నోటి దుర్వాసనను నివారించడం కోసం పాటించవలసిన చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నోటి దుర్వాసనను కలిగిన వ్యక్తికి ఎన్ని సార్లు మీరు తరచుగా ఎదురవుతారు ? (లేదా) మీరు నోటి దుర్వాసనను కలిగిన కారణంగా ఎంతమంది వ్యక్తులు మీతో మాట్లాడకుండా తప్పించుకొంటున్నారు ? ఇది చాలామంది వ్యక్తులను ఇబ్బందిపెట్టే విషయము.

మీరు తెలుసుకోండి, ఈ రకమైన చెడుశ్వాసను "హాలిటోసిస్" అని కూడా పిలుస్తారు. మీకు ఈ పరిస్థితికి ఎదురవడానికి - చెడువాసనను కలిగిన ఆహారాలను తినడం, వైద్య పరిస్థితులు, చిగుళ్ల వ్యాధి, ధూమపానం మరియు నోరు పొడిబారడం వంటి అనేక ఇతర అంశాలు కారణం కావచ్చు.

ఈ చెడు శ్వాస ఏర్పడటానికి ప్రాథమిక కారణం, మీ నాలుక వెనుక (లేదా) మీ దంతాల మధ్య బ్యాక్టీరియా ఏర్పడటం. మీ నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ద్వారా, మీ నోటి దుర్వాసనను నియంత్రించడంలో సహాయపడుతుంది.

10 Home Remedies For Bad Breath

కాబట్టి, మీ నోటి దుర్వాసనను నివారించడానికి మీరు ఏమి చేయాలో ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఆ నివారణ పద్ధతులను మీరు తెలుసుకొని ఆచరించండి.

1. ఫెన్నెల్ సీడ్స్ (సోపు గింజలు) :

1. ఫెన్నెల్ సీడ్స్ (సోపు గింజలు) :

ఫెన్నెల్ సీడ్స్ (సోపు గింజలు) మీ నోటి నుంచి వచ్చే చెడుశ్వాసను నియంత్రించడానికి సహాయపడే అద్భుతమైన నోరు ఫ్రెషనర్గా ఇవి పని చేస్తాయి. ఇది నోటి లోపల బ్యాక్టీరియాతో పోరాడగలిగే యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

మీ భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోపు గింజలను తీసుకోని నమలండి. వీలైతే మీరు సోపు గింజలతో టీని కూడా తయారు చేసుకోవచ్చు.

2. మెంతులు :

2. మెంతులు :

నోటి నుంచి వచ్చే చెడువాసనను తొలగించడంలో మెంతులు అనేవి చాలా మంచివి. నోటి దుర్వాసనను అరికట్టడంలో మెంతుల టీని చేసికొని తాగటం వల్ల, చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూను మెంతులను జోడించండి. ఇలా తయారుచేసుకున్న టీని రోజులో ఒక్కసారైనా త్రాగడానికి ప్రయత్నించండి.

3. లవంగాలు :

3. లవంగాలు :

లవంగాలు మీ నోటి దుర్వాసనను చక్కదిద్దేందుకు బాగా ఉపయోగపడతాయి అలాగే వీటిలో చెడుశ్వాసను తొలగించడంలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

భోజన తర్వాత కొన్ని లవంగాలు ముక్కలను బాగా నమలండి (లేదా) మీరు వాటితో టీని తయారు చేసుకొని తాగవచ్చు కూడా.

4. నిమ్మరసం :

4. నిమ్మరసం :

నిమ్మకాయలలో ఉండే ఆమ్ల పదార్థం మీ నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.

ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి, దానితో మీ నోరును బాగా శుభ్రం చేయండి.

5. ఆపిల్ సైడర్ వెనిగర్ :

5. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వినెగార్ అనేది నోటి దుర్వాసనను నివారించడానికి ఒక మంచి ఇంటి చిట్కా అని చెప్పవచ్చు. దానిలో ఉండే pH సంతులిన ప్రభావాలకు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే, ఇది చెడువాసన-కారక బ్యాక్టీరియాతో పోరాడటానికి బాగా సహాయపడుతుంది.

చెడుశ్వాస చికిత్స కోసం, మీరు ప్రతి ఉదయం ఒక గ్లాసు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని నోటిలో వేసుకొని బాగా పుక్కిలించి ఉమ్మి వేయాలి.

6. దాల్చిన చెక్క :

6. దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కలో "సిన్నమోన్ అల్డిహైడ్" అనే గుణాన్ని కలిగి ఉన్న కారణంగా మీరు త్వరగా చెడుశ్వాసను వదిలించుకోవచ్చు. ఇది నోటిలో చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియా సంఖ్యను పూర్తిగా తగ్గిస్తుంది.

ఒక కప్పు నీటిలో దాల్చినచెక్క పొడిని వేసి బాగా మరిగించండి. అందులో బే ఆకులను, అలాగే ఏలకులను కూడా జోడించండి. ఇది మీ నోటిని శుభ్రం చేసి మంచి పరిష్కారాన్ని సూచించడంలో అది బాగా ఉపయోగపడుతుంది.

7. టీ ట్రీ ఆయిల్ :

7. టీ ట్రీ ఆయిల్ :

టీ ట్రీ ఆయిల్ అనేది, మీ నోటికి ఒక శక్తివంతమైన క్రిమిసంహారిణిగా పనిచేసే క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది.

ఒక గ్లాసులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ను, పిప్పెర్మెంట్ ఆయిల్ను, లెమన్ ఆయిల్ను వేసి బాగా కలిపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మౌత్-వాష్గా ఉపయోగించుకోండి.

8. చూయింగ్ గమ్ :

8. చూయింగ్ గమ్ :

మీరు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ను వాడటం వలన, మీ నోటి దుర్వాసనను తప్పక నయం చేయగలదు. ఇది మీ నోటిలో ఆరోగ్యకరమైన లాలాజల ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది.

మింట్ వంటి రుచిని కలిగి ఉన్న చూయింగ్ గమ్ను వాడండి.

9. పార్స్లీ :

9. పార్స్లీ :

పార్స్లీ అనేది మీ నోటి దుర్వాసనను నివారించడం చికిత్స కోసం వాడబడే చాలా మంచి ఇంటి చిట్కా. ఇది బ్యాక్లోఫిల్ అనే లక్షణాన్ని కలిగి ఉంది, అది యాంటీ బాక్టీరియల్గా పని చేస్తూ, మీ నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

మంచి ఫలితాలను పొందడం కోసం మీరు కొన్ని తాజా పార్స్లీ ఆకులను నమలాలి.

10. ఉప్పు నీరు :

10. ఉప్పు నీరు :

ఉప్పు నీరు, మీ నోటి యొక్క pH సంతులనాన్ని తటస్తం చేసి, బాగా శుభ్రపరుస్తుంది. ఇది కూడా యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంది.

ఒక్క గ్లాసు గోరువెచ్చని నీళ్లలో సరిపోయినంత ఉప్పును కలిపగా తయారయిన ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం నోటిలో వేసుకుని బాగా పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందగలరు.

English summary

10 Home Remedies For Bad Breath

10 Home Remedies For Bad Breath,Bad breath is also known as halitosis and it can be due to a number of reasons. Here are the home remedies for bad breath.
Story first published: Thursday, March 15, 2018, 9:00 [IST]