For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌట్ వ్యాధితో బాధపడేవారు, ఈ 7 రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి !

గౌట్ వ్యాధితో బాధపడేవారు, ఈ 7 రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి !

|

గౌట్ అనేది కీళ్లలో వాపును కలిగించే కీళ్లనొప్పులు. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ వ్యాధి సంభవిస్తుంది. ఈ యాసిడ్ కీళ్ళ మధ్యలో సూది వంటి స్పటికాలను ఏర్పరుస్తుంది, తద్వారా ఆ ప్రాంతం ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పి & కీళ్ళవాపులకు కారణమవుతుంది. ఈ గౌట్ వ్యాధి ఎక్కువగా కాలి పెద్ద బొటనవేలు దగ్గర సంభవిస్తుంది. అలాగే చేతివేళ్ళు, మణికట్టు, మోకాళ్లలో కూడా సంభవించవచ్చు. మీరు తీసుకునే ఆహారం గౌట్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడం లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

గౌట్ వ్యాధిని ప్రేరేపించే ప్యూరిన్స్ ఆహారాలను తీసుకోవడం వల్ల మీకు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. ప్యూరిన్స్ ఆహారాలు జీర్ణం అయ్యేటప్పుడు మీ శరీరంలో యూరిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల గౌట్ సంభవించే పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తాయి.

7 Foods To Avoid If You Have Gout Disease

కాబట్టి, మీరు ఈ గౌట్ వ్యాధిని దూరం చేయడం కోసం బంగాళదుంపలు, బఠానీలు, పుట్టగొడుగులు, బీన్స్, సోయాబీన్స్, అన్నిరకాల నట్సు & గింజలు పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే మీరు ఈ గౌట్ వ్యాధిని కలిగి ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అవి ఈ క్రిందన సూచించబడ్డాయి. అవేమిటో మీరే చూడండి !

1. మాంసము :-

1. మాంసము :-

జంక్ ఫుడ్స్ను తినడం వల్ల మీ మెదడు కుదించుకుపోయేలా చేస్తుంది. ప్రాసెస్ చేయబడిన అనారోగ్యకరమైన ఆహారాలను తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తినడం వల్ల వాటిలో ఉండే అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు & యాంటీఆక్సిడెంట్లు మీ మెదడును కుదించుకుపోకుండా నిరోధిస్తుంది.

గౌట్ సమస్యతో బాధపడుతున్న వారు మాంసంలో ఇతర భాగాలైన లివర్, కిడ్నీ, స్వీట్ బ్రేడ్స్, బ్రెయిన్ వంటి వాటిని తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉన్న ప్యూరిన్స్ స్థాయిలు అత్యధికంగా ఉండటం వల్ల, గౌట్ సమస్యను మరింత ప్రాణాంతకంగా మార్చవచ్చు.

2. బీవరేజస్ (చక్కెర పానీయాలు) :-

2. బీవరేజస్ (చక్కెర పానీయాలు) :-

బీవరేజస్లో ఉండే చక్కెర & ఫ్రక్టోజ్ వంటి సమ్మేళనాలు యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పాదకతకు ఎక్కువగా దోహదపడతాయి. అందువల్ల ఇవి మీ గౌట్ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ పానీయాలలో ప్యూరిన్స్ స్థాయిలు అధిక మోతాదులో లేనప్పటికీ, ఫ్రక్టోజ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. శరీరంలోని కొన్ని సెల్యూలర్ ప్రక్రియలను ఉత్తేజపరచడం ద్వారా ఇలాంటి పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మీరు ఫ్రూట్ జ్యూస్లను, షుగర్ కలిగిన సోడాలను, ఆల్కహాల్ వంటి పానీయాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలి.

3. శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్లు :-

3. శుద్ధి చేయబడిన కార్బోహైడ్రేట్లు :-

వైట్ బ్రెడ్, కేకులు, వైట్ రైస్, షుగర్ & కుక్కీస్ వంటి పదార్థాలను శుద్ధి చేయబడిన పిండి పదార్ధాలు తయారు చేయడం వల్ల గౌట్ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఇటువంటి పదార్థాలలో ప్యూరిన్స్ & ఫ్రక్టోజ్ సమ్మేళనాలు ఎక్కువగా లేనప్పటికీ, వాటిలో ఉండే పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి కూడా శరీరంలోని యూరిక్ ఆమ్లము ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది.

4. ప్రాసెస్ చేసిన ఆహారాలు :-

4. ప్రాసెస్ చేసిన ఆహారాలు :-

మీరు గౌడ్ వ్యాధిని కలిగి ఉంటే చిప్స్, స్నాక్స్, మాంసాహారాల వంటి ప్రాసెస్ చేయబడిన ఆహారాలను వినియోగించకూడదు. ఇవన్నీ కూడా అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, వీటిని వినియోగించినట్లయితే కీళ్ళల్లో గౌడ్ సమస్య మరింత ఉధృతమవుతుంది.

5. చేపలు :-

5. చేపలు :-

షెల్ ఫిష్ & చేపల వినియోగం గౌట్ సమస్యను మరింత ప్రమాదకారిగా మార్చుతుంది. మీరు ముఖ్యంగా హెర్రింగ్, ట్రౌట్, మేకెరల్, ట్యునా, సార్డినెస్, ఆంకోవిస్ & హడ్డాక్ వంటి చేపల వినియోగాన్ని నివారించాలి. షెల్ ఫిష్లలో ముఖ్యంగా రొయ్యలు, ఎండ్రకాయల వినియోగాన్ని నివారించాలి.

 6. చక్కెర పదార్ధాలు :-

6. చక్కెర పదార్ధాలు :-

రుచిని మెరుగుపరచడానికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు చాలా వంటకాల్లో చేర్చబడతాయి. వాటిలో తేనె, కార్న్ సిరప్, మాపుల్ సిరప్ వంటివి ఉన్నాయి. ఇటువంటి చక్కెర పదార్థాలలో ఫ్రూక్టోజు అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయిని పెంచుతాయి. అందువల్ల, వీటి వినియోగానికి దూరంగా ఉండాలి.

7. ఈస్ట్ :-

7. ఈస్ట్ :-

న్యూట్రిషనల్ ఈస్ట్, బ్రీవర్స్ ఈస్ట్ & ఇతర ఈస్ట్ సప్లిమెంట్స్ను వాడకూడదు.

కొన్ని ఆహార పదార్థాలలో ప్యూరిన్స్ మితమైన స్థాయిని కలిగి ఉంటాయి. కాబట్టి వీటి పరిమితి వినియోగం వల్ల గౌట్లో వచ్చే మార్పులను కూడా మీరు దృష్టిలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. గౌట్ వ్యాధిని ప్రేరేపించు చికెన్, గుడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం మరియు సాల్మన్ చేపల వినియోగాన్ని పూర్తిగా నివారించాలి. వాటితో పాటుగా ప్యూరిన్స్ కలిగి ఉన్న కూరగాయలను కూడా తీసుకోవటం మానివేయడం వల్ల గౌట్ సమస్యలను తగ్గించుకోగలరు.

English summary

7 Foods To Avoid If You Have Gout Disease

Gout attacks are mainly triggered due to the intake of diet which is high in purine. Digesting purine can make your body produce uric acid as a waste product, hence aggravating the gout situation. Foods which may be preferred during gout include fruits and vegetables such as potatoes, peas, mushrooms, legumes such as lentils, beans, soya beans, all nuts and seeds, and dairy products. However, there are also certain foods which you must avoid in case you have gout.
Story first published:Wednesday, August 29, 2018, 13:07 [IST]
Desktop Bottom Promotion