క్రాన్బెర్రీస్ వల్ల కలిగే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఇతర పండ్లలో కన్నా, క్రాన్బెర్రీస్ జ్యూస్ లోనే ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా రకాల వ్యాధులతో పోరాడుతున్నాయి. ఇలా పోరాడే విషయంలో క్రాన్బెర్రీస్ మాత్రం స్ట్రాబెర్రీలు, ఎర్ర ద్రాక్ష మరియు బ్రోకలీ వంటి అనేక ఇతర పండ్లను మరియు కూరగాయలను కూడా అధిగమించింది.

క్రాన్బెర్రీస్ను బహుముఖ లక్షణాలను కలిగిన ఒక పండుగా చెప్పవచ్చు, అందువల్ల వీటిని మనం తీసుకునే ఆహారంలోనూ మరియు ఇతర ఔషధాలలోనూ ఉపయోగిస్తారు. క్రాన్బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా విటమిన్ C, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం, విటమిన్ B6, విటమిన్ K మరియు విటమిన్ E కూడా ఉన్నాయి.

రుచిలో మాత్రం క్రాన్బెర్రీస్ చాలా పుల్లగానూ ఉంటాయి మరియు మన శరీరంలో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాలు మూత్రనాళాల గోడలకు అంటుకుని ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియాను నిరోధించడంలో కావలసిన ముఖ్యమైన సమ్మేళనాలను ఈ క్రాన్బెర్రీస్ కలిగి ఉన్నాయి. క్రాన్బెర్రీస్ను తరచుగా తినడం వల్ల క్యాన్సర్లను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది, ఇది రోగనిరోధకతను మెరుగుపరుస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, వాపులను తగ్గిస్తుంది, గుండెజబ్బుల ప్రమాదాన్ని మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కలుగజేసే ప్రమాదాల స్థాయిని తగ్గిస్తుంది.

ఇప్పుడు, క్రాన్బెర్రీస్ వల్ల కలిగే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం.

10 Amazing Health Benefits Of Cranberries

1. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ (యు టి ఐ) :

మూత్రనాళ మార్గమునందు వ్యాపించే అంటువ్యాధులను నివారించటంలోనూ (లేదా) చికిత్సను అందచేయగల అతి ముఖ్యమైన పండ్లలో క్రాన్బెర్రీస్ ఒకటి. ఎక్కువగా పిత్తాశయం అభివృద్ధి చెందే మహిళల్లోనే ఈ అంటువ్యాధులు సంభవిస్తాయి. మూత్రాశయ గోడలపై అంటుకొని ఉన్న బ్యాక్టీరియాను నిరోధించే యాంటీ-క్లింగింగ్ లక్షణాలు కూడా క్రాన్బెర్రీస్లో ఉన్నాయి.

2. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

2. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించే పాలిఫినోలిక్ సమ్మేళనాలను ఈ క్రాన్బెర్రీస్ కలిగి ఉన్నాయి. ఇందులో సాల్సిలిక్ ఆమ్లము అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల రక్తం గడ్డకట్టడం, మంటలను మరియు వాపులను గణనీయమైన స్థాయిలో తగ్గిస్తుంది.

3. గుడ్డు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

3. గుడ్డు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

క్రాన్బెర్రీస్ వాటిలో ఉన్న ఫ్లేవానాయిడ్స్ కారణంగా గుండె-వ్యాధుల ప్రమాద తీవ్రతను బాగా తగ్గిస్తాయి. ఈ ఫ్లేవానాయిడ్లలో యాంటీ-ఆక్సిడెంట్ల లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ధమనులలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను అడ్డుకుని, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

4. బరువు తగ్గడానికి సహాయపడుతుంది :

4. బరువు తగ్గడానికి సహాయపడుతుంది :

క్రాన్బెర్రీస్లో యాంటీ-ఆక్సిడెంట్లు అనేవి పూర్తిగా ఉంటాయి, ఇవి మన శరీర వ్యవస్థలో ఉన్న విష వ్యర్ధాలను తొలగించడానికి బాగా సహాయపడతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ మరియు జీవక్రియను సక్రమంగా నడిపించడంలోనూ సహాయపడుతుంది. తద్వారా మీరు వేగంగా బరువును కోల్పోతారు.

