For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి తగ్గించే క్రమంలో పాటించే ఈ 7 పద్దతులు నిజానికి అవాస్తవాలు మరియు ప్రతికూలకారకాలు

|

ప్రముఖ అమెరికన్ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు అయిన మారియాన్నే విలియంసన్ చెప్పిన ప్రకారం "ప్రతి అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి".

ప్రతి ఒక్కరూ ఈ వాక్యంతో ఏకీభవించక తప్పదు. ఎందుకంటే అది నిజం, మరియు తరతరాలుగా సాక్షులుగా ఉన్నాం కాబట్టి. ఎవరైతే ఎక్కువ ఒత్తిడిలకు లోనవుతున్నట్లు కనిపిస్తారో, ఖచ్చితంగా వారు అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు కూడా ప్రభావితమవుతారు అన్నది జగమెరిగిన సత్యం.

అనేక అధ్యయనాల నివేదికల ప్రకారం, మరియు శాస్త్రీయ ఆధారాల ప్రకారం ఒత్తిడి అనేది ఎన్నోరకాల శారీరిక, మానసిక అనారోగ్యాలకు ప్రధాన మూలముగా ఉన్నది.

7 Popular Myths On Reducing Stress That Actually Make It Worse!

అనేకమంది సాధారణంగా ఒత్తిడి, ఆందోళన అనేవి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు మాత్రమే కారణంగా పరిణమిస్తాయని అపోహపడుతుంటారు. కానీ అనేక శారీరిక అనారోగ్యాలకు కూడా ఇవే ప్రధానకారణాలుగా ఉన్నాయి అన్నది నిజం.

ఏదిఏమైనా కొన్ని శారీరక సమస్యలు ప్రధానంగా ఊబకాయం, జీర్ణ సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గుదల, రక్తపోటు, హార్మోనుల అసమతౌల్యం, మరియు ఇతర రకాల క్యాన్సర్ సంబంధిత సమస్యలు వంటివి కూడా ఒత్తిడి ప్రధాన కారకాలుగా ఉన్నాయి

ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తగ్గించే క్రమంలో, అనేక పద్ధతులు చలామణీలో ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజాలు అవ్వాల్సిన పనిలేదు. కొన్ని అబద్దాలుగా కూడా ఉండవచ్చు. తెలిసీ తెలియక కొన్ని అవాస్తవాలు ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఉపయోగపడుతాయని భావించి, కొన్ని వ్యసనాల బారిన పడి ప్రజలు కొత్త కొత్త సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు. ఇది నిజంగా బాధాకరమైన విషయము.

నిజానికి అనేక రకాల అవాస్తవాలు చలామణీలో ఉన్నాయి, ఇవి ఒత్తిడిని తగ్గించకపోగా, తీవ్రతరం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు, ఇలా చలామణి అవుతున్న కొన్నిరకాల అవాస్తవాలను మీ ముందు ఉంచుతున్నాము. ఇది ఒత్తిడిని తగ్గించకపోగా, సమస్యల తీవ్రతకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి.

1. టీవీ చూడడం ఒత్తిడిని తగ్గిస్తుంది

1. టీవీ చూడడం ఒత్తిడిని తగ్గిస్తుంది

ఏదైనా మానసిక గందరగోళానికి గురవుతున్నప్పుడు, స్నేహితులు గాని, సన్నిహితులు గాని, ప్రియమైనవారు గాని కుటుంబసభ్యులు గాని, అనేకరకాల మేగజైన్స్ లేదా బ్లాగులలో అనేకమంది వ్యక్తులు ఇచ్చిన చిట్కాల ద్వారా కానీ, టీవీ చూడడం, సినిమాలు చూడడం వంటి చర్యలు ఒత్తిడిని తగ్గిస్తాయి అని వినే ఉంటాము. కానీ ఇటువంటి వ్యాపకాలు క్రమంగా ఒత్తిడిలను పెంచుతాయి. వీటికి బదులుగా గార్డెనింగ్, హాబీలు, ప్రకృతితో స్నేహం, కుటుంబసభ్యులతో, స్నేహితులతో, ప్రియమైనవారితో సమయం వెచ్చించడం, మంచి మనసుకు నచ్చిన గీతాలు వినడం‌ వంటి వ్యాపకాలు "స్ట్రెస్ బస్టర్స్" గా ఉంటాయి.

2. ఒత్తిడి కారకాలను తిరిగి ఆలోచించడం

2. ఒత్తిడి కారకాలను తిరిగి ఆలోచించడం

అనేకమంది సమస్యలను ఎదుర్కొనలేక, పరిష్కార మార్గాలు దొరకక ఒత్తిళ్ళను ఎదుర్కోవడం సర్వసాధారణంగా ఉంటుంది. క్రమంగా మానసిక గందరగోళం నెలకొంటుంది. అనేకమంది, ఈ సమస్య నుండి బయటపడే క్రమంలో, ఎక్కడైనా తీరికగా కూర్చుని సమస్య మూలాలు గురించిన ఆలోచనలు చేయమని ఉచిత సలహాలు ఇస్తుంటారు. క్రమంగా సానుకూల ప్రతికూల ఫలితాల గురించిన విషయాల గురించి తీవ్రంగా మదనపడుతూ ఉంటారు. కానీ సమస్యలకు మూలం ఏమిటో అన్న ఆలోచన, పరిష్కార మార్గాలను చూపకపోగా ఒత్తిళ్లను మాత్రం క్రమంగా పెంచుతుంటాయి.

