For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమాటాలు ఎక్కువగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి కలిగే ప్రతికూలతలు ఏమిటి ?

|

అతిగా ఏదైనా తీసుకుంటే అది మనకి హానిని కలిగించవచ్చు. అదే టమాటాల విషయంలో కూడా నిజమయ్యింది. కానీ మీరు ఉపయోగించే ఈ ఎర్రని పండును కూరగాయల్లగా తరచుగా ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లయితే, అది మీకు హానిని కలిగించవచ్చా ? మీకు నమ్మడానికి కష్టంగా ఉన్నా - దురదృష్టవశాత్తు, ఈమాటే నిజమయ్యింది. దాని కోసం మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

టమోటాలు మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా ఉన్నాయి. మనం రోజువారి వంటకాలలో అనగా చారు & సలాడ్లలో ఉపయోగించే టమోటాల సంఖ్యను ఎప్పుడూ లెక్కించము. కొన్నిసార్లు ఈ టమోటాలను మనం జ్యూస్లా చేసుకొని మరీ వినియోగిస్తాము. కానీ మనము ఉపయోగించే ఈ ఆహార పదార్థాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడంతో పాటు వాటి వల్ల కలిగే చెడు ప్రభావాలను కూడా తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

12 Disadvantages Of Eating Tomatoes In Excess

టమోటాలు సానుకూలమైన ఆరోగ్యప్రయోజనాలను సుదీర్ఘంగా కలిగి ఉన్నప్పటికీ, వీటిని అధికంగా ఉపయోగించటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ వ్యాసం ద్వారా ప్రయత్నిస్తున్నాము.

టమోటాలు అధిక వినియోగం వల్ల మీకు కలిగే 10 ప్రతికూల ప్రభావాలు :-

1. మీ కడుపునొప్పికి కారణం కావచ్చు :

1. మీ కడుపునొప్పికి కారణం కావచ్చు :

నిర్ణీతమైన మోతాదులో టమోటాలను వినియోగించడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఇవి సహాయపడతాయి. అలాకాకుండా మోతాదుకు మించి టమాటాలను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలను కలుగజేయడానికి బదులుగా హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా బోవెల్ సిండ్రోమ్ తో ఎక్కువగా బాధపడుతున్న వారికి ఈ టమాటాల్లో అధిక వినియోగం కారణంగా ఈ పరిస్థితిని మరింతగా దిగజార్చుతుంది, అలాగే కడుపు ఉబ్బరానికి కూడా దారితీస్తాయి. టమాటాలలో సాల్మోనెల్లా అనే సమ్మేళనం ఉండటం వల్ల, వీటిని అధికంగా వినియోగించే వారిలో అతిసారానికి దారితీస్తుంది.

2. యాసిడ్ రిఫ్లెక్స్ :

2. యాసిడ్ రిఫ్లెక్స్ :

టమాటాలు ఆమ్లత్వం ఎక్కువగా కలిగి ఉంటాయి. మీరు ఇప్పటికే యాసిడ్ రిఫ్లెక్స్ / హార్ట్ బర్న్తో ఇబ్బందులు పడుతుంటే, టమాటాల వినియోగం గూర్చి ఒకసారి ముందు జాగ్రత్తగా ఆలోచించి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు టమాటాల వినియోగాన్ని మానుకోకపోతే, అవి మరింత ఆమ్లాన్ని ఉత్పత్తి చేసి గ్యాస్ట్రో-ఇంటెస్టినాల్ ట్రాక్ట్ ప్రభావితమవ్వడానికి కారణమవుతుంది. టమోటాలు మాలిక్ & సిట్రిక్ ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో అదనపు యాసిడ్ను ఉత్పత్తిని ప్రేరేపించి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్షన్కు దారితీస్తుంది.

3. కిడ్నీలో రాళ్లు :

3. కిడ్నీలో రాళ్లు :

ఎవరైతే సాధారణంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారందరూ పొటాషియం తీసుకోవడాన్ని పరిమితం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ పొటాషియం అనేది ముఖ్యంగా టమోటాలలో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది మరిన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, టమోటాలలో ఉండే ఆక్సలేట్లు - మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లను కలిగిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే, టమోటాల వినియోగాన్ని మానుకోవడం చాలా మంచిది.

4. రక్తపోటును పెంచవచ్చు :

4. రక్తపోటును పెంచవచ్చు :

మీరు పచ్చి టమాటాలను వినియోగించేటప్పుడు, వాటిల్లో ఉండే సోడియం స్థాయిలు తక్కువగా (5 mg మాత్రమే) ఉన్నందున రక్తపోటు స్థాయిల నియంత్రణలో అవి జోక్యం చేసుకోలేవు. నిజానికి, ఇవి అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలా అని మీరు టమోటాల వినియోగాన్ని ఇతర మార్గాలలో ఎక్కువగా వినియోగించినట్లయితే, అందులో ఉండే సోడియం స్థాయిలో పెరగటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి ఇవి మరింత హానిని తలపెట్టగలవు.

