మామిడి పండ్లు ఎక్కువ తింటే, శరీరంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

Posted By:
Subscribe to Boldsky

వేసవి అంటేనే మామిడి పండ్లు, మామిడి పండ్లు అంటేనే వేసవి. సీజనల్ గా వచ్చే ఈ పండ్లు వేసవిలో ప్రతి ఒక్కరి నోరూ ఊరించడం వీటి నైజం. అల్లంత దూరం నుండే ఘుమఘుమల వాసనతో మదిని నింపేస్తాయి. ప్రపంచంలో ఎన్ని రకాల పండ్లు ఉన్నా మామిడి పండ్లకు మాత్రం చాలా ప్రత్యేకం. మంచి రంగు, రుచి, వాసనతో మనుషులను ఇట్టే ఆకర్షించేస్తాయి. అందుకే వీటిని కింగ్ ఆఫ్ ఫ్రూట్ ..పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు.

ఒక్కో సందర్భంలో డయాబెటిక్ పేషంట్స్ కూడా ఈ మామిడి పండ్ల మీద మనస్సు చంపులేక తినేస్తుంటారు. అంత పవర్ వీటిలో ఉంది. ఎవరైనా సరే సమ్మర్లో మామిడిపండ్లు రుచి చూడాల్సిందే..అయితే మామిడి పండ్లు మితంగా తింటే పర్వాలేదు కానీ, ఎక్సెస్ తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాధమే సుమా...!

What Happens If You Eat Too Many Mangoes?

మామిడిపండ్లు ''అనకార్డియాసియా'' ఫ్యామిలికి చెందినది. అయితే సైంటిఫిక్ గా వీటిని ''మ్యాంగ్నిఫెరా ఇండికా'' అని పిలుస్తారు. మామిడిపండ్లలో వివిధ రకాల న్యూట్రీషియన్స్ , విటమిన్స్ అధికంగా ఉన్నాయి. అదనంగా పచ్చిమామిడి పండ్లలోని బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

మామిడిపండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇవి వ్యాధినిరోధకతను పెంచి, అనేక వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుతాయి. మామిడిపండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తాయి. ఫెర్టిలిటిని పెంచుతాయి. అయితే ఈ జ్యూసీ, టేస్టీ, స్వీటీ మామిడి పండ్లను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. మామిడి పండ్లను ఎక్సెస్ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం..

బరువు పెరుగుతారు:

బరువు పెరుగుతారు:

ఒక మీడియంసైజ్ మామిడి పండులో 135 క్యాలరీలుంటాయి. ఒకే సారి ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారు. అయితే క్యాలరీలతో మాకు పనిలేదు అనేవారు. మామిడి పండ్లు తింటూనే ఒక అరగంట వ్యాయాం చేస్తే బరువు పెరుగుతామన్న భయమక్కర్లేదు.

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి:

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి:

మామిడి పండ్లలో ఫ్రూట్ షుగర్(ఫ్రక్టోజ్) అధికంగా ఉంటుంది. ఇది పండ్లు తియ్యగా ఉండటానికి సంకేతం . కాబట్టి, షుగర్ లేదా స్వీట్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని ఎక్కువ తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ అమాంత పెరిగిపోతాయి.

ఆర్టిఫిషియల్ గా పండ్లను మాగపెట్టడం:

ఆర్టిఫిషియల్ గా పండ్లను మాగపెట్టడం:

కొంత మంది మ్యాంగో డీలర్స్ మామిడి పండ్లు త్వరగా పండులా మారడానికి క్యాల్షియం కార్బైడ్ అనే కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగడం, తిమ్మెర్లు మరియు ఫెరిఫెరల్ న్యూరో థెరఫి వంటి సమస్యలు వస్తాయి.

గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ సమస్యలు:

గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ సమస్యలు:

మామిడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా సరిగ్గా మాగని పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్షనల్ కు సంబంధించిన అజీర్థ సమస్యలను ఎదుర్కొంటారు . కాబట్టి, పచ్చిమామిడిపండ్లను తినడం నివారించాలి.

ఇరిటేషన్ :

ఇరిటేషన్ :

కొన్ని మామిడి పండ్ల గొంతు సమస్యలకు దారితీస్తుంది. గొంతలో చీకాకకు కలిగిస్తుంది. మామిడి పండ్లు తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగడం వల్ల గొంతులో చీకాకు కలుగుతుంది.

 ‘‘మ్యాంగో మౌత్ ’’:

‘‘మ్యాంగో మౌత్ ’’:

మ్యాంగో మౌత్ అంటే మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దురద, వాపు , పెదాల చుట్టూ పగలడం వంటి లక్షణాలు కనబడుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పచ్చిమామిడి పండ్లను తిన్నప్పుడు కనబడుతుంది.

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ :

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ :

సాల్మొనెల్లా సెరోటైప్ న్యు పోర్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని1999లో యునైటెడ్ స్టేట్స్ పరిశోధనల్లో వెల్లడి చేశారు.

13 స్టేట్స్ లో 78పేషంట్స్ ను కనుగొన్నారు. 15 మంది హాస్పిటల్లో చేరితే ఇద్దరు మరణించారని వెల్లడి చేశారు. మిగిలిన 28 మంది ఇన్ఫెక్షన్ సోడానికి5రోజుల ముందు మామిడిపండ్లను తిన్నట్లు గుర్తించారు,

ఆర్థ్రైటిస్ తో బాధపడే వారికి మంచిది కాదు:

ఆర్థ్రైటిస్ తో బాధపడే వారికి మంచిది కాదు:

ఆర్థ్రైటిస్, సైనటిస్ వంటి నరాల వ్యాధితో బాధపడేవారికి మంచిది కాదు. వీరు పచ్చిమామిడి, మామిడి పండ్లు, లేదా జ్యూస్ ఏరూపంలో తీసుకున్నా మంచిది కాదు.

ఫ్రూట్ జ్యూస్ లేదా స్మూతీ రూపంలో తీసుకోవడం వల్ల :

ఫ్రూట్ జ్యూస్ లేదా స్మూతీ రూపంలో తీసుకోవడం వల్ల :

ఫ్రూట్ జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మ్యాంగో జ్యూస్ లో ఫైబర్ కంటెంట్ తొలగించడం వల్ల కొన్నిఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవల్సి వస్తుంది.

అంతే కాకుండు ఈ జ్యూసులకు పంచదార చేర్చడం వల్ల క్యాలరీలు, న్యూట్రీషియనల్ వాల్యూస్ పెరుగుతాయి. క్యాలరీల వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అందువల్లే మామిడి పండ్లు తినవచ్చు కానీ, మామిడి రసాలకు దూరంగా ఉండాలి.

అలర్జిక్ రియాక్షన్:

అలర్జిక్ రియాక్షన్:

మామిడి పండ్లను తినడం వల్ల కొన్ని అలర్జీలు వస్తాయి. కొంత మంది అలర్జిక్ రియాక్షన్ వల్ల కళ్ల, ముక్క వెంబట నీళ్లు కారడం, శ్వాససమస్యలు, పొట్ట ఉదరంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్లయు ఎదురవుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Happens If You Eat Too Many Mangoes?

    What Happens If You Eat Too Many Mangoes?,Mangoes are irresistible, we all know. However, consuming excess of this fruit can lead to certain health issues. You will find a few of the major side effects in this article.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more