కాలేయంలో నొప్పికి కారణాలేంటో తెలుసుకోకపోతే మీకే నష్టం..!!

Posted By:
Subscribe to Boldsky

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం కాలేయం. ఇది ఎక్కడ ఉంటుందో..ఏం పనిచేస్తోందో చాలా మందికి తెలియదు? లివర్ రిబ్స్(ప్రక్కటెముకల)క్రింది బాగంలో ఉంటుంది. దీని పని శరీరంలోని వ్యర్థాలను తొలగించడం. ముఖ్యంగా రక్తంను శుద్ది చేసి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఊపిరితిత్తుల కింద ఉండే కాలేయం గోధుమ రంగులో ఉంటుంది. కాలేయం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. కాలేయం చేసే పనులు అనేకం. మనిషిని అనేకరోగాల బారినుండి కాపాడే 'యాంటీబాడీ'లను కాలేయం తయారు చేస్తుంది.

లివర్ క్యాన్సర్, మతిమరుపు నివారించే : టర్మరిక్ కోకనట్ మిల్క్ డ్రింక్..!

సాధారణంగా రోజూ మనం తినే నూనె పదార్థాలు, స్వీట్లు, మసాలాల వల్ల ప్రేవులు ఉత్పత్తి చేసే 'అమినో ఆసిడ్లు' అలాగే రక్తంలో కలిసే సైనైడ్‌ కన్నా విషపూరితం అవుతాయి. అలా కాకుండా అమినో ఆసిడ్లను ప్రొటీన్లుగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర కాలేయానిది. ఇలాంటి ముఖ్యమైన పనిచేసే కాలేయం ఒక్కసారి నొప్పికి గురైతే ? ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల వ్యాధుల కారణంగా ఇన్ఫ్లమేషన్ మరియు వాపుకు దారితీస్తుంది. ఈ సమయంలో పొట్ట ఉదరగ భాగంలో నొప్పి ఎక్కువగా బాధిస్తుంది.

What Causes Pain In The Liver?

కాలేయం డ్యామేజ్ అయినా, ఫెయిల్యూర్ అయినా..కాలేయ సమస్యలున్నా ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపించదు. అందుకే ప్రారంభ దశలో చికిత్సను అందివ్వడం కూడా కష్టం అవుతుంది. ఎప్పుడైతే లివర్ పెయిన్ స్టార్ట్ అవుతుందో..లివర్ పెయిన్ తో పాటు లివర్ డ్యామేజ్ కూడా అవుతుంది. లివర్ డ్యామేజ్ తో మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, లివర్ కు ఎలాంటి సమస్య వచ్చిన కొన్ని సహజలక్షణాలున్నాయి. వీటిని కనుక గుర్తించినట్లైతే. సమస్యను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం : 8 డేంజరస్ హ్యాబిట్స్..!!

కాలేయం నొప్పికి కొన్ని కారణాలు, లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

వాస్తవానికి, కాలేయంలో ఎలాంటి నరాలు ఉండవు..కానీ కాలేయం చుట్టూ ఉండే కణాలు వాపుకు గురైనప్పుడు కాలేయం నొప్పికి దారితీస్తుంది.

ఫ్యాక్ట్ #2

ఫ్యాక్ట్ #2

హెపటైటిస్ వ్యాధి వల్ల కూడా కాలేయంలో వాపు, నొప్పికి దారితీస్తుంది. అందువల్లే పక్కటెముకల క్రింది బాగంలో నొప్పి వస్తుంది. ఇన్ఫ్లమేషన్ కు గురైన పిత్తవాహికల కారణంగా కడుపులో నొప్పి వస్తుంది.

ఫ్యాక్ట్ #3

ఫ్యాక్ట్ #3

వాపు, నొప్పి, చర్మం రంగు పసుపచ్చగా మారడం మరియు మిడిమలు వాపులతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా లివర్ పెయిన్ కు కారణమవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే వెంటనే డాక్టర్ ను కలిసి వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

ఫ్యాక్ట్ #4

ఫ్యాక్ట్ #4

కాలేయంలో కొవ్వు ఎక్కువగా చేయడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణమవుతుంది. ఆల్కహాలిక్ వల్ల లివర్ సమస్యలొస్తే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గా సూచిస్తుంటారు. ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఈ సమస్య వస్తుంటుంది. అయితే వీరితో పోల్చినప్పుడు ఆల్కహాల్ తాగేవారిలో ఎక్కువగా ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ వారిల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఓబేసిటి, కొలెస్ట్రాల్ సమస్యలు మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. ఫ్యాటీలివర్ కూడా నొప్పికి కారణమవ్వొచ్చు.

