ఒత్తిడిని దూరం చేసే 10 రకాల సులభ పానీయాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మనలో చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు , లేదా శక్తి క్షీణతకు గురైనప్పుడు శక్తిపానీయాల వైపుకు మొగ్గు చూపుతుంటారు. ఈ శక్తి పానీయాల కంపెనీలు శరీరానికి తక్షణ శక్తిని ఇంధనంగా ఇస్తామని ప్రచారాలు చేసి ప్రజాదరణకు నోచుకున్నాయి. కానీ ఈ శక్తి పానీయాల నుండి తెచ్చుకున్న శక్తి వ్యవధికాలం చాలా తక్కువగా ఉండడంతో పాటు అనేక దుష్ప్రభావాలు కూడా కలిగి ఉంటుంది.

ఈ శక్తి పానీయాలు సేవించడం మూలంగా భయము, నిద్రలేమి, గుండె జబ్బు, ఆందోళన మరియు వ్యాకులత వంటి దుష్పరిమాణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శక్తి పానీయాలు కృత్రిమ చక్కెరలను, కృత్రిమ రంగులు, మరియు శరీరానికి హాని చేసే అసంబద్దమైన సంరక్షణకారులను కలిగి ఉంటాయి.

ఈ కృత్రిమరుచులు కలిగి ఉండడం మరియు సరక్షణకారులను కలిగిలేక పోవడం వంటి కారణాలవలన , ఈ శక్తి పానీయాలకంటే ఇంట్లో తయారు చేసే పానీయాలే ఒత్తిడిని తగ్గించడానికి సరైన ఎంపిక గా సూచించబడుతుంది.

ఇంట్లో చేసిన పానీయాలు మీ మనస్సును చల్లగా ఉంచుతూ ప్రశాంతతని కలిగించేలా చేస్తుంది.

ఇంట్లో చేయగలిగే పానీయాలలో ఉత్తమమైనవి ఇక్కడ పొందుపరచడం జరిగినది.

1.వెచ్చని పాలు

1.వెచ్చని పాలు

రోజంతా ఒత్తిడితో కూడుకుని ఉన్న శరీరానికి వెచ్చని పాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఆమ్లం ఒత్తిడిని తగ్గించడానికి ప్రధమంగా పనిచేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది.

2. గ్రీన్ టీ

2. గ్రీన్ టీ

అధికబరువు తగ్గించుటలో ప్రజాదరణ పొందిన పానీయం గ్రీన్ టీ. ఇది ఒత్తిడిని తగ్గించుటలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది L-theanine అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గించడం మాత్రమే కాకుండా ఏకాగ్రత పెరగడానికి మరియు దృష్టిని పదును పెట్టడానికి సహాయపడుతుంది.

3. కొబ్బరి నీరు

3. కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్ళలో మెగ్నీషియం మరియు పొటాషియం ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి మీ కండరాలకు తగినంత విశ్రాంతినివ్వడంలో సహాయం చేస్తుంది. మరియు మంచి నిద్ర కలిగేలా చేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్ళలో విటమిన్ B నిక్షేపాలు అధికంగా ఉండడం మూలంగా ఒత్తిడిని మరియు రక్తపోటుని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. అందుచేతనే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరినీళ్లను సిఫార్సు చేస్తుంటారు.

4. టార్ట్ చెర్రీ జ్యూస్

4. టార్ట్ చెర్రీ జ్యూస్

అనేక అద్యాయనాల ప్రకారం ఈ టార్ట్ చెర్రీ జ్యూస్ సేవించడం వలన హృద్రోగంతో ముడిపడివున్న వాపును తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ నిరోధిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన కీళ్లకి మద్దతు ఇస్తుంది మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన అనేక సమస్యలకు మంచి ఉపశమనాన్ని ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

5. హెర్బల్ టీ

5. హెర్బల్ టీ

కెఫీన్ కలిగి ఉండని , హెర్బల్ టీలు ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తాయి. మీరు తీసుకోగలిగిన కొన్ని మూలికా టీలు ఒయాంగ్ టీ టీ, వైట్ టీ, మ్యాచ్ టీ, డార్జిలింగ్ టీ, మసాలా టీ, అస్సాం టీ, గ్రీన్ టీ, తదితరాలు.

6.వోట్ స్ట్రా

6.వోట్ స్ట్రా

ఈ ఒట్స్ గడ్డి ఆకుపచ్చ ఒట్స్ నుండి వస్తుంది. ఖరీదు కాస్త ఎక్కువ అయినా మెదడు ఆరోగ్యానికి మద్దతునివ్వడంలో మరియు శక్తిని పెంచుటలో ప్రధాన పాత్రపోషిస్తుంది కనుక ఎక్కువ ప్రజాదరణ పొందినది. ఇది ఒత్తిడి ఆందోళన స్థాయిలను , నాడీ మండల అలసట మరియు నిరాశను సైతం తగ్గించే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

7. తాజా జ్యూస్

7. తాజా జ్యూస్

తాజా పండ్ల రసాలలో అనేక మోతాదులో ఖనిజాలు పోషకాలు విటమిన్లు ఉండడం మూలంగా తక్షణ శక్తిని పొందుటకు మరియు ఒత్తిడి నుండి ఉపశమనం పొంది మెదడుని విశ్రాంతి పరచుటకు ఎంతగానో ఉపకరిస్తాయి. కనుక రోజులో కనీసం ఒక సారైనా పండ్ల రసాన్ని తీసుకోమని సూచిస్తుంటారు.

8. అవోకాడో మరియు చియా విత్తనాలు

8. అవోకాడో మరియు చియా విత్తనాలు

అవోకాడోస్ B విటమిన్లతో నిండిపోయి ఉంటుంది. ఇది నరాలకు మరియు మెదడు కణాలకు మంచివి. మరియు చియా గింజలు అధిక మోతాదులో మెగ్నీషియం నిల్వలను కలిగి ఉండుట చేత ఒత్తిడి తగ్గించడానికి అవసరమైన ఖనిజంగా చెప్పవచ్చు.

9. అరటి స్మూతీ

9. అరటి స్మూతీ

అరటి స్మూతీ, మీరు అధిక ఒత్తిడికి లోనై ఉంటే ఇది ఒక గొప్ప పానీయం అవుతుంది. ఇది పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాల సమ్మేళనంతో కూడుకుని ఉంటుంది. వీటిలో మెగ్నీషియం అనేది ఒత్తిడిని తగ్గించే ఉత్తమ ఖనిజంగా చెప్పవచ్చు.

10. వాలెరియన్ రూట్ టీ

10. వాలెరియన్ రూట్ టీ

వాలెరియన్ రూట్ టీ మనసుకు బలమైన మత్తు ప్రభావాన్ని ఇస్తుంది. తద్వారా మీ ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. రీసెర్చ్ ప్రకారం, వెలారియన్ రూట్ టీ ఒత్తిడి మరియు ఆందోళన నియంత్రించే మెదడు లో సమ్మేళనాల శాతాన్ని పెంచడంలో ఎంతగానో ఉపకరిస్తుందని తేలింది.

English summary

10 Best Relaxing Drinks To Make At Home

Whenever we run low on energy, we turn upto energy drinks. They have become incredibly popular over the years that promise to fuel up our body. But, you might have also experienced that the energy stays only for a short duration with these so-called energy drinks. These energy drinks have a host of other side effects as well, which include nervousness,
Story first published: Saturday, March 17, 2018, 15:30 [IST]