అశ్వ‌గంధ వ‌ల్ల క‌లిగే 13 ర‌కాల దుష్ప్ర‌భావాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

ఆయుర్వేదంలో ప్రాథ‌మికంగా వాడే మూల‌కాల‌లో అశ్వ‌గంథ ప్ర‌ధాన‌మైన‌ప్ప‌టికీ దీని వాడ‌కం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయి. న‌మ్మ‌శ‌క్యంగా లేన‌ప్ప‌టికీ, ఇది నిజం. అశ్వ‌గంధ వాడ‌కం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలున్న‌ప్ప‌టికీ, కొన్ని దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ క‌థ‌నంలో వివ‌రిస్తున్నాం.

అశ్వ‌గంథ సుర‌క్షిత‌మైన‌దేనా

ముమ్మాటికీ అశ్వ‌గంథ వాడ‌కం సుర‌క్షిత‌మే, ఒత్తిడిని నియంత్రించ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. శారీర‌కంగానే గాక మాన‌సికంగా కూడా దీని వాడ‌కం వ‌ల్ల ఎన్నో ప్రయోజ‌నాలున్నాయి. అయితే ఎంత ప‌రిమాణంలో తీసుకుంటున్నామ‌న్న దానిపై ఇది సుర‌క్షిత‌మా కాదా అనేది చెప్ప‌వ‌చ్చు. మోతాదుకు మించి తీసుకోవ‌డం మంచిది కాదు. అశ్వ‌గంధ వాడ‌కం వ‌ల్ల కొన్ని దుష్ప్ర‌భావాలు తలెత్తాయ‌ని కొంద‌రు వ్య‌క్తులు తెలిపారు. అవేంటో ఈ క‌థ‌నంలో విపులంగా తెలుసుకుందాం. అశ్వ‌గంధను ఎంత ప‌రిమాణంలో వాడాలో కింద వివ‌రించాం.

health tips in telugu

రూపం

ప‌రిమాణం

పొడి(ఆకు)

రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్‌లు

వేరు

రోజుకు 1 నుంచి 2 టీ స్పూన్‌లు

మాత్ర‌లు

రోజుకు 1 నుంచి 6 గ్రాములు

టీ రూపంలో

రోజుకు 3 క‌ప్పుల టీ లేదా 1 నుంచి 6 గ్రాములు

టింక్చ‌ర్ రూపంలో

( ఆల్క‌హాల్‌లో క‌రిగిన రూపం)

రోజుకు 2 నుంచి 4 మిల్లీ లీట‌ర్లు

పైన వివ‌రించిన మోతాదు దాటితే దుష్ప్ర‌భావాలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అశ్వ‌గంధ వాడ‌కం వ‌ల్ల త‌లెత్తే ప్ర‌మాద‌క‌ర దుష్ప్ర‌భావాల గురించి తెలుసుకుందాం.

అశ్వ‌గంధ వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలు

1.అలెర్జీలు రావ‌డం

1.అలెర్జీలు రావ‌డం

అశ్వ‌గంధ వాడ‌కం వ‌ల్ల చ‌ర్మంపై ద‌ద్దుర్లు రావ‌డం, మండిన‌ట్లుగా అనిపించ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వంటి అలెర్జీల‌ను ఎదుర్కొన్న‌ట్లు కొంత మంది తెలిపారు. దీనిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఇది సొల‌నేసి(నైట్‌షేడ్‌) కుటుంబానికి చెందింది కాబ‌ట్టి, ఈ మొక్క‌ల ప‌ట్ల అలెర్జీ ఉన్న‌వారు దీనిని వాడ‌క పోవ‌డ‌మే మంచిది.

2. రక్త‌స్రావం అవ‌డం

2. రక్త‌స్రావం అవ‌డం

అశ్వగంధ వాడ‌కం వ‌ల్ల కొన్ని సార్లు ర‌క్త‌స్రావం జ‌రిగిన‌ట్లు కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి ర‌క్త‌స్రావ రుగ్మ‌త ఉన్న‌వారు లేదా స‌ర్జ‌రీ చేసుకున్న వారు దీని వాడ‌కానికి దూరంగా ఉండ‌టం ఉత్త‌మం.

3. రక్తంలో చ‌క్కెర స్థాయులు త‌గ్గడం

3. రక్తంలో చ‌క్కెర స్థాయులు త‌గ్గడం

అశ్వ‌గంధ‌నుపయోగించ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయులు గ‌ణనీయంగా ప‌డిపోతున్న‌ట్లు కొన్ని అధ్య‌య‌నాలు తెలిపాయి. కాబ‌ట్టి మ‌ధుమేహా వ్యాధి ఉన్న‌వారికి ఇది అంత ప్ర‌యోజ‌న‌క‌రం కాదు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు త‌గ్గ‌డం అనేక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. స‌రైన స‌మాచారం లేకున్న‌ప్ప‌టికీ, ఇది ర‌క్త‌పోటుపైనా దుష్ప్ర‌భావాలు చూపే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

4. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు

4. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు

దీని వ‌ల్ల ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి క‌డుపులో అల్స‌ర్లు ఉన్న‌వారు దీనిని వాడ‌కూడ‌దు. అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌లబ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా వ‌చ్చే అవ‌కాశం ఉందని ఒక అధ్య‌య‌నంలో తేలింది. దీని వ‌ల్ల అతిసారం(డ‌యేరియా), క‌డుపు నొప్పి కూడా రావ‌చ్చు.

