For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్యంలో మతిమరుపును యోగాతో నివారించటం ఎలా?

యోగాను దీర్ఘకాలం చేస్తే మీ మెదడు ఆకారాన్ని మార్చేసి, మీ మెదడు పనితీరును వృద్ధాప్యంలో మందగించకుండా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడయింది.

By Deepti
|

యోగాను దీర్ఘకాలం చేస్తే మీ మెదడు ఆకారాన్ని మార్చేసి, మీ మెదడు పనితీరును వృద్ధాప్యంలో మందగించకుండా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడయింది.

పరిశోధకులు ఒక యోగాలో నిపుణురాలైన వృద్ధమహిళ మెదడును చిత్రీకరించినపుడు, ఈ యోగినుల మెదడు ఎడమ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువ మందంగా ఉందని తెలుసుకున్నారు. మెదడులో ఈ భాగాలు శ్రద్ధకి, జ్ఞాపకశక్తికి కారణమవుతాయి.

<strong>యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు</strong>యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు

వయస్సు మీరుతున్నప్పుడు, మెదడు ఆకారం, పనితీరులో మార్పులొచ్చి ఇదివరకు ఉన్నంత శ్రద్ధ, జ్ఞాపకశక్తి ఉండవు.
అలాంటి ఒక మార్పు మెదడులోని సెరెబ్రల్ కోర్టెక్స్ పల్చనవటం. శాస్త్రవేత్తలు ఇదే మన మతిమరుపుకి కూడా కారణమని తేల్చారు.

వృద్ధాప్యంలో మతిమరుపును యోగాతో నివారించటం ఎలా?

మరి, ఈ మార్పులను ఎలా తగ్గించి, నెమ్మది చేయాలి?

ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురించబడ్డ ఈ ఫలితాలు, జవాబు యోగా అభ్యాసంలో ఉండొచ్చని తెలుపుతోంది.

ఇస్రాయెలిటా ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రికి చెందిన ఎలిసా కొజాసా అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ, "కండరాలలాగానే మెదడు కూడా శిక్షణ వల్ల ఎదుగుతుంది," అని వివరించారు.

<strong>నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు </strong>నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

"ఏదైనా సమకాలీన శిక్షణలాగానే , యోగా వల్ల కూడా శ్రద్ధ, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది," అని జతచేసారు.
పరిశోధక బృందం యోగా చేసే వృద్ధుల్లో, చేయని ఆరోగ్యంగా వున్నవారి మెదడు ఆకార మార్పులు, పనితీరును విశ్లేషించి, తేడాలు ఏమున్నాయో కనుగొనటానికి ప్రయత్నించారు.

వృద్ధాప్యంలో మతిమరుపును యోగాతో నివారించటం ఎలా?
వారు కొంతమంది యోగా అభ్యాసం చేసే మహిళలను (యోగినులు అనికూడా అంటారు) నియమించుకున్నారు. వీరు వారానికి రెండుసార్లు, ఎనిమిదేళ్ళ పాటు యోగా అభ్యసించారు. వీరికి ఇంతకుముందే 15ఏళ్ళ అనుభవం కూడా ఉన్నది.
పరిశోధకులు యోగినులను, యోగా ఎప్పుడూ చేయని స్త్రీలను పోల్చినప్పుడు, మామూలు వారు కూడా యోగా చేసేవారితో సమానమైన వయస్సు కలిగి ఉన్నవారు మరియు ఒకే శారీరక ధారుఢ్యత కలిగినవారు(60 ఏళ్ళకు పైబడినవారు).
శాస్త్రవేత్తలు అభ్యర్థులందరి మెదడులను మాగ్నటిక్ రెసొనెస్ ఇమేజింగ్ టెక్నిక్ వాడి స్కానింగ్ చేసి వారి మెదడులో తేడాలు పరీక్షించారు.

ఇస్రాయెలిటా ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రి నుంచి రుయి అఫోన్సో మాట్లాడుతూ, "శ్రద్ధ, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు ప్రాంతాలలో, యోగినుల ఎడమ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మందం ఎక్కువగా పెరిగింది," అని తెలిపారు.
With Inputs From IANS

English summary

Yoga may protect against memory decline in old age

Doing yoga for a long time could change the structure of your brain and protect it against cognitive decline in old age, suggests new research.
Story first published: Friday, July 21, 2017, 12:23 [IST]
Desktop Bottom Promotion