For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆరోగ్యకరమైన గుండె కోసం, మీరు తప్పక ఈ 10 మార్గాలను పాటించండి !

  |

  ఈ రోజుల్లో, మనకు లభించే ఆహారాల పదార్ధాలన్నీ రసాయనాలు, క్రిమిసంహారక మందులతో పూర్తిగా నిండి ఉన్నాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండెపోటు, కాలేయం & మూత్రపిండాల సమస్యల వంటి వ్యాధుల పెరుగుదలకు దారితీస్తుంది.

  మహిళల మరణానికి ప్రధాన కారణాలుగా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ఉన్నాయి. కాబట్టి, మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మీ బరువును తరచూ తనిఖీ చేయండి, ధూమపానానికి దూరంగా ఉండటం, మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం వంటివి చాలా ముఖ్యమైనవి.

  మీ గుండె పనితీరు సక్రమంగా ఉండటానికి, మీరు శుభ్రమైన ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. శుభ్రమైన ఆహారం అలవాట్లు అనగా పూర్తిగా తాజా ఆహార పదార్థాలను తినటం మీద దృష్టి పెట్టడం వల్ల అవి మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, మిమ్మల్ని ఎప్పుడూ ఫిట్గా ఉంచుతుంది, అలాగే మీరు తీసుకొనే ఆహార పదార్ధాల పట్ల అసంతృప్తిని కూడా కలగజేస్తుంది.

  ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు తినే ఆహార పదార్థాల పట్ల తీసుకోవలసిన నాణ్యత ప్రమాణాలను గూర్చి ఇక్కడ కొన్ని మార్గాలను సూచించారు. వాటిని మీరు కూడా పరిశీలించండి.

  10 Ways To Clean Up Your Diet For A Healthier Heart

  1) ఇంటిలోనే "గ్రానోలా"ను తయారుచేయండి :

  ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అదనపు చక్కెర, ఉప్పుతో ఎక్కువగా నిండి ఉంటాయి, మనం ఎక్కువగా తీసుకొనే బ్రేక్-ఫాస్ట్ సిరియల్స్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గ్రానోలా అనేది నిజంగా ఒక అద్భుతమైన ఛాయిస్, వాటిలో ఓట్స్ను కలిపడం వల్ల ఫైబర్ను అందించేందుకు గొప్ప పదార్ధంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడుతుంది. మీ హృదయ ఆరోగ్యం కోసం కొబ్బరి ఫ్లేక్స్ను, బాదం (లేదా) బ్లూబెర్రీస్ వంటి వాటిని కూడా చేర్చవచ్చు.

  2) ఎక్కువ మోతాదులో

  2) ఎక్కువ మోతాదులో "ఒమేగా -3"ని పొందడం :

  మీ తీసుకునే ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి వుండటం వల్ల, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 25 శాతం మేర తగ్గిస్తుంది. అవిసె గింజలు, జనపనార గింజలు, అలానే కనోలా ఆయిల్ వంటి శోథ నిరోధక ఆహార పదార్ధాలు వీటిని బాగా కలిగి ఉన్నాయి. అలానే మనలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల స్థాయిని పెంచడానికి మేకరేల్, సాల్మోన్ మొదలైనవి నీటి చేపలను తినడం.

  3) ప్రోటీన్లు ఉండే పప్పులు :

  3) ప్రోటీన్లు ఉండే పప్పులు :

  ప్రోటీన్లను ఎక్కువగా కలిగి ఉండే పప్పు ధాన్యాలు, ఎండిన బీన్స్, చిక్పీస్ మరియు ఎండిన బఠానీలు వంటి పప్పులు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా మంచివి. అలాగే అవి పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, శోథ నిరోధక ఏజెంట్ల వంటి వనరులకు అందించడంలో అద్భుతమైన మూలం పదార్థంగా ఉంటుంది. మీరు పప్పుధాన్యాలను (లేదా) బాగా వేయించిన చిక్పీస్లను స్నాక్స్లా సాయంత్రం పూట తీసుకోండి.

  4) నట్స్ :

  4) నట్స్ :

  నట్స్, గింజలు వంటివి పోషక విలువలలో ముఖ్య కేంద్రస్థానంగా ఉన్నాయి. అవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ను అందించడంతో పాటు - వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు సమ్మేళనాలు కొలెస్టరాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె పనితీరును వేగవంతం చేసే రక్త సరఫరాను నియంత్రించడానికి సహాయపడే మెగ్నీషియమును నట్స్ కలిగి ఉంటుంది. గుమ్మడికాయ గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు వంటి వాటిని మీ ఆహారంలో తప్పక చేర్చుకోండి.

