For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ కంటి జాగ్రత్తకై వైద్యులు సూచించే పది ఉత్తమమైన చిట్కాలు

  |

  ఎటువంటి కంటి సమస్యలు లేకపోయినా కూడా సమయానుసారం కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. సరైన ఆహారప్రణాళిక , ప్రణాళికా బద్దమైన జీవనం మీ కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరo మరియు భవిష్యత్ లో కంటి సమస్యలు రాకుండా కూడా నిరోధించవచ్చు. ఇప్పుడు చెప్పబోయే 10 పద్దతులు వైద్యులచేత సూచించబడినవి. వీటిని పాటించడం మీ కళ్ళకు ఎంతో మంచిది.

  విటమిన్లు మినరల్స్ సరైన మోతాదులో శరీరానికి అందేలాగా ఆహార ప్రణాళికలలో మార్పులు చేసుకోవడం ద్వారా అనేక కంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా కంటి శుక్లాలు, గ్లకోమా , వయసు ప్రభావం వలన కళ్ళలో మచ్చలు, రే చీకటి, కళ్ళు పొడిబారడం వంటి అనేకసమస్యలను దరికి రాకుండా చూసుకోవచ్చు.

  10 Things Your Eye Doctor Knows And Wishes You Did Too

  ఆహారం లోని రోగ నిరోధక శక్తి శరీరానికి హాని చేసే బాక్టీరియాను నాశనం చేయడం ద్వారా అనేక సమస్యలు రాకుండా అడ్డుకోగలదు. కావున అన్నిటా సరైన ఆహార ప్రణాళిక మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి ముఖ్యం.

  కళ్ళకు ముఖ్యoగా ల్యూటెన్, zeaxanthin, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, బీటా కెరోటిన్, జింక్ మరియు ఒమేగా3 ఫాటీ యాసిడ్స్ అవసరం.

  ఈ పది టిప్స్ పాటించడం ద్వారా మీ కళ్ళకు సంబంధించిన జాగ్రత్తలకై మొదటి అడుగు వేయండి.

  1.కంప్యూటర్ మీ కళ్ళకు హాని కలిగించకుండా చూడండి :

  1.కంప్యూటర్ మీ కళ్ళకు హాని కలిగించకుండా చూడండి :

  కంప్యూటర్ లేదా, లాప్టాప్ ఎక్కువగా వినియోగించడం కళ్ళకు భౌతికంగా మరియు ఆరోగ్య పరంగా కూడా హాని కలిగిస్తాయి. ఆఫీస్ పనుల వలన కానీ, మీడియా, గేమ్స్ పరంగా కానీ ఎక్కువసేపు కాళ్ళను స్క్రీన్ కి అప్పగించడం చేయడం మూలంగా కళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. నెమ్మదిగా కంటి చూపు మందగించడం, తలనొప్పులు రావడo వంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున అప్పుడప్పుడు కనీసం 20 నిమిషాలకు ఒకసారి 2,3 నిమిషాలు విశ్రాంతిని ఇస్తూ, కళ్లను కడుక్కోవడం, కాసేపు కళ్ళను స్క్రీన్ నుండి పక్కకు తప్పించడం, కాసేపు కంటికి ఏదైనా ముసుగు వేసి విశ్రాంతిని ఇవ్వడం, వీలైనప్పుడు ఒక చిన్న కునుకు తీయడం వంటి వాటి ద్వారా కంటికి ఒత్తిడి లేకుండా చూడవచ్చు.

  2.అద్దాలు ధరించడం వలన కళ్ళు నిర్వీర్యం కావని గమనించాలి:

  2.అద్దాలు ధరించడం వలన కళ్ళు నిర్వీర్యం కావని గమనించాలి:

  అనేకమంది కళ్ళద్దాలు ధరించడం వలన కళ్ళు నిర్వీర్యమవుతాయన్న అపోహలో ఉంటారు. అది అబద్దం. అద్దాలు మీ కంటి చూపు మెరుగవ్వడానికే ఉపయోగపడుతాయి తప్ప మీ కంటిని దెబ్బతీసే లక్షణాలు కలిగి ఉండవు. మీ వయసును బట్టి వాటిని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. మీరు వయసు మీద పడేకొద్దీ లెన్సెస్ మార్చడం తగ్గిస్తూ ఉంటారు. మీరు యుక్తవయసులో ఉన్నవారైతే సంవత్సరానికోసారి, వయసు మీద పడుతున్న కొలదీ కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా కళ్ళద్దాలు మార్చవలసినదిగా సూచిస్తుంటారు. అవి సన్ గ్లాసెస్ అయినా మరే ఇతర గ్లాసెస్ అయినా సరే.

