For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలనొప్పిరావడానికి ఇవి కూడా కారణాలే!

ఎప్పుడెప్పుడు తలనొప్పి వస్తోంది అని ఆలోచిస్తే కారణాన్ని గుర్తించవచ్చు. ఒత్తిడికి గురైనా, తల, మెడలోని కండరాలు బిగుతుగా అవటం వల్ల, ఒత్తిడి, కెఫీన్‌ మానేయటం, టెన్షన్‌ కు గురవ్వడం ఇలాంటివన్నీ తలనొప్పికి క

By Y. Bharath Kumar Reddy
|

ప్రతి ఒక్కరూ ఎప్పుడూ బాధపడే సమస్యే తలనొప్పి. ఇది తరచుగా అందరినీ పలకరిస్తూనే ఉంటుది. కొద్దిసేపు సతమతం చేసేస్తుంది. తలపట్టుకునేలా చేస్తుంది. అప్పడు ఈ నొప్పి ఏమిటో బాధను అనుభవించినవారికే తెలుస్తుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటో తెలియక చాలామంది ఆందోళనకు గురువుతుంటారు. ఈ టైమ్ లో ఏ పని చేయాలనిపించదు.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నప్పుడు దానికి కారణమేంటనేది తెలుసుకుంటే అందుకు తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి మనకు దేనివల్ల తలనొప్పి వచ్చిందనే విషయాన్ని కూడా ఈజీగా గుర్తుపట్టొచ్చు.

headache causes

ఎప్పుడెప్పుడు తలనొప్పి వస్తోంది అని ఆలోచిస్తే కారణాన్ని గుర్తించవచ్చు. ఒత్తిడికి గురైనా, తల, మెడలోని కండరాలు బిగుతుగా అవటం వల్ల, ఒత్తిడి, కెఫీన్‌ మానేయటం, టెన్షన్‌ కు గురవ్వడం ఇలాంటివన్నీ తలనొప్పికి కారణం అవుతాయి. మరి ఇంకా ఎలాంటి కారణాల వల్ల తలనొప్పి వస్తుందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి మరి.

1. ఆల్కాహాల్ హ్యాంగోవర్స్

1. ఆల్కాహాల్ హ్యాంగోవర్స్

సాధారణంగా చాలామంది ఆల్కాహాల్ హ్యాంగోవర్స్ వల్ల ఇబ్బందులుపడుతుంటారు. మద్యపానం బాడీపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఆదివారం రోజు రాత్రి ఫుల్ గా తాగి ఎంజాయ్ చేశారనుకో.. సోమవారం ఉదయం మీకు చుక్కలు కనపడతాయి. హ్యాంగోవర్ వల్ల తలపట్టుకోవడంలాంటి సమస్య ఎదురువుతుంది. హాంగోవర్ వల్ల బాడీ మొత్తం డీ హైడ్రేషన్ అవుతుంది. దీంతో తలనొప్పి ఎక్కువ అవుతుంది.

2. ఎలా అంటే అలా కూర్చొవడం

2. ఎలా అంటే అలా కూర్చొవడం

మీరు ఆఫీసుల్లో గానీ ఎక్కైడైనాగానీ కుర్చీపై కూర్చొన్నప్పుడు ఎలా అంటే కూర్చొకూడదు. కొందరు కుర్చీ మీదే కూర్చొనే టేబుల్ పై తలవాల్చి నిద్రపోతుంటారు. దీంతో తలలోకి రక్తం ప్రవహించి తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది. అందువల్ల కుర్చీ పై కూర్చొనేటప్పుడు జాగ్రత్తగా కూర్చొండి.

3. ఆందోళన

3. ఆందోళన

ఆందోళన, ఒత్తిడి, ఓవర్-థింకింగ్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇవి శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. కార్టిసాల్ అనే హర్మోన్ స్థాయి పెరిగితే తలనొప్పి వస్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉండండి.

4. హై బ్లడ్ ప్రెజర్

4. హై బ్లడ్ ప్రెజర్

మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే మీలో అప్పుడప్పుడు తలనొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అధిక రక్తపోటు వస్తుందో అప్పడు ఆటోమేటిక్ గా మీరు తలనొప్పికి గురువుతు ఉంటారు.

5. డిప్రెషన్

5. డిప్రెషన్

డిప్రెషన్ వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. మన మెదడులో సెరోటోనిన్ స్థాయి పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా తలనొప్పికి గురువుతూ ఉంటాం. అందువల్ల వీలైనంత వరకు డిప్రెషన్ కు గురవ్వకుండా ఉండండి.

6. టీత్ గ్రైండింగ్

6. టీత్ గ్రైండింగ్

మీరు తరచుగా మీ పళ్లను కొరుకుతుంటారా? అయితే ఈ అలవాటు కూడా మీలో తలనొప్పి సమస్య రావడానికి కారణం అువుతుంది. ఎందుకంటే దీని ద్వారా మీ తల చుట్టూ ఉండే కండరాలన్నీ వ్యాకోచిస్తాయి. దీంతో తలనొప్పి వస్తుంది. ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే తగ్గించుకోండి.

7. నికోటిన్ తీసుకోవడం మానేసినప్పుడు

7. నికోటిన్ తీసుకోవడం మానేసినప్పుడు

పొగతాగడం వల్ల కూడా మీకు తలనొప్పి వస్తూ ఉంటుంది. ధూమపానం వల్ల చాలా వ్యాధుల బారినపడాల్సి వస్తుంది. దీంతో మీరూ సిగరెట్లలోని నికోటిన్ ను అలవాటై పోయి ఉంటారు. సడన్ గా మీరు సిగరెట్స్ కు దూరమైతే తలనొప్పికి గురికావాల్సి వస్తోంది. అందువల్ల వీలైనంత వరకు నికోటిన్ కు దూరంగా ఉండండి.

8. కాఫీ తాగడం మానేసినప్పుడు

8. కాఫీ తాగడం మానేసినప్పుడు

మనలో చాలామంది రోజూ కాఫీ తాగుతుంటారు. సిగరెట్లలో నికోటిన్ కు అలవాటు పడే వ్యక్తుల ఏవిధంగా అయితే ఉంటారో.. అలాగే కాఫీలోని కెఫీన్ కు కూడా కొందరు అడిక్ట్ అయి ఉంటారు. అందువల్ల వెంటనే ఒక్కసారిగా కాఫీని తాగడం ఆపితే తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది.

9. అజీర్తి సమస్య

9. అజీర్తి సమస్య

అజీర్తి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమయంలోనూ మీరు తలనొప్పికి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అజీర్తి వల్ల మీ కడుపులో కొన్ని గ్యాస్ లు ఏర్పడుతుంటాయి. దీంతో అవి తలనొప్పికి కారణం అవుతాయి.

English summary

unusual causes for a headache

Here are a few unusual causes for headache that you must be aware of.
Story first published:Monday, November 20, 2017, 15:09 [IST]
Desktop Bottom Promotion