5. మ‌గ‌త‌గా లేదా మ‌త్తుగా అనిపించ‌డం

5. మ‌గ‌త‌గా లేదా మ‌త్తుగా అనిపించ‌డం

అశ్వ‌గంధకున్న ల‌క్ష‌ణాల వ‌ల్ల వ్య‌క్తుల‌కు మ‌గ‌త‌గా లేదా మ‌త్తుగా అనిపిస్తుంది. కాబ‌ట్టి మ‌త్తునిచ్చే ఇత‌ర ఔష‌ధాలైన ఆల్ఫ్రాజోల‌మ్‌, లోరా జెప‌మ్‌, జోల్పిడెమ్ లాంటి వాటితో క‌లిపి దీనిని తీసుకోవ‌డం ప్ర‌మాద‌క‌రం. మ‌త్తునిచ్చే ఇత‌ర ఔష‌ధాల‌తో క‌లిపి దీనిని తీసుకున్న‌ప్పుడు అతినిద్రా వ్యాధి కూడా రావ‌చ్చు.

6. నోరు పొడిబారిన‌ట్ల‌నిపించ‌డం

6. నోరు పొడిబారిన‌ట్ల‌నిపించ‌డం

మోతాదుకు మించి వాడకం వ‌ల్ల కొంత‌మంది వ్య‌క్తుల‌లో నోరు పొడిబారిన‌ట్ల‌వుతుంది. కాబ‌ట్టి ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడు వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది.

7. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు

7. అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు

శ్రీలంక లోని రుహునా విశ్వ‌విద్యాల‌యం వారి అధ్య‌య‌నం ప్ర‌కారం అశ్వ‌గంధ వాడ‌కం ఒక్కోసారి పురుషుల‌లో అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌లు తీసుకొచ్చి, వారి లైంగిక ప‌టుత్వాన్ని దెబ్బ తీసే అవ‌కాశం కూడా ఉంది. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్ట‌మైన అధ్య‌య‌నాలు జ‌ర‌గాల్సి ఉంది.

8. కాలేయ స‌మ‌స్య‌లు

8. కాలేయ స‌మ‌స్య‌లు

అశ్వ‌గంధ‌ను మోతాదుకు మించి తీసుకోవ‌డం వ‌ల్ల కొన్ని సార్లు కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అయితే దీనిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సింది.

9. జ్వ‌రం రావ‌డం

9. జ్వ‌రం రావ‌డం

అశ్వ‌గంధ వాడకం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు పెరిగి వారం లేదా రెండు వారాలపాటు జ్వ‌రం వ‌చ్చిన‌ట్లుగా ఉంటుంది. ఆ త‌ర్వాత సాధార‌ణ ప‌రిస్థితి ఉంటుంది. ఒక‌వేళ అలా లేక‌పోతే వైద్యుడిని సంప్ర‌దించండి.

10. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఇబ్బందులు

10. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఇబ్బందులు

అశ్వ‌గంధ వ‌ల్ల గ‌ర్భ‌వ‌తులుకు కొన్ని స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. అమెరికాలోని స్లోన్‌-కెట‌రింగ్ మెమోరియ‌ల్ క్యాన్స‌ర్ సెంట‌ర్ వారి అధ్య‌యనం ప్రకారం ఒక్కోసారి గ‌ర్భ‌స్రావం(అబార్ష‌న్‌) అయ్యే అవ‌కాశాలున్నాయి. అంతేగాక శిశువులకు పాలు ప‌ట్టే స‌మ‌యంలోనూ దీని వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ద‌ని ఒక స‌మాచారం. కాబ‌ట్టి గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌లు దీనికి దూరంగా ఉండ‌టం ఉత్త‌మం.

11. హైప‌ర్ థైరాయిడిజం మ‌రింత జ‌ఠిలం అయ్యే అవ‌కాశం

11. హైప‌ర్ థైరాయిడిజం మ‌రింత జ‌ఠిలం అయ్యే అవ‌కాశం

అశ్వ‌గంధ శ‌రీరంలో థైరాయిడ్‌ గ్రంధి ద్వారా ఉత్ప‌త్త‌య్యే హార్మోన్‌ల ప్ర‌భావాన్నిపెంచుతుంది. కాబ‌ట్టి హైప‌ర్ థైరాయిడిజం ద్వారా బాధ ప‌డేవారికి ఇది అంత ప్ర‌యోజ‌న‌క‌రం కాదు. అయితే హైపో థైరాయిడిజంతో బాధ ప‌డే వారు దీని వాడ‌కానికి ముందు వైద్యుల‌ను సంప్ర‌దించి తీసుకుంటే వారి స‌మ‌స్య‌కు ఉపశ‌మ‌నం ల‌భంచే అవ‌కాశం ఉంది.