  3. చలికాలం లో కళ్ళు పొడిబారడం జరుగుతాయి :

  3. చలికాలం లో కళ్ళు పొడిబారడం జరుగుతాయి :

  మీ కళ్ళు ఎర్రగా మారడం, లేదా అసౌకర్యానికి గురవడం వంటివి జరుగుతూ ఉంటే నెమ్మదిగా పొడిబారే లక్షణాలు మొదలయ్యాయని అర్ధం. ఈ పరిస్థితులు ముఖ్యంగా చల్లని వాతావరణంలో వస్తుంటాయి. కళ్ల పటాల మీది నీళ్ళు కళ్ళు పొడిబారకుండా చూస్తుంటాయి. కానీ గాలి పొడిబారుతున్నప్పుడు, కళ్లలోని నీరు వేగంగా ఆవిరవడం జరుగుతుంది. కావున అప్పుడప్పుడు కృత్రిమ కందెనలు(eye –drops or గ్లిసరిన్) వినియోగించుట ద్వారా లేదా నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కళ్ళు పొడిబారకుండా కాపాడవచ్చు.

  4.మేకప్ కూడా కళ్లలో అంతర్గత సమస్యలకు దారితీయొచ్చు :

  4.మేకప్ కూడా కళ్లలో అంతర్గత సమస్యలకు దారితీయొచ్చు :

  వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా ఇది నిజం. కొందరు మేకప్ వేసే సమయాల్లో పరికరాలు వినియోగించుటలోనూ అజాగ్రత్తను ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా మస్కారా కుంచెలను వినియోగించు సమయంలో ఒక్కోసారి కళ్లలోని కార్నియా కి గీతలు పడే అవకాశం ఉంది. కావున ఇలాంటి సందర్భాలలో అత్యంత జాగరూతులై వ్యవహరించవలసి ఉంటుంది. మరియు కొందరు పౌడర్లు, ఫేస్ క్రీములు అప్లై చేయు సందర్భాలలో అజాగ్రత్తగా ఉన్నందువలన ఆ రసాయనాలు కళ్లలోకి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా అనేక రకాల కంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.

  5. ధూమపానం ఆరోగ్యానికే కాదు కంటి చూపుకు కూడా హానికరం :

  5. ధూమపానం ఆరోగ్యానికే కాదు కంటి చూపుకు కూడా హానికరం :

  ఎక్కువగా ధూమపానం చేయు వారిలో కళ్ళలో మచ్చలు తరచుగా కనిపించడం చూస్తూనే ఉంటాం. ఇవి నెమ్మదిగా వారి కంటి చూపు పూర్తిగా మందగించేలా చేస్తుంది. సిగరెట్ వల్ల కాన్సర్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులే కాకుండా పరోక్ష ధూమపానం వలన మన ప్రియమైన వారి ఆరోగ్యాలను కూడా దెబ్బతీస్తామని ఇప్పటివరకు తెలుసు, కానీ కంటికి కూడానా అని అనుమానం వస్తుంది కదా.

  ధూమపానం వలన కళ్ళలో ఉన్న అతి చిన్న రక్తనాళాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉంటాయి, ఇవి రెటీనా మరియు సంబంధించిన నరాల మీద ప్రభావం చూపుతుంది. తద్వారా కంటి చూపు మందగించడం సర్వసాధారణం.

  6. కారెట్స్ కంటి చూపుకు మంచిదని తెలుసు, అదొక్కటేనా?

  6. కారెట్స్ కంటి చూపుకు మంచిదని తెలుసు, అదొక్కటేనా?

  ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం, కంటి చూపు అనగానే గుర్తుకువచ్చే దుంపకూర కారెట్ . కంటి చూపుకి కారెట్ మాత్రమే కాదు దీనికన్నా మంచివి అనేకం ఉన్నాయి. పాలకూర, కాలే మరియు ఇతర ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు కారెట్ కన్నా అద్భుతంగా పనిచేస్తాయి. కంటిలోని మచ్చలు తగ్గుముఖం పట్టడం లో, లేదా మచ్చలు రాకుండా చూచుటలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వయసు ప్రభావిత కంటి సమస్యలకు కూడా ఇవి పరిష్కారంగా ఉంటాయి.

