చాలా రోజుల నుండి బాధిస్తున్న మెడ, భుజాల నొప్పి(సర్వైకల్ స్పాండిలోసిస్)ని తగ్గించే మార్గాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ఈమధ్య చాలామందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్ స్పాండిలోసిస్ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. మెడనొప్పే కదా అని నిర్యక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది.

మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. వాటిలో మెడ వెనక భాగంలో తల నుంచి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య కార్టిలేజ్ (మృదులాస్థి) అనే మెత్తటి ఎముక ఉంటుంది. వెన్నుపూసలు సులువుగా కదలేందుకు ఈ కార్టిలేజ్ తోడ్పడుతుంది. అయితే అసంబద్ధ భంగిమల్లో కూర్చోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులు నిర్వర్తించడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం, నిత్యం తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్స్ తగినంత లేకపోవడం మొదలైన కారణాలతో ఈ కార్టిలేజ్ క్షీణించడం జరుగుతుంది. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పులవల్ల మెడనొప్పి వస్తుంది. దీన్నే 'సర్వైకల్ స్పాండిలోసిస్’ అంటారు.

how to prevent cervical spondylosis

సర్వైకల్ స్పాండిలోసిన్ లక్షణాలు మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదిల్చినా నొప్పి తీవ్రవుతుంది. వెన్నుపూస నుంచి చేతులకు బయలుదేరే నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు క్యాపిస్తుంది. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, ఒక్కోసారి తలతిరిగినట్లుగా (వర్టిగో) అనిపిస్తుంది. చేయి పైకి ఎత్తడం కష్టమవుతుంది. బ్యాక్ మజిల్స్, నెక్ మజిల్స్ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల ఇలాంటి నొప్పి వస్తుంది

నెక్ మజిల్స్ చాలా ముఖ్యమైనవి. మన తలను కదల్చడానికి వీటి ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఈ నెక్ మజిల్స్ కేవలం తలను ఎత్తుగా ఉంచడంమాత్రమే కాదు, శ్వాస తీసుకోవాల్నా, బ్రెయిన్ కు రక్తప్రసరణ అందాలన్నా ఇవి చాలా సహాయపడుతాయి, అందువల్ల మన నెక్ మజిల్స్ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా మరియు ఒత్తిడి లేకుండా ఉంచుకోవడం చాలా అవసరం.

యాక్సిడెంట్స్, గాయాలు, లేదా సింపుల్ గా కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే మెడ కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి, ఇంకా నార్మల్ గా మజిల్స్ విస్తరించినప్పుడు కూడా నొప్పి వస్తుంది. అది దీర్ఘకాలిక నొప్పిగా మారుతుంది. ఈ పరిస్థితిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తుంటారు. ఇంకా ఓవర్ వెయిట్, జీవనశైలి, వెన్నెముక దెబ్బతినడం వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ కు కారణం అవుతుంది. ఇంకా హెరిడిటి కూడా కారణం కావచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ కారణంగా మెడ నొప్పి చాలా తీవ్రంగా బాధిస్తుంది. ఈ బాధ నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని నియమాలను పాటించాలి:

1) బరువు తగ్గుట:

1) బరువు తగ్గుట:

సర్వైకల్ స్పాండిలోసిస్ తో బాధపడేవారు మొదట బరువు తగ్గాలి. ఓవర్ వెయిట్ కూడా మెడనొప్పికి కారణం అవుతుంది. బరువు తగ్గడం వల్ల మెడ కండరాల మీద ఒత్తిడి తగ్గి, మెడకండాలు గాయపడకుండా నివారిస్తుంది.

2) డైట్ బ్యాలెన్స్ :

2) డైట్ బ్యాలెన్స్ :

క్యాల్సియ, ఫాస్పరస్, విటమిన్ డి ఎక్కువగా ఉన్న తాజా పండ్లు, వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఉండే అన్ని ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఆక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది. సలాడ్స్, ఉడికించిన కూరలు, రోజువారి ఆహారంలోతప్పనిసరిగా తీసుకోవాలి.

3) హాట్ మరియు కోల్డ్ కంప్రెసర్:

3) హాట్ మరియు కోల్డ్ కంప్రెసర్:

మెడ నొప్పి తగ్గించుకోవడానికి సులభమైన మార్గం ఇది. హాట్ అండ్ కోల్డ్ వాటర్ కంప్రెసర్ ను అప్లై చేయడం వల్ల మెడకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, మెడ కండరాలు రిలాక్స్ అవుతాయి. కోల్డ్ కంప్రెసర్ కూడా ఉపశమనం కలిగిస్తుంది, వాపు, ఎరుపుదనం తగ్గిస్తుంది. నొప్పి తగ్గిస్తుంది.

4) ఎప్సమ్ సాల్ట్:

4) ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో పిహెచ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. మెడవాపు, నొప్పి, ఎర్రగా కందడం తగ్గిస్తుంది. ఎప్సమ్ సాల్ట్ బాత్ చేయడం వల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ తగ్గించుకోవచ్చు.

5) వెల్లుల్లి:

5) వెల్లుల్లి:

వెల్లుల్లి అద్భుతమైన యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్, ఇది మెడ కండరాల నొప్పి, వాపు తగ్గిస్తుంది. దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తుంది. వెల్లుల్లి నూనెను గోరువెచ్చగా చేసి మెడకు అప్లై చేయడం వల్ల కూడా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

6) అల్లం:

6) అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటీర లక్షణాలున్నాయి.ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాంతో నొప్పి తగ్గుతుంది. అల్లం టీ తయారుచేసుకుని రోజు వేడిగా తాగాలి.

7) పసుపు:

7) పసుపు:

సర్వైకల్ స్పాండిలోసిస్ కు మరో ఫేవరెంట్ హోం రెమెడీ పసుపు, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియ యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. కాబట్టి, ఇది మెడ కండరాలకు రక్తప్రసరణను పెంచి నొప్పి, వాపు తగ్గిస్తుంది.

అరటీస్పూన్ పసుపును, ఒక టీస్పూన్ పాలు, వాటర్ తో కలపి మెడకు అప్లై చేయాలి.

8) యాపిల్ సైడర్ వెనిగర్ :

8) యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ గుణాలున్నాయి, ఇది శరీరంలో పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది,. మెడ కండరాల తిమ్మెర్లను తగ్గిస్తుంది. ఇంకా ఇది నొప్పి తగ్గించి మజిల్స్ రిలాక్స్ చేస్తుంది.

యాసిల్ సైడర్ వెనిగర్ ను ఒక స్పూన్ తీసుకుని నీళ్ళలో వేసి అందులో కాటన్ టవల్ డిప్ చేసి నెక్ చుట్టూ చుట్టాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే నొప్పి, వాపునుండి ఉపశమనం కలుగుతుంది.

9) నువ్వులు:

9) నువ్వులు:

నువ్వులలో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్లు అధికంగా ఉన్నాయి. ఇది బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది,. కండరాలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి మెడకు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి.

English summary

Best Ways To Prevent Cervical Spondylosis

Cervical spondylosis is the condition where the muscles of our neck are injured due to constant strain or wear and tear. Factors such as being overweight, following an inactive lifestyle, or past spine injury, etc., can cause cervical spondylosis or it can also be hereditary. Following certain precautionary measures help prevent cervical spondylosis.
Story first published: Tuesday, November 28, 2017, 17:06 [IST]