రాత్రి భోజనం తర్వాత తాగకూడని 7 డ్రింక్స్

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

సంపూర్ణ ఆహారం, మంచి నీరు తాగటం, యాక్టివ్ గా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం- ఇదే ప్రతి ఒక్కరి జీవన నినాదం కావాలి. మీరు తినే ప్రతి ఆహారానికి పక్కన ఒకే తాగే డ్రింక్ ఉండటం అవసరం. మంచినీరు కానీ, ఎనర్జీ డ్రింక్ కానీ లేదా సూప్ కానీ ఏ రూపంలోనైనా హైడ్రేటడ్ గా ఉండటం రోజు మొత్తంలో ఎక్కువసేపు అవసరం.

కానీ రాత్రిపూట మీరు ఏం తాగుతున్నారో దాని మీద ధ్యాస అవసరం.రోజంతా నీరు తాగటం వలన మీరు హైడ్రేటడ్ గా ఉండి, మీ జీర్ణక్రియలో సాయపడుతుంది, కానీ కొన్ని రకాల పానీయాలను డిన్నర్ తర్వాత అస్సలు తీసుకోకూడదు.

7 Drinks You Shouldn't Have After Dinner

మనం మాట్లాడుకునే పానీయాలను పగటిపూట తీసుకుంటే లాభదాయకం కావచ్చు కానీ అదే రాత్రి తీసుకుంటే వాటి లాభాలు కూడా నష్టాలుగా మారిపోతాయి. అవి మీకు అప్పుడు ఆరోగ్య సమస్యలు తెచ్చి, మిమ్మల్ని అన్ ఫిట్ గా మారుస్తాయి.

ఇంటర్నెట్ లో ఈ పానీయాలను తాగే విషయంపై అనేక అపోహలు ఉండటంతో, ప్రజలకి వారికి సూటయ్యే డ్రింక్స్ గురించి తగినంత అవగాహన ఉంది. కానీ అధ్యయనాల ప్రకారం సహజం కాని ఏ డ్రింక్ అయినా మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని నిర్థారించబడింది.

అందుకని ఎంత టెంప్ట్ చేసినా మీరు సోడా డ్రింక్స్ కి దూరంగా ఉండటమే మంచిది. మీరు మరికొన్ని అనారోగ్యకర డ్రింక్స్ గురించి ఆలోచించేలోగా, మీకు చెప్పేది ఏంటంటే అలాంటి డ్రింక్స్ కూడా పగటిపూట తమ దారుణ ప్రభావాలను కొన్ని గంటలలో చూపిస్తాయి.

మీరెప్పుడైనా పడుకునే సమయంలో ఈ చక్కెర ఎక్కువ ఉండే డ్రింక్స్ తాగటం ఎంత హానికరమో ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించండి ఎందుకంటే అలాంటి డ్రింక్స్ వలన మీ పొట్టలో కొవ్వు చేరుతుంది, మరింత ఊబకాయులుగా కన్పిస్తారు మరియు మీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.

మీరు రాత్రి భోజనం తర్వాత తీసుకోకూడని పానీయాలేంటో చూద్దాం.

1.క్రీముతో కాఫీ

1.క్రీముతో కాఫీ

వణికించే చలికాలపు రోజున మంచి కాఫీ తాగటం చాలా విశ్రాంతిగా ఉంటుంది. మనలో చాలామందికి కాఫీ రాత్రి తాగటం చాలా ఇష్టముంటుంది, అది రాత్రంతా చదవటానికి మెలకువగా ఉండటం కోసం కావచ్చు లేదా మనల్ని మనం వెచ్చగా ఉంచుకోటం కోసం కావచ్చు.

దేనికైనా, మీరు కెఫీన్ ను పరిమితిగానే తీసుకోవాలి మరియు రాత్రిపూట అయితే పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది ఎందుకంటే అందులోని వైట్ నర్ లేదా కాఫీ పొడితో కూడిన క్రీమర్ లో పాక్షికంగా మొక్కజొన్న సిరప్ మరియు హైడ్రోజెనెటడ్ కాయగూరల నూనె ఉంటుంది.

ఈ పదార్థాలు క్రీమును మరింత తినాలనిపించేలా చేస్తాయి. కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. హైడ్రోజెనెటెడ్ కాయగూరల నూనెలో కొవ్వు మరియు మొక్కజొన్న సిరప్ లో చక్కెర ఉంటాయని, వాటిని శరీరం రాత్రిపూట విఛ్చిన్నం చేయటానికి చాలా కష్టమవుతుందని తేలింది.

2.డైట్ సోడా

2.డైట్ సోడా

మీ నడుము సైజు ఆరోగ్యంగా ఉండాలంటే, రాత్రి భోజనం తర్వాత రాత్రి డైట్ సోడా తాగటం మానేయండి. పరిశోధకులు సాఫ్ట్ డ్రింక్స్ ను డైట్ సోడాను ద్రవరూపంలోని క్యాండీలుగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే వాటిల్లో చక్కెర పదార్థం ఎక్కువగా ఉంటుంది.

అందుకని మీరు మీ మొండి అధిక పొట్ట కొవ్వును తగ్గించుకోవాలంటే, మరియు దానికోసం చాలా కష్టపడుతుంటే, నిద్రపోయేముందు ఈ కృత్రిమ చక్కెరను తీసుకోవడం వలన మీ సమస్యలు మరింత పెరిగిపోతాయి. మీరు కష్టపడి చేసిన వ్యాయామాలన్నీ వృథా అయిపోతాయి.

