మీ రక్తం ఏ గ్రూప్ కి చెందినది? దీనిద్వారా మీకొచ్చే అవకాశం ఉన్న వ్యాధులు, ఆరోగ్యంపై ప్రభావాలను తెలుసుకోండి.

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ బ్లడ్ గ్రూప్ మీకు వచ్చే అవకాశం ఉన్న అనారోగ్యాలు మరియు మీకు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్న స్థితుల గూర్చి కూడా చాలా తెలుపుతుంది. అందుకని మీరు ఏ బ్లడ్ గ్రూప్ కి చెందినవారో తెలుసుకోవటం చాలా ముఖ్యం.

చాలామందికి తమ రక్తగ్రూప్ ఏంటో కూడా తెలీదు. మన రక్తగ్రూప్ మనకి తెలియాల్సిన ముఖ్యకారణం అత్యవసర స్థితిలో రక్త మార్పిడి కోసం.అవసరమైనప్పుడు సరైన రక్తం దొరకడం చాలా ముఖ్యం.

Blood Groups & Health Risks

ఇదేకాక, మీరు రిస్క్ దశలో ఉన్న ఆరోగ్యస్థితి ఏంటో కూడా దీనిద్వారా తెలుసుకోవచ్చు.

మీ బ్లడ్ గ్రూప్ 'O” అయితే మీకు రక్తం గడ్డకట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. A,B,మరియు AB బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి జీవితాంతం రక్తం గడ్డకట్టని లోపం వంశపారంపర్యంగా 30% అధికంగా పొందే అవకాశం ఉంది.

AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారు రక్తం గడ్డకట్టే లోపంలో 20%కి చెందినవారై ఉంటారు.

Blood Groups & Health Risks

O పాజిటివ్ మరియు నెగటివ్ బ్లడ్ గ్రూపులు ఉంటే అనేక అనారోగ్య స్థితుల బారిన పడకుండా ఉండే తక్కువ రిస్క్ కలిగిఉంటారు. Oబ్లడ్ గ్రూప్ ఉన్నవారు గ్యాస్ట్రిక్ క్యాన్సర్లు కూడా పొందకుండా తక్కువ రిస్క్ కలిగి ఉంటారు.

A మరియు AB బ్లడ్ గ్రూప్ కలిగివుండటం వలన లాభం ఏంటంటే, మీకు O గ్రూపు కన్నా తక్కువగా కడుపులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంది.O గ్రూపు వారు ఎక్కువగా కడుపులో పుళ్ళు(అల్సర్లు) బారిన పడతారు.

O టైప్ బ్లడ్ గ్రూపు ఉన్నవారికి తక్కువగా కరోనరీ గుండెజబ్బు వస్తుంది. మిగతావారికన్నా వీరికి 23% తక్కువగా ఇది వస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం AB మరియు గ్రూపులవారికి ఈ వ్యాధి వచ్చే రిస్క్ అధికంగా ఉన్నది.

Blood Groups & Health Risks

O గ్రూపు వారు క్లోమగ్రంథి క్యాన్సర్ బారిన అరుదుగా పడతారు. A గ్రూపు వారిలో 32% ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటే, AB వారికి 51% వచ్చే అవకాశం ఉండి. అదే టైప్ B వారు అత్యధికంగా 72% ఈ స్థితి వచ్చే రిస్క్ కలిగివున్నారు.

AB గ్రూపుకి మిగతావారికన్నా 23% ఎక్కువగా హృద్రోగాలు వచ్చే అవకాశం ఉంటే, B వారికి 11% ఎక్కువ రిస్క్ ఉంది.

A,B మరియు AB బ్లడ్ గ్రూపుల వారు O బ్లడ్ గ్రూపు కన్నా కడుపులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉన్నారు.

Blood Groups & Health Risks

టైప్ A ,B బ్లడ్ గ్రూపుల వారు O గ్రూప్ కన్నా టైప్2 మధుమేహం పొందే ఎక్కువ రిస్క్ కలిగివున్నారు.

ఒక అధ్యయనంలో జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయకపోవటం (కాగ్నిటివ్ ఇంపెయిర్మెంట్) ఉన్న 500 మంది వయోజనులలో అధిక భాగం AB బ్లడ్ గ్రూపుకి చెందినవారై ఉన్నారు, మరే ఇతర గ్రూప్ కాదు.

English summary

Blood Groups & Health Risks

Find out the health condition that you're at risk based on the blood group you belong to!
Subscribe Newsletter