12. ఆటో ఇమ్యూన్ వ్యాధులు మ‌రితంగా పెరిగే అవ‌కాశం

12. ఆటో ఇమ్యూన్ వ్యాధులు మ‌రితంగా పెరిగే అవ‌కాశం

అశ్వ‌గంధ ప్ర‌ధానంగా వ్య‌క్తి యొక్క రోగ నిరోధ‌క శ‌క్తిని మ‌రింత మెరుగుప‌రుస్తుంది. అయితే కీళ్ల వ్యాధులు(రుమాటాయిడ్ ఆర్థ‌రైటీస్‌), లూప‌స్‌, మ‌ల్టీపుల్ స్క్లీరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారికి దీని వాడ‌కం స‌మ‌స్య‌లను తీసుకొచ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధుల‌కు చికిత్స తీసుకుంటున్న‌ప్పుడు వాటితో క‌లిపి అశ్వ‌గంధ‌ను వాడితే రోగ నిరోధ‌క శ‌క్తి మంద‌గించే ప్ర‌మాదం ఉంది. స‌రైన జాగ్ర‌త్త‌లు తీస‌కున్న‌ట్ల‌యితే అశ్వ‌గంధ వాడ‌కం మంచి ప్ర‌భావాల్నే చూపిస్తుంది.

13. అశ్వ‌గంధ వాడ‌కంలో తీసుకోవాల్సిన ఇత‌ర జాగ్ర‌త్త‌లు

13. అశ్వ‌గంధ వాడ‌కంలో తీసుకోవాల్సిన ఇత‌ర జాగ్ర‌త్త‌లు

అశ్వ‌గంద‌ను ఎల్ల‌ప్పుడూ స‌రైన మోతాదులోనే తీసుకోవాలి. వాడిన‌ప్పుడు ఏవైనా వ్య‌తిరేక ల‌క్ష‌ణాలు కనిపిస్తే స‌రైన వైద్య స‌ల‌హా పొందాలి. అశ్వ‌గంధ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

* అశ్వ‌గంధ‌ను ఎల్ల‌ప్పుడూ ఒక అనుబంధ ఔష‌ధంగానే వాడాలి త‌ప్ప క్యాన్స‌ర్ నివార‌ణ‌లో వాడే విథాఫిరిన్‌-ఏ లాంటి ఔష‌ధాల త‌ర‌హాలో పోల్చి చూడ‌కూడ‌దు.

* భోజ‌నం లేదా అల్ప‌హారం తీసుకున్న త‌ర్వాత ఒక గ్లాసు మంచి నీళ్లు తాగి అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం మంచిది.

* అశ్వ‌గంధ ఒక‌వేళ ఇత‌ర ఔష‌ధాల ప్ర‌భావాన్ని మెరుగుప‌రుస్తున్న‌ట్ల‌యితే, వాటిని వాడే ముందు మ‌రొక్క‌సారి ప‌రిశీలించి వాడితే మంచిది.

* క‌డుపు నొప్పి లేదా డ‌యేరియాతో బాధ ప‌డేవారు దీనిని భోజ‌నంతో క‌లిపి మాత్ర రూపంలో తీసుకోవ‌డం మంచిది.

ముగింపు

ఆయుర్వేదంలో అశ్వ‌గంధ మంచి ఔషధం అన‌డంలో ఎలాంటి సందేహాం లేదు. దీనిని తీసుకున్న రెండు వారాల లోపు సానుకూల ప్ర‌భావం క‌నిపించ‌డం మొద‌ల‌వుతుంది. అయితే వాడేట‌ప్పుడు దీని వ‌ల్ల త‌లెత్తే దుష్ప్ర‌భావాల‌ను సైతం మదిలో ఉంచుకోవాలి. ఏవైనా వ్య‌తిరేక ల‌క్ష‌ణాలు కనిపించ‌డం మొద‌లైతే వైద్య‌లు స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

మా ఈ క‌థ‌నం మీకు ఎలా ఉప‌యోగ‌ప‌డిందో తెలుప‌గ‌ల‌రు. ఈ కింద బాక్స్‌లో మీ కామెంట్లు తెలుప‌గ‌ల‌రు.

English summary

13 Unexpected Side Effects Of Ashwagandha

Being one of the foremost ingredients used in Ayurveda, it is highly unlikely that ashwagandha has any side effects. But the truth is, it does. Hard to believe, isn’t it? We know, and hence this post about ashwagandha side effects. Read to understand what we are talking about.
Story first published: Thursday, April 5, 2018, 12:00 [IST]