5. అలర్జీలు :

5. అలర్జీలు :

అలర్జీలకు కారణమైన సమ్మేళనాన్ని హిస్టామైన్గా పిలుస్తారు. ఈ అలర్జీల ప్రతిచర్యకు టమోటాలు కారణం కాగలదు. తామర, చర్మపు దద్దుర్లు, తుమ్ములు, గొంతులో దురదలు, ముఖము & నాలుకలలో వాపుల వంటివి అలర్జీల లక్షణాలుగా ఉంటాయి. టమాటాలు కూడా చర్మ సంబంధిత అలర్జీలు కలిగిస్తాయని కొంతమంది నమ్ముతారు.

6. క్యాన్సర్ లక్షణాలును పెంచుతాయి :

6. క్యాన్సర్ లక్షణాలును పెంచుతాయి :

సరైన మోతాదులో టమాటాలను వినియోగించడం వల్ల వాటిలో ఉండే లైకోపీన్ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే,

లైకోపీన్ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణా లను వేగవంతం చేయగలదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లైకోపీన్ కూడా కొన్ని కీమోథెరపీ మందులతో సంకర్షణ చెందుతున్నందున, క్యాన్సర్ కోసం చికిత్స చేయించుకుంటున్న రోగులు టమాటాల వినియోగాన్ని తప్పక మానుకోవాలని గట్టిగా హెచ్చరించాలి.

7. మూత్ర సంబంధ సమస్యలను ఎక్కువ చేస్తోంది :

7. మూత్ర సంబంధ సమస్యలను ఎక్కువ చేస్తోంది :

టమోటాలు ఆమ్లత్వమును కలిగి ఉండటం వల్ల అవి మూత్రాశయమునకు చికాకు పెడతాయి, ఈ సమస్యను భరించలేనంత జటిలంగా మారుస్తుంది. మీరు తరచుగా మూత్రమార్గ అంటురోగాలకు గురయినట్లయితే టమాటాల్లో అధిక వినియోగం మీ మూత్రాశయంలో చికాకును & మంటను ప్రేరేపించి మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

8. మైగ్రేన్లు :

8. మైగ్రేన్లు :

నిపుణుల అభిప్రాయం ప్రకారం, టమోటాలు మైగ్రేన్లను ప్రేరేపించేగలవు. ఒక ఇరానియన్ అధ్యాయనంలో ఈ విషయము నిర్ధారించబడింది. అయితే మీరు పాటించే డైట్ లో కొన్ని ఆహార మార్పులను చేయటంవల్ల పార్శ్వపు నొప్పిని 40% వరకు నియంత్రించవచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి మీరు తరచుగా తలనొప్పి ఎదుర్కొంటున్నట్లయితే, టమోటాలో వినియోగంపై కూడా ప్రత్యేక దృష్టిని పెట్టండి.

9. హైపోగ్లైకేమియా :

9. హైపోగ్లైకేమియా :

గ్లైసెమిక్ తక్కువగా ఉండి, మధుమేహంతో బాధపడేవారికి టమోటాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి రక్తప్రవాహంలో చెక్కరను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ విధంగా రక్తంలో చక్కెర స్థాయిలను తీవ్రంగా నివారిస్తుంది. అయితే టమాటాలు వినియోగం సాధారణ పరిమితి స్థాయిని దాటినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలను మరింతగా క్షీణించేలా చేస్తుంది. అలా ఇది హైపోగ్లైకేమియాకు దారితీస్తుంది.

10. గర్భిణీ స్త్రీలలో సమస్యలను కలిగించవచ్చు :

10. గర్భిణీ స్త్రీలలో సమస్యలను కలిగించవచ్చు :

మనం ముందుగా చెప్పుకున్నట్లుగా, టమోటాలలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి వీటిని గర్భిణీ స్త్రీలు సురక్షితంగా తినవచ్చు. అయితే వీటిని మోతాదుకు మించి ఎక్కువగా తినడం వల్ల గర్భిణీ స్త్రీలలోను & చనుబాలిచ్చే స్త్రీలలోను కొన్ని సమస్యలు ఎదురవడానికి కారణం కాగలదు. కాబట్టి, అలాంటి స్త్రీలు టమోటాల వినియోగంలో మీ డాక్టర్ సూచించిన సూచనలను పాటించడం చాలా మంచిది.

English summary

10 Disadvantages Of Eating Tomatoes In Excess

Tomatoes have numerous health benefits; but consuming them in excess can affect you negatively. Eating tomatoes in excess can cause stomach upset, heartburn, kidney stones and ailments, high BP, allergies, urinary issues, muscle cramps, migraines and lower sugar levels. Also, overeating tomatoes is harmful for pregnant women and cancer patients.
Desktop Bottom Promotion