దాల్చిన నీటిని తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వెయిట్ లాస్ కి సహకరించే అద్భుతమైన స్పైస్ గా దాల్చిన చెక్క పేరొందిందన్న విషయం తెలిసిందే. దాల్చిన చెక్క వలన కేవలం అధిక బరువు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఈ హెల్త్ బెనిఫిట్స్ తో పాటు దీనిని ఎన్నో సౌందర్య చికిత్సలతో కూడా వాడతారు. అలాగే, దాల్చిన చెక్కను ఔషధంగా కూడా వాడతారు.

వివిధ వంటకాలలో దాల్చిన చెక్కను వాడతారు. దీనిని జోడించడం వలన వంటకాల ఫ్లేవర్ పెరుగుతుంది. స్వీట్స్ దగ్గరనుంచి అన్ని రకాల వంటకాల తయారీలో దీనిని వాడటం వలన ఆ యొక్క వంటకం రుచి మరింత పెరుగుతుంది. ప్రత్యేకించి సాంప్రదాయ వంటకాలలో దాల్చిన చెక్కను కచ్చితంగా వాడతారు.

న్యూట్రియెంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దాల్చిన చెక్కలో పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం, మాంగనీస్, కేల్షియం, జింక్ మరియు ఐరన్ లకు నిలయంగా దాల్చిన చెక్కను చెప్పుకోవచ్చు.

ఈ న్యూట్రియెంట్స్ అనేవి బ్లడ్ ప్రెషర్ ని అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అలాగే గైనకాలాజికల్ సమస్యలను, రెస్పిరేటరీ మరియు డైజెస్టివ్ సమస్యలను తగ్గించేందుకు కూడా దాల్చిన చెక్క తనదైన పాత్ర పోషిస్తుంది.

కాబట్టి, ఈ ఆర్టికల్ లో, దాల్చిన నీటి గురించి మనం చర్చించుకుందాం. దాల్చిన నీరు ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఎంతో మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ దాల్చిన నీటిని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన అనేకమైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.

దాల్చిన నీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెయిట్ లాస్ కి ఉపయోగకరం:

1. వెయిట్ లాస్ కి ఉపయోగకరం:

దాల్చిన నీటిని తేనెతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ ప్రక్రియ సులువవుతుంది. ఈ నీటికి శరీరంలోంచి టాక్సిన్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. అలాగే దాల్చిన నీరు మీకు ఆకలిని తీర్చిన భావన కలిగించడం వలన తరచూ కలిగే చిరు ఆకలి తగ్గుతుంది. అలాగే, జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అందువలన, వెయిట్ లాస్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది.

2. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం

2. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం

నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ప్రకారం నెలసరి నొప్పులతో విపరీతంగా బాధపడుతున్న మహిళలు దాల్చిన నీటిని తీసుకోవడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. దాల్చినలో అనాల్జేసిక్ మరియు యాంటీ-కోగ్యులేట్ ప్రాపర్టీలు కలవు. ఇవి నెలసరి సమయంలో నొప్పిని తగ్గించి హెవియర్ ఫ్లో ని నియంత్రణలో ఉంచుతుంది.

3. ఇమ్మ్యూనిటీని పెంపొందిస్తుంది:

3. ఇమ్మ్యూనిటీని పెంపొందిస్తుంది:

దాల్చిన నీటిలో పోలీఫెనాల్స్ మరియు ప్రో యాంతోసియానిడిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలవు. ఇవి ఇమ్మ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసేందుకు ఉపయోగపడతాయి. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ దాల్చిన నీటిలో పుష్కలంగా కలవు. ఇవి హార్ట్ ప్రాబ్లెమ్స్, రెస్పిరేటరీ సమస్యల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

4. PCOS ప్రభావాన్ని తగ్గిస్తుంది:

4. PCOS ప్రభావాన్ని తగ్గిస్తుంది:

PCOS లేదా పోలీసిస్టిక్ ఓవరీయన్ సిండ్రోమ్ అనేది మహిళల్లో సంభవించే హార్మోనల్ డిసార్డర్. PCOS అనేది ఓవరీస్ ను పెద్దదిగా చేసి దాని వెలుపల చిన్న చిన్న గడ్డలను వృద్ధి చేస్తుంది. దాల్చిన నీటిని తీసుకోవడం వలన PCOS వలన కలిగే ప్రభావాలని తగ్గించుకోవచ్చు. అలాగే, PCOS సమస్యతో సతమతమయ్యే మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది.