3. ఒత్తిడిని పట్టించుకోకపోవడం

3. ఒత్తిడిని పట్టించుకోకపోవడం

ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో భాగంగా సమస్య మూలాలు గురించిన ఆలోచనలు చేయడం సరికాదని మనం తెలుసుకున్నాం. కానీ ఒత్తిడిని అసలు పట్టించుకోకపోవడం అనేది కూడా ఒత్తిడిని పెంచుతుంది, కానీ పరిష్కారమైతే కాదు. ఆలోచనలకు కూడా ఒక పరిమితి ఉంటుంది.

4. మీ సమస్యల గురించిప్రతి ఒక్కరితో పంచుకుంటున్నారా

4. మీ సమస్యల గురించిప్రతి ఒక్కరితో పంచుకుంటున్నారా

అనేకమంది ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు, ఉచితం కాబట్టి. ఒత్తిడి తీవ్రమయ్యే కొద్దీ, సమస్యను ఇతరులతో పంచుకోమని అనేకమంది సలహా ఇస్తుంటారు. కానీ తెలియకుండానే నీసమస్య దావానలంలా ఇతరులకు కూడా చేరుతుంది. ఇటువంటి చర్యలు సరికొత్త సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాయి, కానీ ఒత్తిడిని మాత్రం తగ్గించలేవు.‌ మరియు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు కూడా కారణం అవ్వచ్చు. కావున మీ సమస్యను పంచుకోవాలి అని మీరు భావిస్తున్న ఎడల , అవతలి వ్యక్తి కూడా మీపరిస్థితులపట్ల పూర్తి అవగాహన కలిగి, మీప్రియమైనవారిగా, మీ శ్రేయోభిలాషిగా ఉండాలని గుర్తుంచుకోండి.

5. నచ్చిన ఆహారం తీసుకోవడం:

5. నచ్చిన ఆహారం తీసుకోవడం:

ఒత్తిడిని తగ్గించే క్రమంలో భాగంగా అనేకమంది తెలియకుండానే ఆహారం మీదకు మొగ్గు చూపుతుంటారు. ఉదాహరణకి పిజ్జాలు, చాక్లెట్లు, చిప్స్ మొదలైన కొవ్వు సంబంధిత ఆహారాల మీదకు మనసు వెళ్తుంటుంది. క్రమంగా ఈ అలవాటు శారీరిక జీవక్రియలకు ప్రధాన అడ్డంకిగా పరిణమిస్తాయి మరియు ఊబకాయం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, హార్మోన్ల అసమతౌల్యం వంటి అనేక సమస్యలకు కేంద్రబిందువుగా మారుతుంది.

6. ధూమపానం:

6. ధూమపానం:

అనేకమంది ధూమపానం ఒత్తిడిని తగ్గిస్తుంది అని అపోహపడుతుంటారు. ధూమపానం వలన సిగరెట్లోని నికోటిన్ ఆ క్షణాన ఒత్తిడిని తగ్గించినా కూడా, పర్యవసానంగా నికోటిన్ లేనిదే మనుగడ లేదు అన్నట్లుగా మెదడును ప్రేరేపిస్తుంది. మెదడులో నికోటిన్ స్థాయిలు పెరగడం మూలంగా ఒత్తిడి కూడా క్రమంగా పెరుగుతుంది. ఇవి ముఖ్యముగా సెరటోనిన్ మరియు డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్ల‌ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.

7. సోషల్ మీడియాకు అలవాటు పడటం:

7. సోషల్ మీడియాకు అలవాటు పడటం:

జీవితంలో సమస్యలు లేని ప్రాణి అనేదే ఉండదు, కానీ ప్రతి చిన్న సమస్యను తీవ్రంగా ఆలోచించి ఒత్తిళ్లకు గురయ్యి శారీరిక మానసిక సమస్యలను కోరి తెచ్చుకుంటున్న వ్యక్తులు మన చుట్టూతానే ఉంటారు. సోషల్ మీడియాలో కాలం గడపటం మూలంగా సమస్యలను కొంతమేర మర్చిపోవచ్చన్న కారణంతో ఎక్కువగా గాడ్జెట్లకు అలవాటుపడుతున్న యువతను కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ సోషల్ మీడియా మానసికశాంతిని ఇవ్వకపోగా సరికొత్త సమస్యలను సృష్టించి ఒత్తిడి కారకాలుగా పరిణమిస్తుంటాయి.

అనేక అధ్యయనాల ప్రకారం సోషల్ మీడియా ఒత్తిడిని తీవ్రతరం చేసే ప్రధానఅంశంగా కూడా ఉంది. ప్రతికూల ఆలోచనలకు, ప్రతికూల భావోద్వేగాలకు, అసూయాద్వేషాలకు నిరాశానిస్పృహలకు, ఒంటరితనానికి సోషల్ మీడియా ప్రధానకారకంగా ఉంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

English summary

7 Popular Myths On Reducing Stress That Actually Make It Worse!

Stress is one of the root causes for many diseases like heart ailments, depression, etc. that affect people. There are myths about reducing stress which worsen the condition and even your health: Distracting oneself with TV, re-analysing stressful situations, ignoring stress, over sharing your problems, eating comfort food, smoking, etc.
Story first published: Thursday, July 26, 2018, 17:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more