ఇలా చేస్తే ఒంటిపైన ఒక్క చెమట కాయ కూడా రాదు.. కావాలంటే పాటించి చూడండి

Written By:
Subscribe to Boldsky

ఎండకాలం ఎంత అందమైన అమ్మాయి ఒంటిపైనా అయినా సరే చెమటకాయలు వస్తుంటాయి. అబ్బాయిలు కూడా చెమటకాయలతో అల్లాడిపోతుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యల్లో చెమటకాయలు కూడా ఒకటి. వీటి వల్ల చర్మం దురద పెట్టడమే కాదు, తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. అయితే కింద ఇచ్చిన కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చెమట కాయలను నివారించవచ్చు. అయితే చెమటకాయలను చాలా సులభంగా తగ్గించుకోవొచ్చు.

వెనిగర్

వెనిగర్

టిష్యూ పేపర్ ను తీసుకుని వెనిగర్ లో ముంచి చెమటకాయలున్న చోట అద్దాలి. ఇలా చేయడం వల్ల చెమటకాయలు త్వరగా తగ్గుముఖం పడుతాయి.బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాసి చూడండి. చర్మానికి సంరక్షణ కూడా అందుతుంది. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గుముఖం పడతాయి.వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్‌కు చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి.

లవంగనూనె

లవంగనూనె

కాటన్ బాల్ ని తీసుకుని లవంగనూనెలో ముంచి చెమటకాయలున్న చోట రాయాలి. ఇలా రోజు చేయడం వల్ల చెమట కాయల సమస్య నుండి బయటపడవచ్చు. చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గే అవకాశం ఉంది.

సబ్జా నీరు తాగితే

సబ్జా నీరు తాగితే

మజ్జిగ, సబ్జా నీళ్లు, బార్లీ వంటివి రోజూ తాగుతూ ఉంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట రాయాలి. అనంతరం పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద

కలబంద

కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని చెమట కాయలు ఉన్న ప్రదేశంలో రాయాలి. కలబందలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. ప్రధానంగా రోజులో అధిక శాతం వేడి వాతావరణంలో గడిపే వారికి అలోవెరా జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని దానికి కొంత నీటిని కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్‌ను ముంచి చర్మంపై రాస్తే చెమట కాయలు తగ్గిపోతాయి.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్

శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తీసుకుని అందులో కొన్ని ఐస్ ముక్కలను వేయాలి. అనంతరం ఆ ఐస్ ప్యాక్‌ను చెమటకాయలు ఉన్న ప్రాంతంలో 15 నిమిషాల పాటు మసాజ్ చేసినట్టు రాయాలి. దీంతో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలా చెమట కాయలు తగ్గేవరకు ప్రతి 3, 4 గంటలకు ఒకసారి ఐస్ ప్యాక్‌ను అప్లై చేస్తే తగిన ఫలితం కనిపిస్తుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

కొద్దిగా బ్లాక్ టీని తీసుకుని చర్మంపై రాయాలి. దీని వల్ల కూడా చెమట కాయలు తగ్గుతాయి. చర్మానికి సంరక్షణ అందుతుంది.

ఓట్స్

ఓట్స్

కొద్దిగా ఓట్స్‌ను తీసుకుని మిక్సీలో వేసి పౌడర్‌గా పట్టుకోవాలి. దాంట్లో కొంత గోరు వెచ్చని నీటిని పోయాలి. అనంతరం దాన్ని మిశ్రమంగా కలపాలి. దీన్ని చెమటకాయల మీద రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే చెమట కాయలు తగ్గుతాయి.

గంధం

గంధం

చెమటకాయల వల్ల ఏర్పడే మంట తగ్గించడంలో గంధం చక్కగా పనిచేస్తుందంటారు చర్మనిపుణులు. గంధం, రోజ్ వాటర్ కలిపి చెమటకాయలు ఉన్నచోట అప్లై చేయి పదినిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు.

ఆముదం

ఆముదం

ఆముదంలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కవగా ఉండడం వల్ల వేడి పొక్కులు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు చుక్కల ఆముదాన్ని ఒక కాటన్ బాల్ పై వేసి చెమటకాయలు ఉన్న చోట నెమ్మదిగా రాయడం వల్ల అవి క్రమంగా తగ్గుముఖం పడతాయంటున్నారు వైద్యులు.

పాలలో..

పాలలో..

చల్లటి పాలలో కాటన్ బాల్స్ ను తడపి చెమటకాయలపై మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల ఆ పొక్కుల వల్ల వచ్చే మంట తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. అలోవెర జెల్ ను చెమటకాయలు ఉన్న చోట అప్లై చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని స్కిన్ స్పెషలిస్టులు అంటున్నారు.

జీలకర్ర

జీలకర్ర

జీలకర్రలో కొద్దిగా నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా సమస్య ఉన్న చోట అప్లై చేస్తే చెమటకాయలు తగ్గుతాయని అంటున్నారు వైద్యులు.

English summary

15 effective home remedies for prickly heat rashes

15 effective home remedies for prickly heat rashes
Story first published: Friday, May 18, 2018, 13:00 [IST]