ఈ వేసవిలో చెరకు రసం తాగాలి అనడానికి ఖచ్చితమైన రీజన్స్ ..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సమ్మర్ లో దాహార్తి తీర్చుకోవడానికి ఎన్ని ఉన్నా తక్కువ వస్తాయి. కొబ్బరిబోండం, ఫ్రూట్ జ్యూస్ లు, మజ్జిగ, లస్సి, కూల్ డ్రింక్స్, నీళ్లు.. ఇలా రకరకాల పానీయాలు తాగుతూ.. ఎండతాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ రసాలలో ఒకటైన చెరకు రసం ప్రత్యేకతే వేరు. ఎలాంటి తీపి పదార్థాలు చేర్చకుండానే.. సహజంగా రుచిని, తీయదనాన్ని, ఆరోగ్యాన్ని అందించే పసందైన పానీయం చెరకు రసం.

ఎలాంటి పళ్ల రసాలనైనా.. ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కానీ.. చెరకు రసం మాత్రం బయట తాగాల్సిందే. రోడ్ సైడ్ దొరికే ఈ చెరకు రసంలోని ప్రయోజనాలు అమోఘం. దీన్ని తేలికగా తీసేయకండి. సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయిన చెరకు రసం తాగడం వల్ల పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఈ సారి చెరకు రసం చూస్తే తాగేస్తారు. మరి అందులోని బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

హైడ్రేషన్ అందిస్తుంది:

హైడ్రేషన్ అందిస్తుంది:

శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. కాబట్టి నీటికి బదులుగా చెరకు రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.

ఎలక్ట్రోలైట్స్ ను రీస్టోర్ చేస్తుంది:

ఎలక్ట్రోలైట్స్ ను రీస్టోర్ చేస్తుంది:

వేసవిలో ఎండ వేడిమి వల్ల చెమట రూపంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంటాయి. షుగర్ కేన్ జ్యూస్ లో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉంటాయి. దీన్ని బెస్ట్ డ్రింక్ గా తీసుకోవాలి. ఇది తాగడం వల్ల చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి రీస్టోర్ అవుతాయి.

అలసట తగ్గిస్తుంది.

అలసట తగ్గిస్తుంది.

సమ్మర్ లో ఏ పనిచేయకపోయినా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అలా అలసిన ఫీలింగ్ కలిగినప్పుడు రెండు గ్లాసుల చెరకు రసం తాగడం వల్ల వెంటనే అలసట తగ్గిపోయి.. ఎనర్జిటిక్ గా మారిపోతారు.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

వేసవిలో చర్మ డ్రైగా మారుతుంది. డ్రై స్కిన్ కు వేసవిలో వీచే గాలుల వల్ల మరింత వరెస్ట్ గా తయారవుతుంది. ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్స్ వల్ల షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల చర్మం హెల్తీగా మరియు గ్లోయింగ్ గా మెరుస్తుంటుంది.

హెల్తీ లివర్ :

హెల్తీ లివర్ :

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ముఖ్య కారణం హెల్తీ లివర్. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే చెరకు రసం తాగాల్సింది. పరిశోధనల ప్రకారం షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల లివర్ పాడవకుండా ఉంటుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణశక్తిని పెంచుతుంది:

జీర్ణ సమస్యలున్నవారు వేసవిలో షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాకి. ముఖ్యంగా చెరకు రసంలో ఉండే పొటాషియం అందుకు బాగా సహాయపడుతుంది. అంతే కాదు, ఇది పొట్టలోని ఇన్ఫెక్షన్స్ తగ్గించి,ప్యారాసిస్ట్స్ ను మెరుగుపరుస్తుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది:

డీహైడ్రేషన్ కారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంటాయి. కాబట్టి షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ఇది మెరుగుపడుతుంది. చెరకు రసంలో ఉండే ఆల్కలైన్ కంటెంట్ యాంటీ బయోటిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే నొప్పి, బర్నింగ్ సెన్షేషన్ ను నివారిస్తుంది.

ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

డయేరియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కడుపు లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు వంటి వ్యాధులకు చెరకు రసం చక్కటి పరిష్కారం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why Sugarcane Juice Is A Must Have This Summer Season

    The health benefit of drinking sugarcane juice in summer ranges from cooling up your body from the heat to nourishing your body with all the summer-friendly nutrients.Sugarcane juice will keep you active throughout the day with its energy-boosting property.
    Story first published: Thursday, March 23, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more