ఈ అవయవాలు లేకున్నా కూడా మనిషి బతకగలడు

By Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మనకు కొన్ని శరీర భాగాలు ఉన్నా లేకపోయినా పెద్దగా నష్టం ఉండదు. కొన్ని ఒక్కొక్కటి ఉన్నా ఫర్వాలేదు. ఎక్కువగా మగవారిలో కేవలం చూడడానికి అందంగా ఉండేందుకు మాత్రమే కొన్ని పార్ట్స్ ఉంటాయి. వాటివల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే కొన్ని జతలుగా అవయవాలుంటాయి. వాటిలో ఒక్కటున్నాచాలు. కొన్నిపూర్తిగా లేకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. అయితే పుట్టుకతోనే మనం వాటితో జన్మించి ఉంటాము కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే కొందరు ఆయా అవయవాలు లేకుండా కూడా జన్మిస్తారు. అయితే వారు చింతించాల్సిన అవసరం లేదు. మరి ఆ అవయవాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా.

1. అర్రేటర్ పిలి మజిల్స్

1. అర్రేటర్ పిలి మజిల్స్

మన చర్మంపై ఉండే జుట్టుకు అటాచ్ అవుతూ కొన్ని చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ కు అనుసంధానంగా ఉంటాయి. మనం ఏదైనా విపరీతమైన ఆసక్తికర వార్త చూసినప్పుడు, అలాగే విన్నప్పుడు గూస్ బంప్స్ కు ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇవి ఉన్నా లేకున్నా అంతగా నష్టం ఉండదు.

2. టాన్సిల్స్

2. టాన్సిల్స్

మనం నోరు పెద్దగా తెరిచి.. ఒక్కసారి అద్దంలో చూసుకుంటే గొంతులో కిందవైపున.. కొండ నాలుకకు ఇరువైపులా రెండు చిన్నచిన్న గోలీల్లాంటివి కనబడతాయి. వాటినే టాన్సిల్స్‌ అంటారు. ఆహారం లేదా మనం పీల్చే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిములతో పోరాడటం వీటి పని. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్‌ బారిన పడతాయి. దీంతో ఇవి వాయటం, గొంతు నొప్పి, గుటక మింగటం కష్టంగా తయారవటం.. జ్వరం.. తదితర బాధలు వస్తాయి. ఇవి ఎక్కువగా ఇన్ పెక్షన్ కు గురువుతూ ఉంటాయి. వీటి వల్ల అంతగా ఉపయోగం ఏమీ ఉండదు. ఇవి ఎక్కువగా శరీరానికి ట్రబుల్ ఇస్తు ఉంటాయి. అయితే ఇవి లేకపోవడం వల్ల మరణించిన వారు దాదాపుగా ఎవరూ ఉండరు.

3. అపెండిక్స్

3. అపెండిక్స్

చిన్నపేగు, పెద్ద పేగు కలిసే చోట అపెండిక్స్ ఉంటుది. దీన్నే ఉండుకము అంటారు. అయితే ఇది కొన్నిసందర్భాల్లో ఎర్రగా మారి వాపునకు గురువుతుంది. దీనే్న అపెండిసైటిస్ అంటారు. దీంతో వీపరీతైమన నొప్పి ఏర్పడుతుంది. పెద్ద గులో ఏదైనా పదార్ధం అడ్డుపడితే ఇలాంటి సమస్య వస్తుంది. దీంతో వెంటనే దీన్ని ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంటుంది. ఉండుకము శరీరంలో ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాస్తవానికి ఆహారంలోని సెల్యులోజ్ ను జీర్ణం చేయడానికి ఉండుకము ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అంతగా ఎవరూ ఆహారంలో సెల్యులోజ్ తీసుకోకపోవడంతో వల్ల ఉండుకంతో ఎలాంటి పని ఉండదు. ఉండుకము ఇంచుమించు 10 సెంమీ పొడుగుటుంది.

