TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
శారీరిక బలానికి ఈ 5 యోగాసనాలు చేసే సహాయం అంతా ఇంతా కాదు. .!
మీ ఆత్మస్థైర్యానికి శరీరాకృతి మరియు అంతర్గత శక్తి చేసే సహాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు విషయాలు, దైనందిక జీవనంలో ప్రతి అంశం మీద కూడా సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. సరైన శారీరికబలంలేని వ్యక్తి అనేక ఆరోగ్య మరియు మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా, నరాల అస్థిరత, నరాల బలహీనత, బలహీన రోగ నిరోధక వ్యవస్థ, డీ హైడ్రేషన్, రక్తపోటు అసాధారణ ఫలితాలతో పాటు హార్మోనుల అసమతౌల్యం వంటి దారుణమైన పరిస్థితులను కూడా ఎదుర్కోక తప్పదు.
కావున ఎటువంటి శారీరిక అసాధారణ స్థితులను లేదా ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు మీకు అనిపించిన ఎడల, క్రమంగా జీవనశైలిలో మార్పులు తీసుకుని రావాలని అర్ధం. ముఖ్యంగా ఆహార ప్రణాళిక, మరియు వ్యాయమం.
యోగాభ్యాసం, బలహీనతను నివారించడానికి, మరియు మానసికంగా, శారీరికంగా నూతనోత్తేజం పెరిగే క్రమంలో ఉపయోగపడే, సహజమైన మరియు ఆచరణాత్మక మార్గంగా ఉంటుంది. ఇది మీ శరీరం యొక్క భౌతిక మరియు మానసిక స్థితిగతులను క్రమబద్దీకరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. రోజులో కనీసం అరగంట నుండి గంట సమయం యోగాసానాలకు కేటాయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరని నిపుణుల అభిప్రాయం.
యోగాలో కొన్ని ఆద్యాత్మిక ధోరణి కలిగినవిగా కూడా ఉన్నాయి, క్రమంగా ఇది శరీరం లోపలి విస్తృత శ్రేణి కండరాలను మరియు కీళ్ళను బలపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మానసిక స్థితిగతులను చక్కదిద్దేక్రమంలో ఎంతగానో సహాయపడుతుంది.
శారీరిక బలం అంటే ఏమిటి?
శరీరం యొక్క బలం, ఒక వస్తువును కదిలించడం లేదా, ఏదైనా శారీరిక శ్రమ సంబంధించిన అంశాలలో బయటపడుతుంది. యోగాభ్యాసం ముఖ్యంగా శారీరిక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. శారీరిక శ్రమతో పాటు, ఇతర బాహ్య మరియు మానసిక శక్తులను ఎదుర్కోవడం వంటివి తరచుగా దైనందిక జీవనంలో తారసపడే అంశాలుగా ఉంటాయి. కావున శరీరానికి తగినంత బలాన్ని చేకూర్చడం ఖచ్చితంగా అవసరం.
ఇక్కడ చెప్పబోయే ఈ 5 యోగాసనాలు, మీ దైనందిక జీవనంలో శారీరిక, మానసిక బలానికి అత్యంత దోహదం చేసే ఉత్తమమైన ఆసనాలుగా ఉన్నాయి.
దృఢమైన శరీరాకృతి, బలానికి ఈ 5 యోగాసనాలు చేసే సహాయం అంతా ఇంతా కాదు. .!
1. పాదహస్తాసన:
ఈ యోగాసనం మీ శరీర ఉదర కండరాలను బలపరుస్తుంది మరియు ఈ అభ్యాసనం వేగంగా నిర్వహించిన ఎడల, ఇది కడుపు చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడానికి, మీరు నేరుగా వెన్నెముకతో నిలబడాలి. మీ చేతుల్ని పైకి ఎత్తి, ఊపిరి పీలుస్తూ, క్రిందికి వంగుతూ ఊపిరి వదలాలి. ఈక్రమంలో మీ నుదురును మోకాలి వద్దకు తీసుకురావటానికి ప్రయత్నించండి మరియు మీ చేతులు నేలను తాకేలా, లేదా కనీసం మీ బ్రొటనవేలిని తాకడానికైనా ప్రయత్నించండి. మీరు మీ చీలమండను పట్టుకొని కూడా ప్రయత్నించవచ్చు. కొన్ని సెకండ్ల పాటు ఉండి తిరిగి యధాస్థితికి రావలసి ఉంటుంది.