5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:

5. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:

దాల్చిన నీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తితో పాటు మెదడు పనితీరు మెరుగవుతుంది. పేరుపొందిన ఒక స్టడీ ప్రకారం దాల్చిన లో మెదడుకు సంబంధించిన అల్జీమర్స్ మరియు పార్కిన్సన్ వ్యాధులను అరికట్టే సామర్థ్యం కలదు. అలాగే దాల్చిన నీటిని తీసుకోవడం వలన ఏకాగ్రత మరియు ఫోకస్ కూడా పెరుగుతాయి.

6. టూత్ యేక్:

6. టూత్ యేక్:

మనం అప్పుడప్పుడు భరించలేని టూత్ యేక్ తో బాధపడుతూ ఉంటాము కదా? దాల్చిన అనేది పంటి నొప్పిని తగ్గించే అద్భుతమైన స్పైస్. దాల్చిన నీటిని తీసుకోవడం వలన పంటి నొప్పితో పాటు చిగుర్ల వాపును తగ్గించుకోవచ్చు.

7. డయాబెటిస్ ని అరికడుతుంది:

7. డయాబెటిస్ ని అరికడుతుంది:

దాల్చిన నీటిలో లభించే కొన్ని రకాల పోలీఫెనాలిక్ పదార్థాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగులేట్ చేసే సామర్థ్యం కలదు. తద్వారా టైప్ 2 డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్ పేషంట్స్ కూడా దాల్చిన నీటిని తీసుకోవడం వలన బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి.

8. క్యాన్సర్ ని అరికడుతుంది:

8. క్యాన్సర్ ని అరికడుతుంది:

దాల్చిన నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ బారిన ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు. దాల్చినలో యాంటీ కార్సినోజెనిక్ కాంపౌండ్స్ గలవు. ఇవి క్యాన్సరస్ సెల్స్ వృద్ధిని నెమ్మది చేస్తాయి. కాబట్టి, దాల్చిన నీటిని రోజూ తీసుకోవడం మంచిది.

9. వినికిడి శక్తిని మెరుగుపరుస్తుంది:

9. వినికిడి శక్తిని మెరుగుపరుస్తుంది:

వినికిడి శక్తిలో ఏమైనా ఇబ్బంది ఉంటే దాల్చిన నీటిని తాగడం ద్వారా ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. ఎందుకో తెలుసా? దాల్చినకి వినికిడి సమస్యల్ని తగ్గించే గుణం కలదు. అందువలన, దాల్చిన నీటిని తీసుకోవడం వలన వినికిడి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

10. స్కిన్ టెక్స్చర్ ని మెరుగుపరుస్తుంది:

10. స్కిన్ టెక్స్చర్ ని మెరుగుపరుస్తుంది:

దాల్చిన నీటిని తీసుకోవడం వలన స్కిన్ టెక్స్చర్ మరియు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. దాల్చినలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. తద్వారా, శరీరంలోని టాక్సిన్స్ బయటికి పోతాయి. అందువలన స్కిన్ లో టాక్సిన్స్ పేరుకుపోవడం జరగదు. కాబట్టి, దాల్చిన నీటిని తాగడం ఇప్పట్నుంచే ప్రారంభించండి మరి!

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

10 Health Benefits Of Drinking Cinnamon Water

Cinnamon water is a healthy alternative and drinking it daily will provide many health benefits. Cinnamon-infused water will aid in weight loss, ease menstruation cramps, boost immunity, reduce effects of PCOS, improve brain function, reduce tooth pain, prevent cancer, prevent diabetes, improve hearing and also improve the skin texture..
Story first published: Friday, February 23, 2018, 12:45 [IST]