For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడితో బాధపడుతున్నవారు విశ్వసించకూడని ఐదు అపోహలు

|

ఉరుకుల పరుగుల, గజిబిజి జీవితంలో, మనకు అందీ అందకుండా ఊరించే లక్ష్యాల సాధనకు పరుగులు పెట్టడం ఈ రోజుల్లో అందరికి అనుభవమే. ఈ పరుగులో తలో తీరానికి కొట్టుకుపోతుంటారు. ఈ ప్రక్రియలో కొంతమంది అనుకున్నది సాధించలేక, లేదా పరుగు పెట్టలేక లేకా ఆ పరిస్థితులకు సర్దుకోలేక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. ఒక నానుడి ద్వారా ఒత్తిడి ఎంత తీవ్రమైనదో, మనం తెలుసుకోవచ్చు. "ఒత్తిడి అంటే చనిపోవడానికి ప్రయత్నిస్తున్న మనసుతో, జీవించడానికి ప్రయత్నిస్తున్న ఒక దేహం సాగించే పోరాటం ".

ఈ వాక్యం చదివితే మనకు ఒత్తిడి అనేది ఎంత తీవ్రమైన మానసిక వ్యాధో అర్ధమవుతుంది. ఒత్తిడికి గురైనవారు తమ జీవితానికి ఎటువంటి అర్ధం లేదని మరియు ఇంత మానసిక వ్యధను భరిస్తూ, జీవించి ఉండవలసిన అవసరం లేదని భావిస్తారు.

7 Dangerous Myths People With Depression Must Never Believe!

సాధారణంగా, స్వల్ప ఒత్తిడికి లోనైనవారిలో, ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ, తీవ్ర ఒత్తిడికి లోనైన వారిలో కనిపించే వివిధ లక్షణాలు మరియు దుష్ప్రభావాలు, వారినే కాక, వారి చుట్టు పక్క మసలేవారిని కూడా బాధిస్తాయి.

ఒత్తిడిని మానసిక ఆరోగ్య సమస్య వలన ఒక వ్యక్తి బాగా కృంగిపోయి ఎప్పుడు ఎదో బాధతో సమయం గడుపుతూ దైనందిన జీవిత క్రియల పట్ల ఆసక్తి కోల్పోవడం అని చెప్పుకోవచ్చు.

ఆందోళన, ఉదాసీనత, అసంతృప్తి, బాధపడటం, విశ్రాంతి లేకపోవడం, మానసిక కల్లోలం, కోపం, ఆకలిలో హెచ్చుతగ్గులు, బరువులో హెచ్చుతగ్గులు మొదలైనవి ఒత్తిడి యొక్క ముఖ్యలక్షణాలు.

మీలో లేదా మీ చుట్టుపక్కల వారిలో ఒత్తిడి యొక్క లక్షణాలు ఉంటే కనుక వెనువెంటనే గుర్తించడం చాలా అవసరం, ఎందుకనగా ఇది తక్షణ వైద్యసహాయం అవసరమైన చాలా తీవ్రమైన మానసిక వ్యాధి.

కనుక, మీ కొరకు మేమి ఇక్కడ ఒత్తిడికి లోనైన వారు దాని నుండి బయటపడాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు, నమ్మకూడని కొన్ని అపోహలను మీకోసం అందిస్తున్నాం.

1.

1. "నేము ఒత్తిడితో పోరాడకపోతే,నా బలహీనత బయటపడుతుంది."

చాలాసార్లు, ఒత్తిడితో బాధపడుతున్న వారికి చుట్టుపక్కల వారు, మానసికంగా బలంగా ఉంటూ, ఒత్తిడితో పోరాడమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఇలా చేయడం వలన బాధితులకు, తాము ఒత్తిడి నుండి బయటపడకపోతే, మానసికంగా బలహీనపడిపోతామనే భావన పెరుగుతుంది. ఒత్తిడి కూడా మధుమేహం, క్యాన్సర్ వంటి ఒక వ్యాధి, దీని నుండి చికిత్స లేకుండ తమకు తాము బయట పడాలనుకోవడం అవివేకం.

2.