4. జ్ఞాన దంతాలు

4. జ్ఞాన దంతాలు

ఇవి మనకు జ్ఞానం వచ్చాక వచ్చే దంతాలు. అందువల్లే వీటిని జ్ఞానదంతాలంటారు. అయితే వీటి గురించి పరిజ్ఞానం చాలా మందికి తక్కువగా ఉంటుది. మన దవడ చివరన ఆహారాన్ని నమలడానికి పెద్ద దంతాలు మూడు వస్తాయి. ఆ వరసలో చివరగా వచ్చే దంతాలే జ్ఞానదంతాలు. మిగతా దంతాలన్నీ మనకు ఊహ తెలియకముందే వచ్చేస్తాయి. కానీ మనకు ఊహ తెలిశాక వస్తాయి.మిగతా పళ్లున్న వరసలోనే అవీ వచ్చి... ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉంటే దానితో సమస్య ఉండదు. కానీ అవి ఆలస్యంగా వస్తాయి కాబట్టి... ఈ లోపు వాటికి సంబంధించిన స్థలం మిగతా దంతాల వల్ల ఆక్రమించి ఉంటాయి. సాధారణంగా ఇవి 17 ఏట నుంచి 25వ ఏటి మధ్యన వస్తాయి.

ఇవి చిగురును చీల్చుకు వచ్చే సమయంలో కలిగే నొప్పి, వాపు, ఆ భాగం ఎర్రబారడం కొన్నిసార్లు చిగుర్ల వరస నుంచి చీము వస్తుంది. మనకి పాలపళ్ళు పడిపోయాక వచ్చే శాశ్వత పళ్ల సంఖ్య 32, వాటిలో ఆఖరికి, అంటే మధ్య వయస్సులో వచ్చే దంతాలు జ్ఞాన దంతాలు.

అయిత వీటివల్ల మనకు అంతగా ప్రయోజనం ఏమి లేదు. వీటిని తీసివేసినా ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే జ్ఞాన దంతం ఎప్పుడు తీసినా, పైన క్రింద దంతాలను కలిపి తీసేస్తారు. అలాకాకుండా ఒక్కటే తీస్తే, మిగిలిన పైనా లేక ద దంతం ఇంకా బయటకువచ్చి బుగ్గకు పుండుచేసే ప్రమాదం ఉంది. పైన ఇంకా క్రింద పళ్లు ఒక దానిని ఒకటి తాకినప్పుడే, అవి నవలడంతో సహాయ పడతాయి. అటువంటిది ఆ జతలో ఒక పన్ను లేనప్పుడు, ఇంకొక పన్ను ఉన్నా అది వ్యర్థం.

ఇక జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోతుందని, ఇంకా కళ్ళకి మంచిదికాదని కొందరు అనుకుంటారు. కానీ అది ఎంత మాత్రం నిజంకాదు.

5. డార్విన్స్ పాయింట్

5. డార్విన్స్ పాయింట్

చాలామంది వ్యక్తులకు వారి చెవి పైన ఒక చిన్న మడత ఉంటుంది. దీన్నేడార్విన్స్ పాయింట్ అని పిలుస్తారు. ఇవి చెవి ఆకారాన్ని కాస్త మారుస్తాయి. అయితే ఈ ప్రాంతం చెవికి అంతగా అవసరం లేదు. అలాగే దూరం నుంచి ఎవరైనా పిలిచినప్పుడుగానీ లేదంటే ఏవైనా శబ్దాలు వినడానికిగానీ ఇది అంతగా ఉపయోగపడదు. అందువల్ల ఇది లేకపోయినా మనకు ఎలాంటి నష్టమూ లేదు.

6. చెవి దగ్గర చిన్న హోల్

6. చెవి దగ్గర చిన్న హోల్

కొందరు వారి చెవుల దగ్గర చిన్న హోల్ కలిగి ఉంటారు. ఇది వారికి పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. వీటినే సైనస్ అని పిలుస్తారు. సాధారణంగా వారి పూర్వీకులకు ఉంటే వారికి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు.