3.ఆవుపాలు

3.ఆవుపాలు

పాలల్లో కాల్షియం మంచిగా ఉండి, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనందరికీ పాలతో ఈ ఉపయోగం గురించి తెలుసు. కానీ ఇదే అందరికీ ఎక్కువగా ఉండే అపోహ కూడా. అందరూ ఆవుపాలల్లో విటమిన్లు, కాల్షియం మరియు ప్రొటీన్ వస్తుందని నమ్ముతారు.

కానీ నిజానికి,ఆవుపాలు మీ ఎముకలకి హాని చేస్తుంది. ఇది ఎందుకంటే అందులో ఉండే ఎసిడిక్ యానిమల్ ప్రొటీన్ ఎముకల నుంచి కాల్షియంను వేరు చేస్తుంది. పైగా, పాలల్లో అనేక కాలరీలు, అనవసర కొవ్వు, యాంటిబయాటిక్స్, మరియు కొలెస్ట్రాల్ ఉంటాయి. అందుకని, డిన్నర్ తర్వాత పాలను తాగటం వలన మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి, కొవ్వు ఎక్కువ చేరుతుంది.

4.పౌడర్ మిశ్రమాలు

4.పౌడర్ మిశ్రమాలు

మీరు పడుకునేముందు మంచినీటి గ్లాసుకి కూడా సన్నగా ఉండే క్రిస్టల్ పౌడర్ మిశ్రమాలు జతచేయాలనుకుంటున్నారా? అవునైతే, మీకు తెలీకుండానే పడుకునేముందు మంచినీటిలో కృత్రిమ స్వీట్ నర్ కలుపుతున్నట్టు.

ఈ పౌడర్ మిశ్రమాలు మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, కడుపునొప్పి, ఆందోళన, వికారం మరియు తలనొప్పిని కలుగచేస్తాయి. అందుకని పడుకునేముందు ఈ మిశ్రమాలకి దూరంగా ఉండటం మంచిది.

5. ఫ్లేవర్ ఉన్న నీరు

5. ఫ్లేవర్ ఉన్న నీరు

మీకు సాధారణ నీరు తాగటం ఇష్టం లేకపోతే ఫ్లేవర్ ఉన్న నీరు తాగితే మీ దాహాన్ని తీరుతుంది. కానీ సహజం కానిది ఏదైనా మీ శరీరానికి హాని చేస్తుంది. ఉదాహరణకి, మీరు 20 ఔన్సుల సీసాలో విటమిన్ నీరును తాగుదాం అనుకుంటే, అందులో 120 క్యాలరీలు, 30గ్రాముల చక్కెర ఉంటుందని తెలుసుకోండి. ఈ కృత్రిమ స్వీట్ నర్లు ఉన్న పానీయాలు తాగటం వలన మీ శరీరానికి హాని కలుగుతుంది, ముఖ్యంగా పడుకునే ముందు తాగితే మరింత ప్రమాదకరం.

6.ఆపిల్ రసం

6.ఆపిల్ రసం

మార్కెట్లో దొరికే రెడీమేడ్ పళ్ళరసాల కన్నా తాజా ఆపిల్ రసం గ్లాసుడు తాగటం మంచిదే. అందుకని మీరు పడుకునే ముందు ప్యాక్ లో ఉన్న ఆపిల్ రసం తాగేముందు రెండుసార్లు ఆలోచించండి.

ఈ ప్యాక్డ్ పళ్లరసాల్లో తాజా రసంలో ఉండే సహజమైన ఫ్రక్టోస్ కి అదనంగా సుక్రోస్ జతచేయబడి ఉంటుమ్ది. అందుకని ఒక గ్లాసు ఆపిల్ రసం తాగితే, మీ కడుపులో చక్కెర, ఫ్రక్టోస్ పేరుకోవటం తప్ప ఏమీ ఒరగదు. వాటిని విఛ్చిన్నం చేయటం చాలా కష్టం, ఎందుకంటే మన శరీరం రాత్రిపూట ఏమీ అదనంగా కదలదు.

7. స్పోర్ట్’స్ డ్రింక్స్

7. స్పోర్ట్’స్ డ్రింక్స్

ఆఫీసులో చాలా అలసిపోయి వచ్చాక కోల్పోయిన శక్తిని తిరిగిపొందటానికి మీరు ఒక స్పోర్ట్'స్ డ్రింక్ తాగి అందులోని ఎలక్ట్రోలైట్లు పొందుదాం అనుకుంటున్నారా, అయితే మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి.

రాత్రిపూట కేవలం మీరు అలసిపోయారన్న కారణంగా మాత్రం ఈ స్పోర్ట్'స్ డ్రింక్స్ తాగవద్దు. రాత్రి భోజనం తర్వాత జిమ్ కి వెళ్దామనో, లేదా మారథాన్ రేస్ కి వెళ్తేనో తప్ప రాత్రి స్పోర్ట్'స్ డ్రింక్ తాగవద్దు.

ఈ డ్రింక్స్ లో సరిగ్గా సమయానికి విఛ్చిన్నం కాకపోతే మీ శరీరానికి హాని చేసి, నెగటివ్ ప్రభావాన్ని చూపే అనేక పదార్థాలు ఉంటాయి.

అందుకని ఇలాంటి కొన్ని పానీయాలను మీరు రాత్రిపూట, భోజనం అయిన వెంటనే తాగటం మంచిది కాదు, అలా అయితేనే మీరు యాక్టివ్ గా, ఆరోగ్యంగా ఉండి మరియు మీ మొండి అధిక పొట్ట కొవ్వును కరిగించుకోగలుగుతారు.

English summary

7 Drinks You Shouldn't Have After Dinner

7 Drinks You Shouldn't Have After Dinner, Studies reveal that any drink other than the natural ones can be harmful to your health. Here is a list of drinks you shouldn't have after dinner.
Story first published: Monday, February 19, 2018, 16:30 [IST]