ఫ్యాక్ట్ #5

ఫ్యాక్ట్ #5

లివర్ సిర్రోసిస్ కూడా లివర్ డ్యామేజ్ కు కారణమవుతుంది. దీన్ని ప్రారంభ దశలోనే గుర్గించి, చికిత్స తీసుకోవడం మంచిది. అయితే ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు చూపదు. అయితే నిదానంగా నొప్పి, పొట్టలో తిమ్మెర్లు, సెన్సిటివిటి వంటి లక్షణాలను చూపెడుతుంది.

ఫ్యాక్ట్ #6

ఫ్యాక్ట్ #6

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, హెపటైటిస్ సి అనే ఇన్ఫెక్షన్ కారణంగా లివర్ సిర్రోసిస్ కు కారణమవుతుంది. లివర్ సిర్రోసిస్ ఉన్నప్పుడు చర్మంలో దురద, అలసట, వికారం, బరువు తగ్గడం, కాళ్ళ వాపులు లక్షణాలు కనబడుతాయి.

ఫ్యాక్ట్ #7

ఫ్యాక్ట్ #7

హెపటైటిస్ కారణంగా కాలేయం, కాలేయం చుట్టూ నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితో పాటు అలసట, జ్వరం, కీళ్ళ నొప్పిలు, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. చర్మం పసుపుపచ్చగామారుతుంది. యూరిన్ డార్క్ కలర్లో కనబడుతుంది. మోషన్ కలర్ కూడా లైట్ షేడ్స్ లో మారవచ్చు.

ఫ్యాక్ట్ #8

ఫ్యాక్ట్ #8

మోనోన్యుక్లోయోసిస్ అనే ఇన్ఫెక్షన్ , ఇది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ ..దీనికి కారణంగా కాలేయం చుట్టూ కొన్ని నొప్పి రావచ్చు. నొప్పితో పాటు, జ్వరం, గొంతునొప్పి,ఆహారాన్ని మ్రింగలేకపోవడం మొదలగు లక్షణాలు కనబడుతాయి.

ఫ్యాక్ట్ #9

ఫ్యాక్ట్ #9

కాలేయంలో కణతులు ఏర్పడితే కాలేయం పెద్దగా పెరగడం వల్ల నొప్పి వస్తుంది. కణతులుంటే? కాలేయం లోపల నీటి తిత్తులాంటివి ఏర్పడటం వల్ల కాలేయం విస్తరిస్తుంది. ఈ కారణంతో కాలేయంలో నొప్పి, వాపు ఉంటుంది.

ఫ్యాక్ట్ #10

ఫ్యాక్ట్ #10

హీమో క్రొమటోసిస్ అనే మెడికల్ కండీషన్ కూడా కాలేయంలో ఐరన్ చేరడానికి కారణం అవుతుంది. ఈ కారణం వల్ల బరువు తగ్గడం, వీక్ నెస్, జాయింట్ పెయిన్ మరియు పొట్టనొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి. కాలేయంలో ఐరన్ కంటెంట్ అధికమైనా లివర్ డ్యామేజ్ జరుగుతుంది.

ఫ్యాక్ట్ #11

ఫ్యాక్ట్ #11

లివర్ క్యాన్సర్ వల్ల కూడా కాలేయంలో నొప్పి ఉంటుంది. క్యాన్సర్ ట్యూమర్స్ కాలేయంలో చేరినప్పుడు కాలేయం విస్తరించడం వల్ల కాలేయంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. నొప్పితో పాటు అకస్మాత్త్ గా బరువు తగ్గడం, స్టొమక్ పెయిన్, షోల్డర్ పెయిన్ (కుడివైపు), కామెర్లు, ప్లీహం విస్తరించడం మొదలగు లక్షణాలన్నీ కూడా లివర్ క్యాన్సర్ ను సూచిస్తుంది

English summary

What Causes Pain In The Liver?

Most of the liver diseases do not show any symptoms in the first stage. That is why it is tough to diagnose them in the early stages. Here are a few facts related to reasons behind liver pain.
Story first published: Thursday, May 25, 2017, 14:00 [IST]
Subscribe Newsletter