7. అడినాయిడ్స్

7. అడినాయిడ్స్

టాన్సిల్స్‌ కు కాస్త వెనకాలగా.. అంగిలి పైవైపున ఉంటుంది ఎడినాయిడ్స్‌. బయటకు కనబడదుగానీ.. ఇది కూడా టాన్సిల్స్‌ లాంటిదే. అడినాయిడ్స్‌ కూడా చాలా సార్లు కూడా బాగా వాచి ఉబ్బుతుంది. దీంతో శ్వాస మార్గం మూసుకున్నట్లై.. గాలి తీసుకోవటంలో ఇబ్బంది మొదలవుతుంది. ఎడినాయిడైటిస్‌ లో ఇది సంకేతం. తరచూ జలుబు, ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారటం, ముఖ్యంగా గురక, నోటితో గాలి పీల్చుకోవటం వంటి లక్షణాలకు అడినాయిడ్స్‌ వాయడమే కారణం. ఇవి చాలా సమస్యలకు కారణం అవుతాయి. అందువల్ల డాక్టర్ ను సంప్రదించి ఏ వయసులోనైనా తొలగించటం మంచిది.

8. పిత్తాశయం

8. పిత్తాశయం

పిత్తకోశం లేదా పిత్తాశయం (గాల్ బ్యాడర్) పైత్యరసాన్ని నిలువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పైత్యరసాన్ని నిలువ ఉంచుకొని జీర్ణక్రియకు అవసరమయినప్పుడు చిన్న పేగులోనికి విడుదలచేస్తుంది.ఇది దాదాపు 10 నుంచి 12 సెంటీమీటర్లు పొడవుగా ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యతో చాలామంది ఇబ్బందులుపడుతుంటారు. ఇలా పిత్తాశయంలో రాళ్లు తరచుగా వస్తుంటే శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేస్తారు. ఇవి కూడా క్యాన్సర్ కు కూడా కారణం అవుతాయి. దీన్ని తొలగించినా కూడా పెద్దగా నష్టం ఉండదు.

9. రిడండెన్సీ ఆర్గన్స్

9. రిడండెన్సీ ఆర్గన్స్

మనకు బాడీలో చాలా రిడెండెన్సీ అవయవాలు ఉన్నాయి. ఇవి రెండు చొప్పున ఉంటాయి.. వీటిలో ఒక్కొక్కటి ఉన్న కూడా బతుకొచ్చు. ఒక మూత్రపిండం, ఒక ఓవరి, కేవలం ఒక వృషణముతో కూడా సంతోషంగా బతకొచ్చు. అయితే వీటిలో ఒక్కక్కటి చొప్పున ఉన్నా కూడా అవి ఆరోగ్యంగా ఉంటే చాలు. వీరు ఒకే వృషణం కలిగి ఉన్నా కూడా అది రెండో దాని వల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేస్తుంది.

10. పల్మరిస్ మజిల్

10. పల్మరిస్ మజిల్

ఈ కండరము మోచేతి నుంచి మణికట్టు వరకు ఉంటుంది. సాధారణంగా ఈ కండరాన్ని మనం ఎక్కువగా ఉపయోగించం. ఇది ఎక్కువగా వేలాడడానికి, పాకడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ కండరం లేకున్నా కూడా మనం బతకగలం.

11. ఇయర్పీస్ కండరాలు

11. ఇయర్పీస్ కండరాలు

చెవి చుట్టూ కండరాల సమూహం ఉంది. సాధాణంగా జంతువుల్లోనూ ఇలాంటి నిర్మాణమే ఉంటుది. అలాగే మనషుల్లోనూ చెవి చుట్టూ ఇలాంటి కండరాలే ఉంటాయి. అయితే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎక్కువగా జంతువులు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటాయి. వాటిని అనారోగ్యంగా ఉన్నా లేదంటే ఏదైనా బాధప కలిగినప్పుడు చెవులను విదిలిస్తూ ఉంటాయి. అయితే మనషులకు ఆ అవసరం లేదు కదా. అందువల్ల ఇవి లేకపోయినా కూడా మనిషి బతకగలడు.

12. ప్లాంటరిస్ కండరము

12. ప్లాంటరిస్ కండరము

దీన్నే అరికాలి కండరము అంటారు. అయితే సుమారు 9% మంది ఈ కండరాలు లేకుండానే జన్మిస్తారు. అయినా వారికి ఎలాంటి నష్టంగానీ, ఇబ్బందిగానీ ఉండదు. ఒకవేళ ఇది ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ కండరము లేకున్నాగానీ మనుషులు బతకలగలరు.

