పున ఉప్పుని తీసుకోమని సిఫార్సు చేయబడుతోంది. కొంతమంది ప్రజలు తగినంత మొత్తంలో సోడియం ను తింటారు మరియు మరికొంతమంది ఎక్కువ మొత్తంలో వాడతారు.

ఉప్పు ఉపయోగించి ఆరోగ్య సమస్యలు నయం చేయటానికి 13 మార్గాలు

మీరు మీ ఉప్పు ని తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నిజానికి కొన్ని పరిస్థితులు లేదా కండిషన్స్ మిమల్ని ఎక్కువ ఉప్పుని తీసుకునేలా డిమాండ్ చేయవచ్చు.

కానీ మీరు మీ ఉప్పును తీసుకొనే పద్ధతిలో మార్పు ను తీసుకురావాలనుకున్నట్లైతే, ముందుగా ఈ విషయం గురించి మీ డాక్టర్ తో సంప్రదించడం చాలా ముఖ్యం.

ఈ ఆర్టికల్లో, ఒక వ్యక్తి మరింత ఉప్పు ని ఎప్పుడు తీసుకోవచ్చనే కారణాల గురించి మేము ప్రస్తావించాము. కాబట్టి, ఈ పరిస్థితుల్లో మనం ఎందుకు ఎక్కువ ఉప్పును తినాలి అని మరింత తెలుసుకోవడానికి మరింత చదవండి.

ముఖం, ముక్కు మీద బ్లాక్స్ హెడ్స్ ను మాయం చేసే సాల్ట్ చిట్కాలు

1. మీరు కొన్ని మారథాన్ వ్యాయామాలలో పొల్గొనేటప్పుడు:

1. మీరు కొన్ని మారథాన్ వ్యాయామాలలో పొల్గొనేటప్పుడు:

అధిక-వ్యాయామాలలో పాల్గొనే అథ్లెట్స్ కి ఎక్కువ సోడియం అవసరమవుతుంది. లేకపోతే అది హైపోనట్రేమియాకు దారి తీస్తుంది, దీనివలన రక్తంలో సోడియం తగ్గిపోతుంది, ఇంకా మైకము మరియు బలహీనతకు కూడా కారణమవుతుంది.

2. మీరు ఒక వేడి మగ్గి వాతావరణంలో నివసిస్తున్నప్పుడు:

2. మీరు ఒక వేడి మగ్గి వాతావరణంలో నివసిస్తున్నప్పుడు:

మితిమీరిన రీతిలో చెమట పట్టడం వలన శరీరంలో సోడియం స్థాయి పడిపోతుంది. అధికంగా చెమట పట్టడం వలన హైపోనట్రేమియాకు కూడా దారి తీస్తుంది.

3. మీరు ఈ మెడికల్ కండిషన్ లో ఉన్నప్పుడు:

3. మీరు ఈ మెడికల్ కండిషన్ లో ఉన్నప్పుడు:

సాల్ట్-కోల్పోతున్న నెఫ్రోపతీ అనేది మూత్రపిండాల యొక్క రూపం, ఇది మీ సోడియం లెవెల్స్ ని మైంటైన్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. ఈ పరిస్థితి లో ఉన్నవారు వారి మూత్రం ద్వారా అదనపు సోడియం ని కోల్పోతారు, అందుచే వారు వారి సోడియం స్థాయిలను అన్ని విధాలుగా పెంచుకోవాల్సి ఉంటుంది.

4. మీరు మూత్రవిసర్జన మెడికేషన్ తీసుకొంటున్నప్పుడు:

4. మీరు మూత్రవిసర్జన మెడికేషన్ తీసుకొంటున్నప్పుడు:

మూత్రవిసర్జన మీ శరీరంలో మినరల్ అసమానతలకు దారితీస్తుంది, తద్వారా మీ మూత్రపు ఉత్పత్తి పెరుగుతుంది. అందువల్ల, ఈ కేసులో సోడియం నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది మరింత ఉప్పు తినడానికి గల కారణాల్లో ఒకటి.

5. మీరు వయసు లో పెద్దవాడై ఉన్నప్పుడు:

5. మీరు వయసు లో పెద్దవాడై ఉన్నప్పుడు:

80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, వారి ఉప్పును తీసుకోవడం ద్వారా మెదడును బూస్ట్ చేయగలుగుతారు.ఆహారంలో తక్కువ సోడియం ని తీసుకునే వాళ్ళతో పోలిస్తే, సోడియం ని ఎక్కువ మోతాదులో తీసుకుంటున్న పెద్దవారి మెదడు పనితీరు బెటర్ గా ఉందని అధ్యయనం లో తేలింది.

6. మీరు ఈ అరుదైన సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లయితే:

6. మీరు ఈ అరుదైన సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లయితే:

బార్టెర్ సిండ్రోమ్ అని పిలవబడే పరిస్థితుల క్లస్టర్ మీరు తినే ఉప్పుని ప్రాసెస్ చేయడానికి మూత్రపిండాల యొక్క సామర్థ్యం మీద ప్రభావితం చేయవచ్చు. ఈ పరిస్థితిలో కొన్ని లక్షణాలు అధిక దాహంతో పాటు వాంతులు రావచ్చు.

English summary

When Should You Include More Salt in Telugu

In this article, we have mentioned the reasons on when a person needs to include more salt. So, read further to know more on why should we eat more salt under these conditions.
Story first published: Monday, October 9, 2017, 16:40 [IST]