5. దంత క్షయమును నిరోధిస్తుంది :

5. దంత క్షయమును నిరోధిస్తుంది :

కొన్ని పరిశోధనల ప్రకారం, క్రాన్బెర్రీ జ్యూస్ పంటి యొక్క కావిటీస్ను నివారించడంలో సహాయపడుతుంది. క్రాన్బెర్రీస్ను తరచుగా తినడం వల్ల, పంటి ఫలకాల ఉత్పత్తిలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తూ పళ్ళ ను జాగ్రత్తగా సంరక్షిస్తుంది మరియు మన నోటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి ఇది బాగా సహాయపడును. జడమైన మరియు ఆరోగ్యమైన దంతాలను పొందటానికి క్రాన్బెర్రీ జ్యూస్న్ త్రాగటం చాలా మంచిది.

6. రోగనిరోదకత పనితీరును మెరుగుపరుస్తుంది :

6. రోగనిరోదకత పనితీరును మెరుగుపరుస్తుంది :

క్రాన్బెర్రీ జ్యూస్ అనేది, గాలి మరియు ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించిన హానికరమైన బ్యాక్టీరియాలను, వైరస్లను తొలగించడంలో బాగా ఉపయోగపడుతున్నాయి. అనారోగ్యానికి వ్యతిరేకంగా పోరాడే ఒక రక్షణ యంత్రాంగాన్ని క్రాన్బెర్రీస్ ఏర్పరుస్తాయి మరియు పెద్ద ప్రేగులలో ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సృష్టించడంలో సహాయపడే బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.

7. జీర్ణవాహికకు కలిగే ప్రయోజనాలు :

7. జీర్ణవాహికకు కలిగే ప్రయోజనాలు :

క్రాన్బెర్రీస్ మన శరీరంలోని వ్యర్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు తొలగించగల లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, శరీరాన్ని శుభ్ర పరిచే నిర్విషీకరణ ప్రక్రియలో కూడా బాగా సహాయపడుతుంది. వీటితో పాటు క్రాన్బెర్రీస్ కూడా కడుపు ఉబ్బరమును మరియు మూత్రమును నిలుపు చెయ్యడంలో నుండి ఉపశమనమును కలిగించడంలో సహాయపడుతుంది మరియు జీర్ణాశయంలో బాక్టీరియా యొక్క సమతౌల్యాన్ని పరిరక్షిస్తుంది.

8. ముందుగా వచ్చే వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

8. ముందుగా వచ్చే వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

క్రాన్బెర్రీస్లో శరీరంలో విహరించే స్వేచ్ఛారాశులను నిరోధించే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. క్రాన్బెర్రీ జ్యూస్ అనామ్లజనకాలు (యాంటీ ఆక్సిడెంట్లను) కలిగి ఉంటుంది, ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే స్వేచ్ఛారాశులకు వ్యతిరేకంగా పోరాడుతుంది, మరియు మీ చర్మం మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

9. జుట్టు ఊడిపోవటాన్ని నిరోధిస్తుంది :

9. జుట్టు ఊడిపోవటాన్ని నిరోధిస్తుంది :

క్రాన్బెర్రీస్లో, విటమిన్ A మరియు విటమిన్ C ఎక్కువగా ఉంటాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి అవసరమైనవి. మీరు క్రాన్బెర్రీస్ తినవచ్చు (లేదా) జ్యూస్ లా తీసుకోవచ్చు. మీ జుట్టును ఒత్తుగా, దృఢంగా ఉంచడానికి మరియు జుట్టు ఊడిపోవటాన్ని నిరోధిస్తుంది.

10. ఊపిరితిత్తుల వాపుకు చికిత్స :

10. ఊపిరితిత్తుల వాపుకు చికిత్స :

ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల ఊపిరితిత్తులలో కలిగే వాపును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో అవసరమైన శోథ నిరోధక లక్షణాలను క్రాన్బెర్రీస్ కలిగి ఉంటుంది. ఇన్ఫ్లుఎంజా వైరస్ యొక్క కణాలకు అంటుకుని ఉండే గుణాలను కలిగి ఉంటుంది, ఆ గుణాన్ని నివారించగల పదార్ధం క్రాన్బెర్రీ జ్యూస్ కలిగి ఉంటుంది, అందువలన మీరు ఫ్లూ వ్యాధిని త్వరగా నిరోధించవచ్చు.

English summary

10 Amazing Health Benefits Of Cranberries

Cranberries are a versatile fruit and they are used in food and other medicinal purposes. Cranberries are not only rich in antioxidants but also contain vitamin C, potassium, zinc, calcium, magnesium, iron, phosphorous, vitamin B6, vitamin K and vitamin E. Cranberries taste sour and they contain substances that stop infection-causing bacteria from sticking to the urinary tract walls.
Story first published: Saturday, February 10, 2018, 8:00 [IST]
Subscribe Newsletter