13. ప్లీకా సెమిలునారిస్

13. ప్లీకా సెమిలునారిస్

సరీసృపాలు, పక్షులు మూడో కనురెప్పలను కలిగి ఉంటాయి. అందువల్ల వాటికి కంటి చివరను స్పేస్ అవసరం. అయితే మనకు మూడో కంటి రెప్ప ఏమీ ఉండదు. కానీ అందుకు సంబంధించిన స్పేస్ ఉంటుంది. కంటికి చివర ప్రాంతంలో మూలలో కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది. దీన్నే ప్లికా సెమిలునారిస్ అని పిలుస్తారు. ఈ స్పేస్ లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

14. ఫిల్త్రం

14. ఫిల్త్రం

మీ ముక్కు, ఎగువ పెదవి మధ్య చిన్న డెంట్ నే ఫిల్త్రం అంటారు. ఇది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. గర్భంలో ఉన్నప్పుడే ఇది ఏర్పడుతుంది. అయితే ఇది చూడడానికి కాస్త అందంగా ఉంటుంది. అందువల్ల చాలామంది దీన్ని ఇష్టపడుతుంటారు. అయితే ఇది ఉన్నా లేకున్నా అంతగా మనకొచ్చింది ఏమీ లేదు కదా.

15. చెస్ట్ పై వెంట్రుకలు

15. చెస్ట్ పై వెంట్రుకలు

తలపై జుట్టు ఉంటే అందమే. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే మగవారిలో గడ్డం, మీసాలు కూడా చూడడానికి అందంగా కనపడడానికి ఉపయోగపడతాయి. వీటితో కాస్త సెక్సీ లుక్ వస్తుంది. కానీ మగవారి ఛాతీపై ఉండే జుట్టు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు చెస్ట్ పై జుట్టే అవసరం లేదు. అక్కడ జుట్టు ఉండడం వేస్ట్.

16. జాకబ్సన్ ఆర్గాన్

16. జాకబ్సన్ ఆర్గాన్

సాధారణంగా క్షీరదాలు, ఉభయచరజీవులు, సరీసృపాల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి. జాకబ్సన్ ఫేరోమోన్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. కానీ మనం ఎప్పుడూ కూడా వీటిని వినియోగించం. అందువల్ ఇవి ఉన్నా లేకపోయిన పెద్దగా ఇబ్బంది ఉండదు.

17. కాలి చిటికెన వేలు

17. కాలి చిటికెన వేలు

మనకు రెండు కాళ్లకు మొత్తం పది వేళ్లు ఉంటాయి. అయితే ప్రతి పాదానికి ఉండే చిటికెన వేలు అసలు అవసరం లేదు. మనం చెట్ల కొమ్మలపై ఎక్కువగా నడవం కాబట్టి దీని ఉపయోగం అంతగా ఉండదు. మనం ఈ కాలి చిటికెన వేల్లు లేకున్నా కూడా బాగా నడవగలం. పరుగెత్తగలం.

18. నిపుల్స్

18. నిపుల్స్

మగవారికి ఇవి అస్సలు అవసరం లేదు. ఆడవారు మాత్రం వారి బిడ్డలకు పాలు ఇవ్వాలి కాబట్టి వారికి అవసరం. మగవారు ఎవరికీ పాలు ఇచ్చే అవసరం అయితే లేదు కదా. అందుకు ఇవి ఉన్నా లేకున్నా బతకగలడు. అయితే మహిళలకు పిల్లలకు పాలు ఇవ్వడానికి మాత్రం నిపుల్స్ కచ్చితంగా ఉండాలి. చాలామందికి పెళ్లికాకముందు ఇవి అంతగా కనపడకపోవొచ్చు. గర్భం ధరించినపుడు ఇవి బయటకు వస్తాయి. ఒకవేళల నిపుల్స్ లేని మహిళలు మాత్రం నిపిల్ షీల్డ్ ధరించవచ్చు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Useless Body Parts You Could Totally Live Without

    We have body parts we don’t need. Some are only useful in childhood; some are redundant; and some are leftovers from when we didn’t walk upright.Here are Some Useless Body Parts You Can Actually Live Without.
    Story first published: Friday, November 17, 2017, 12:49 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more