డయాబెటిస్ ముప్పును నివారించడానికి, పరిశోధనల ద్వారా వెల్లడించబడిన ఒక ఉత్తమమైన మార్గం

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాను తీవ్రంగా ప్రభావితం చేసే జీవనశైలి వ్యాధులలో "డయాబెటిస్" ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, 1980 లో మధుమేహం ఉన్న వారి సంఖ్య 108 మిలియన్లు కాగా, అది 2014 నాటికి 422 మిలియన్లకు పెరిగింది.

ఒక కొత్త పరిశోధనలలో, సరిపోయినంత విటమిన్-డి ని చిన్నతనంలో మరియు బాల్యంలో పొందటంవల్ల జన్యుపరంగా సంక్రమించే డయాబెటిస్ ప్రమాదాన్ని ముందుగానే పిల్లల్లో తగ్గిస్తుందని కనుగొన్నారు.

ఈ అధ్యయనం కోసం, US లో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు, రక్తంలో ఉన్న విటమిన్-డి స్థాయిలను మరియు స్వయంచలిత రోగనిరోధకత కణాల మధ్య గల సంబంధాన్ని పరిశీలించారు. ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్లో ఉన్న కణాలపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేసేటప్పుడు, స్వయం రోగనిరోధక కణాలు అనేవి ప్రతిరోధకాల చేత గుర్తించబడేవిగా కనబడతాయి. ఈ కారణం చేతనే మొదటి రకం డయాబెటిస్ వాటిల్లే ప్రమాదం ఉంది.

పరిశోధకుల అధ్యయనం ప్రకారం, మొదటి రకం మధుమేహం దీర్ఘకాలిక స్వయం నిరోధిత వ్యాధిగా ఉంటూ, ఇది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 3-5 శాతం పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ వ్యాధి 10 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలలో అత్యంత సాధారణ జీవక్రియ సమస్యగా ఉంది. చిన్న పిల్లలలో, ఈ కొత్త కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది.

రోగనిరోధక వ్యవస్థ మరియు స్వయం రోగ నిరోధకతను నియంత్రిస్తున్నందున ఈ మొదటి రకం మధుమేహమును నిరోధించడం కోసం, విటమిన్-D అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా, విటమిన్-డి యొక్క హోదా అనేది కాలంతో పాటు మారుతూ ఉంది. అయినప్పటికీ, విటమిన్-డి యొక్క స్థాయిలు మరియు స్వీయ రోగనిరోధకత కణాల మధ్య అనుబంధాలు అస్థిరమైనవిగా ఉన్నాయి.

జనాభాలో విటమిన్-D యొక్క వైవిధ్యమైన స్థాయిలు (లేదా) వైఫల్యాలకు గల కారణాలు మరియు, అంతర్లీన జన్యు వైవిధ్యాలలో విటమిన్-డి యొక్క మిశ్రమ ప్రభావానికి కారణాలుగా వున్న వివిధ రకాల అధ్యయనాల నమూనాల వల్ల బయటపడినవిగా చెప్పవచ్చు.

diabetes risk

ఇలా తెలుసుకోబడిన విషయాలన్నీ, ది ఎన్విరాన్మెంటల్ డిటర్మినంట్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ది యంగ్ (TEDDY) అనే అధ్యయనంలో ఒక భాగంగా ఉంది, ఈ మొదటి రకమైన మధుమేహం 8,676 మంది పిల్లలలో చాలా ప్రమాదకరమైన స్థాయిలో పెరిగినట్లుగా ఉన్న దీని బారినుండి వీరిని రక్షించే కారకాల కోసం చూస్తుంది.

చిన్నపిల్లల నుండి ప్రతి 3 - 6 నెలలకు ఒకసారి సేకరించిన రక్త నమూనాలను యొక్క ఆధారంగా ఉన్న స్వయం రోగనిరోధక కణాల యొక్క వ్యవస్థను మరియు విటమిన్-డి యొక్క స్థాయిల ఫలితాలను అనుసరిస్తారు.

diabetes risk

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు స్వయం రోగనిరోధక కణాల వ్యవస్థను అభివృద్ధి చేసిన 376 పిల్లలను - 1,041 మంది సాధారణ పిల్లలతో పోల్చగా, విటమిన్-డి ను గ్రహించే మానవ కణాల యొక్క జన్యు వైవిధ్యం కలిగిన పిల్లల చేత, విటమిన్-డి ను గ్రహించని పిల్లలను పోల్చగా, వీరికి బాల్యంలోనే మరియు చిన్నతనం నుండే స్వయం రోగనిరోధక కణాల శక్తిని మరింతగా అభివృద్ధి చేసుకునే వ్యవస్థను కలిగి ఉన్నారనే విషయం బట్టబయలైంది.

ఈ అధ్యయనం మొదటిసారిగా విటమిన్-డి స్థాయిలు ఉన్నతంగా ఉన్న శిశువులలో "IA" (Islet autoimmunity) యొక్క ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని చూపించాయి. "ఈ అసోసియేషన్ 'అందుకు తగిన కారణాలను మరియు ప్రభావాల' గూర్చి నిరూపించబడలేదు కాబట్టి, విటమిన్-డి యొక్క జోక్యం కారణంగా, మొదటి రకం డయాబెటీస్ను నిరోధించడంలో సహాయపడుతుందో (లేదో) అనే వాస్తవాన్ని నిర్ధారించడానికి భవిష్యత్లో మరిన్ని లోతైన అధ్యయనాల కోసం ఎదురు చూద్దాం" అని కొలరాడో విశ్వవిద్యాలయం, అన్సుట్జ్ మెడికల్ క్యాంపస్ (CU అన్షుత్జ్) నుండి జిల్ నోరిస్ తెలిపారు.

diabetes risk

ఈ అధ్యయనం ఇటీవలే జర్నల్ డయాబెటిస్లో ప్రచురించబడింది.

మొదటి రకం డయాబెటిస్ అంటే ఏమిటి? దాని యొక్క లక్షణాలను తెలుసుకోండి:

మొదటి రకం మధుమేహం, ఇంతకుముందు ఇన్సులిన్-ఆధారితగా పిలవబడేది, ఎందుకంటే ఇన్సులిన్ అనేది సరైన స్థాయిలో ఉత్పత్తిని కలిగి లేకపోవడంగా ఉన్నందువల్ల, దీని కోసం రోజువారీ ఇన్సులిన్ అనేది చాలా అవసరం అవుతుంది.

మొదటి రకం మధుమేహం యొక్క ప్రధాన లక్షణాలు, ఎక్కువగా మూత్రం రావడం (పాలీయూరియా), దాహం (పాలీడిప్సియా), నిరంతర ఆకలిని కలిగి ఉండటం, శరీర బరువును కోల్పోవడం, చూపు మందగించడం మరియు అలసట (ఆయాసం) వంటివి ఉంటాయి. మొదటి రకం మధుమేహం ఉన్న వారిలో ఇలాంటి ప్రధాన సమస్యలు ఆకస్మికంగా సంభవించే లక్షణాలుగా ఉంటాయి.

English summary

Research Reveals One Of The Best Ways To Prevent Diabetes Risk

Diabetes is one of the leading lifestyle diseases that is affecting a large number of population across the globe. A new research has found that getting enough of vitamin D during infancy and childhood can significantly reduce the risk of diabetes in kids genetically predisposed to have the disease.
Story first published: Tuesday, December 19, 2017, 18:00 [IST]