2. భుజంగాసనం లేదా కోబ్రా పోజ్:
మీ వెన్నెముకకు ఉత్తమమైన వంగే గుణాన్ని ఇవ్వదలచిన ఎడల, ఈ ఆసనం మీకు ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో మరియు మీ వెన్నెముక దృఢత్వo మెరుగుపరచడంలో ఈ ఆసనం సహాయం చేస్తుంది. అది అమలు చేయడానికి, మీ పొత్తికడుపును మరియు గడ్డాన్ని నేలమీద ఉంచాలి మరియు మీ అరచేతులను నేలపై ఉంచి, నెమ్మదిగా ఉదరం మీదుగా నిలబడాలి. ఈ సమయంలో మీ కాలి బొటన వేళ్ళు, నేలకు తాకి ఉన్నాయని నిర్ధారించుకోండి. మూడు నిమిషాలు ఇదే స్థానంలో ఉండి, తిరిగి యధాస్థితికి రావలసి ఉంటుంది. పలుమార్లు చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందగలరు.
3. శలభాసన:
మీ పిరుదుల భాగం మరియు తొడల నుండి ఒత్తిడిని తగ్గించడానికి శలాభాసనం పనిచేస్తుంది. తత్ఫలితంగా మీ పిరుదులు మరియు కటి ప్రాంతం ఉత్తమంగా బలపడుతుంటుంది. మీ ఉదరం మరియు గడ్డం మీద పడుకుని ఈ ఆసానాన్ని చేయవలసి ఉంటుంది. మీరు మీ చేతులను, భుజాలకు సమాంతరంగా ఉంచండి, తర్వాత నెమ్మదిగా రెండు కాళ్ళను పిరుదుల మీదుగా పైకి లేపవలసి ఉంటుంది. కాళ్ళు లేపిన తర్వాత, నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండాలి. కనీసం 5 నుండి 10 సార్లు ఈ ఆసనాన్ని పునరావృతం చేయండి.
4. గజాసనం:
కటి కండరాలను, వెన్నెముక మరియు ఉదర కండరాలను బలపరుచుటకు గజాసనం ఉత్తమంగా సహాయం చేస్తుంది. నేరుగా నిలబడి మీ అరచేతులను జోడించండి. జోడించిన చేతులు పైకెత్తే క్రమంలో ఊపిరి తీసుకుంటూ, తిరిగి మోకాళ్ళ మద్యలోకి తీసుకొచ్చే క్రమంలో ఊపిరి వదులుతూ ఈఆసనాన్ని చేయవలసి ఉంటుంది. ఈ యోగాభ్యాసాన్ని 20 సార్లు పునరావృతం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు.
5. డాల్ఫిన్ భంగిమ:
డాల్ఫిన్ భంగిమ, సాధారణంగా తలను సక్రమంగా ఉంచే క్రమంలో ఒక సన్నాహక వ్యాయామంగా నిర్వహిస్తారు. ఇది మీ చేతులను పటిష్టంగా కూడా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మోకాళ్ళు మరియు మోచేతులపై కూర్చుని, వెన్నెముకను బల్లపరుపుగా నిటారుగా ఉంచే భంగిమ ద్వారా ఈప్రక్రియ ప్రారంభమవుతుంది. నెమ్మదిగా మీరు విలోమ V ఆకారంలో, మోచేతులు మరియు బ్రొటన వేళ్ళపై నిలబడవలసి ఉంటుంది. ఆ భంగిమలో ఊపిరి తీసుకుంటూ, తిరిగి యధాస్థితికి వచ్చే క్రమంలో ఊపిరి వదలవలసి ఉంటుంది. కానీ తల, నేలను తాకేలా చేయకూడదని గుర్తుంచుకోండి. మీరు విలోమ V భంగిమకు తిరిగి వెళ్ళే క్రమంలో ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రక్రియ సుమారు 15మార్లు కొనసాగించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.