2. "నేను ఎప్పటికి ఇలా బాధతో సతమతమవుతూ బతకాల్సిందే"

ఒత్తిడితో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ, తాము శాశ్వతంగా, బాధాకరమైన, నిరాశతో కూడిన జీవితం గడపాల్సిందే అని భావిస్తుంటారు, ఎందుకంటే, వారి మెదడులో జరిగే రసాయనిక మార్పులు, వారి ఆలోచనలను ఆ విధంగా ప్రభావితం చేస్తాయి.

కానీ, వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇది కేవలం ఒక మానసిక రుగ్మత. మానసిక వైద్య చికిత్స, జీవనశైలిలో మార్పులు ద్వారా దీనిని నయం కావించుకొని, నిస్సందేహంగా సాధారణ జీవితం గడపవచ్చు. సరైన సహాయం తీసుకుంటే, వారు తిరిగి ఖచ్చితంగా మామూలు మనుషులవుతారు.

3.

3. "నేను ఎవరికీ భారం కాకూడదు"

సాధారణంగా, ఒత్తిడికి లోనైన వారు ఏ కారణం లేకుండానే ఎప్పుడూ ఆందోళన చెందుతూ, ఒంటరితనం తమను వెంటాడుతుందని, తమకు నిరంతరం ఎవరిదైనా సహాయం లేదా తోడు అవసరమని భావిస్తారు.

కానీ , ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఆధారపడుతూ ఉంటే, తాము ఎదుటివారి దృష్టికి మరీంత భారంగా కనపడతామనే ఆత్మన్యూన్యతకు లోనవుతారు. దీనితో వారిపై ఒత్తిడి మరీంత పెరుగుతుంది. కానీ, వారు ఇలా భవించవలసిన అవసరం లేదు. వారు ఎవరి సహాయాన్నైనా అర్ధించి, త్వరగా ఈ విషవలయం నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.

4.

4. "మందులను వాడితే నా ఆరోగ్యం ఇంకా పాడవుతుంది"

ఇది ఒత్తిడితో బాధపడేవారు బాగా విశ్వసించే మరొక అపోహ. వీరు ఒత్తిడి నుండి బయటపడటానికి ఉపయోగించే మందులు తమ ఆరోగ్యంపై శాశ్వత దుష్ప్రభావం చూపుతాయని నమ్ముతారు.

కనుక, వారు ఆ మందులను తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దీనివలన వారి పరిస్థితి మరీంత దిగజారుతుంది.కానీ, నిజమేమిటంటే, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ, దుష్ప్రభావాలను దూరంగా ఉంచే విధంగా , మందుల మోతాదును ఎప్పటికప్పుడు మారుస్తూ వైద్యాన్ని అందిస్తారు. ఒత్తిడి చికిత్స కోసం వినియోగించే ప్రతి ఒక్క మందు దుష్ప్రభావం కలిగి ఉండదు.

5.

5. "మానసిక వైద్యుని సహాయం కొరకు ఆర్థిస్తే నా ప్రతిష్టకు భంగం కలుగుతుంది"

ఈ రోజుల్లో కూడా, కొంతమంది ఒత్తిడి కూడా క్రుంగబాటు ఉందని ఇతరులకు చెప్పినా, లేదా మనదిక వైద్య సహాయం పొందాలని అనుకున్నట్లయినా, తమ ప్రతిష్టకు భాగం కలుగుతుందని భావిస్తున్నారు. కనుక ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వక, తమలోతామే కుమిలిపోతూ, ఆరోగ్య పరిస్థితిని మరీంత దిగజార్చుకుంటారు.

కనుక ప్రతిఒక్కరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఇతర వ్యాధుల వలే ఒత్తిడి కూడ ఒక వ్యాధి. చికిత్స ద్వారా మాత్రమే దీనిని పరిష్కరించుకోగలము.

English summary

7 Dangerous Myths People With Depression Must Never Believe!

Depression is a very serious mental disorder which could lead to life-threatening consequences when not treated medically. It is important to realise that it is a disease just like any other major disease like diabetes or cancer, that requires attention and support to be given to the patient. There are a few myths that people with depression must never believe in.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more