  7.తక్కువ కాంతిలో చదవడం మీ కoటి చూపును తగ్గించదు కానీ ..! :

  7.తక్కువ కాంతిలో చదవడం మీ కoటి చూపును తగ్గించదు కానీ ..! :

  అనేకమంది అభిప్రాయాల ప్రకారం తక్కువ కాంతిలో చదవడం మూలంగా చూపు మందగిస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూపు మందగించడం కంటే , కళ్ళు ఒత్తిడికి గురవడం, తద్వారా తలనొప్పికి గురవడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు ఇలా డిమ్ లైట్ (తక్కువ కాంతి) లో చదవాల్సిన పరిస్థితులు వస్తే , నేరుగా పేజీ మీద కాంతి పడేలా చూసుకోవాలి, భుజాల మీది నుండి కాదు.

  8.కళ్ళు గులాబీ రంగులో మారుతుంటే వైద్యుని సంప్రదించుట మంచిది :

  8.కళ్ళు గులాబీ రంగులో మారుతుంటే వైద్యుని సంప్రదించుట మంచిది :

  కళ్ళు గులాబీ రంగులోకి మారడం వలన కంటిచూపు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేకమంది వైద్యులు కూడా ఇది సాధారణ సమస్యగా భావించి రోగనిరోధక మాత్రలు ఇచ్చి పంపిస్తుంటారు. నిజానికి ఇది ఒక వైరస్ వలన వచ్చిన సమస్య. కావున కంటి వైద్యుని వద్దకే వెళ్ళాల్సిందిగా సూచించడమైనది. తద్వారా దీనికి ప్రత్యేకమైన చికిత్స ఇవ్వడం జరుగుతుంది.

  9.రాత్రివేళల యందు కాంటాక్ట్ లెన్స్ తొలగించండి :

  9.రాత్రివేళల యందు కాంటాక్ట్ లెన్స్ తొలగించండి :

  నిద్రకు ఉపక్రమించే ముందు కాంటాక్ట్ లెన్సులను తొలగించి , కళ్ళు శుభ్రపరచుకుని పడుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. దీనికి కారణం కాంటాక్ట్ లెన్సులతో నిద్రపోవడం వలన , వీటిపై బాక్టీరియా పెరిగే అవకాశం లేకపోలేదు, అవి వేరే సమస్యలకు కూడా దారితీయవచ్చు. ముఖ్యంగా CLARE - Contact Lens Acute Red Eye అనే సమస్య తలెత్తే అవకాశం ఉంది. కంటి నొప్పి, కళ్ళు ఎర్రబారడం, సున్నితంగా అనిపించడం వంటివి ఈ సమస్య సంకేతాలు.

  10.లెన్సులు క్లీన్ చేయడానికి ఏవి పడితే అవి వాడకండి :

  10.లెన్సులు క్లీన్ చేయడానికి ఏవి పడితే అవి వాడకండి :

  రోజూ గ్లాసెస్ వాడడం వలన అవి మురికిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున రోజూ వాటిని శుభ్రపరచుకున్నాకనే వేసుకోవలసి ఉంటుంది. శుభ్రపరచడానికి వేడి నీళ్ళు వాడరాదు, ఇది మీ గ్లాసెస్ జీవితకాలాన్ని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీళ్ళతో సున్నితంగా మైక్రోఫైబర్ క్లాత్ వినియోగించి శుభ్రపరచాలి. మీ దుస్తులను శుభ్రపరచుటకు వినియోగించకండి. ఎక్కువగా దుస్తులు మనకు తెలీకుండానే బాక్టీరియాతో నిండి ఉంటాయి. అవి కళ్ళకు చేరడం మంచిది కాదు.

  English summary

  10 Things Your Eye Doctor Knows And Wishes You Did Too

  Your eyes need many types of antioxidants to stay healthy like lutein, zeaxanthin, vitamin A, vitamin C, vitamin E, beta-carotene, omega-3s and zinc. Things your eye doctor knows and wishes you did too are that staring at a computer for longer hours hurts your eyes, wearing glasses doesn't weaken eyes, makeup causes eye injuries, smoking causes poor vision, etc.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more