  5) తృణధాన్యాలు :

  5) తృణధాన్యాలు :

  యాంటీఆక్సిడెంట్లను, ఫైబర్లను మనకు అందించడంలో తృణధాన్యాలు చాలా ఉత్తమమైనవి. అందుకే తెల్లరొట్టెలను తీసుకోవడమే కన్నా, ఎక్కువ పోషక విలువను కలిగి ఉన్న ధాన్యపురొట్టెలను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే తృణధాన్యాలు ఎక్కువ పోషక విలువలను అందిస్తాయి, ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

  6) మీరు తీసుకునే షుగర్ను బాగా తగ్గించండి :

  6) మీరు తీసుకునే షుగర్ను బాగా తగ్గించండి :

  హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ ప్రకారం, చక్కెరను ఎక్కువగా తినడం వల్ల మీకు గుండె జబ్బులను, డయాబెటిస్, రక్తంలో అధికంగా కొలెస్ట్రాల్ స్థాయిల ప్రమాద తీవ్రతను పెంచుతుంది. కాబట్టి, మీరు చక్కెరను కలిగి ఉండే తీయని పానీయాల వినియోగాన్ని తగ్గించి, వాటికి బదులుగా సహజమైన నీరును (లేదా) కొబ్బరినీరును తాగటం మంచిది.

  7) ఆకుపచ్చని కూరగాయలు :

  7) ఆకుపచ్చని కూరగాయలు :

  ప్రతిరోజూ కూరగాయలను తినడం వల్ల మీ హృదయమును ఆరోగ్యంగా ఉంచుతుంది. విందు - భోజనాల కోసం 2 రకాల కూరగాయలను కలిగి ఉండటం వలన మీ శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించబడి హృదయ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. మీరు తినే సలాడ్లో (లేదా) సాసేడ్లలో ఉడికించిన కూరగాయలను కూడా జోడించవచ్చు.

  8) మాంసాహారాలను తక్కువ తీసుకోండి :

  8) మాంసాహారాలను తక్కువ తీసుకోండి :

  మీ గుండె-ఆరోగ్యం కోసం మాంసాహారాలను తీసుకోవచ్చు; కానీ పంది, గొడ్డు, చికెన్ వంటి మాంసాహారాల వినియోగాన్ని మీరు పరిమితం చేయాలి. మాంసాహారాలకు బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులతో మీ డైట్ను మార్చి వేయండి. ఎందుకంటే ఇవి మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ, మీరు వారంలో 2 సార్లు మాంసాహారాన్ని తినవచ్చు.

  9) న్యూట్రిషన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోండి :

  9) న్యూట్రిషన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోండి :

  పోషకాలను ఎక్కువగా కలిగి ఉన్న ఆహారాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వండి, ఖాళీగా ఉండే కేలరీలను మాత్రం ఎంచుకోకండి. పోషకాహారాలను తినడం వల్ల మీ గుండె ఆరోగ్యమును పెంపొందిస్తుంది. మీరు వివిధ రకాల నట్స్ను, గింజలను కలిపి తినటం వల్ల, అవి మీకు అవసరమైన ప్రోటీన్లను మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆరోగ్యకరమైన కొవ్వులను మీకు అందిస్తాయి.

  10) ఇష్టమైన ఫుడ్స్ :

  10) ఇష్టమైన ఫుడ్స్ :

  మీ ఖచ్చితంగా కొన్ని ఇష్టమైన ఆహార పదార్థాలను కలిగి ఉంటారు. కాబట్టి, మీరు మాంసాహార ప్రియులైతే, అప్పుడు మీరేమి చెయ్యాలి. గడ్డిని నెమరు వేసే పశువుల నుంచి మాంసాన్ని; పచ్చిక బయళ్ళలో పెరిగిన కోళ్ల నుంచి వచ్చే గుడ్లను మాత్రమే కొనండి. కానీ, మీరు ఒక శాఖాహారి గానీ అయితే, సేంద్రీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తారు.

  English summary

  10 Ways To Clean Up Your Diet For A Healthier Heart

  To maintain your heart functioning properly, you need to change your diet by eating clean. Eating clean mainly focuses on whole and fresh foods that will make you achieve good health, optimal fitness, and culinary satisfaction. Some of these include homemade granola, omega-3s, pulses, nuts, vegetables, whole grains, etc.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more