Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
నోటి దుర్వాసన నివారించే 7 చిట్కాలు !
నోటి దుర్వాసన నివారించే 7 చిట్కాలు !
మీ ఆఫీస్లో ముఖ్యమైన ప్రాజెక్టు కోసం, మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీ పళ్ళ ముందరి భాగంలో ఇరుక్కున్న ఆహారాన్ని గుర్తించినప్పుడు, మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా అది చెడుశ్వాసకు కారణం కావచ్చు. మీ పళ్ళలో ఇరుక్కున్న ఆహారము మీకే ఇబ్బంది కలిగించడమే కాకుండా, మీతో మాట్లాడేవారికి దానిని గమనించినప్పుడు మిమ్మల్ని చాలా అసహ్యించుకుంటారు.
చెడుశ్వాస (లేదా) హాలిటోసిస్ అనేది మీ నోటి నుంచి వచ్చే దుర్వాసనగా చెప్పవచ్చు. ఇది అత్యవసర వైద్యపరిస్థితిగా కనిపించకపోయినా, ప్రపంచంలోని 25 శాతం మంది ప్రజల ఈ సమస్యతో ప్రభావితం కాబడుతున్నారు. చెడుశ్వాసకు గల ముఖ్య కారణాలకు చాలా రకాల అంశాలు దోహదం చేస్తాయి వాటిలో సాధారణంగా చెప్పుకునేది మీ నోరు పరిశుభ్రంగా లేకపోవడం.

చెడుశ్వాసతో పోరాడడానికి కొన్ని మార్గాలున్నాయి.
1. భోజనం చేసిన ప్రతిసారి మీ నోటిని బ్రష్ చేసి శుభ్రపరుచుకోక పోయినా, కనీసం రోజులో రెండు సార్లు మీ పళ్ళను శుభ్రపరుచుకోడానికి ప్రయత్నించండి. అలా అని మీ పళ్ళు గట్టిగా బ్రష్ చేయకూడదు, లేదంటే మీ దంతాలు & చిగుళ్లు దెబ్బతినడానికి దారి తీయవచ్చు.

టూత్ బ్రష్ను మారుస్తూ ఉండాలి.
2. మీరు వాడే టూత్ బ్రష్ను 2-3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. మీ బాత్ రూమ్కి దగ్గరలో టూత్ బ్రష్ను ఉంచడం వల్ల దానిపై హానికరమైన బ్యాక్టీరియాలు, జెర్మ్స్ వంటివి నివాసాలను ఏర్పరచుకుంటాయి. కాబట్టి, మీరు ఇలాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వవద్దు.

3. మీరు రోజూవారీగా మౌత్ వాష్ని వాడండి.
మీ చెడుశ్వాసకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించటం ద్వారా మౌత్ వాష్ మీ పళ్లకు అదనపు రక్షణను ఇస్తుంది.

4. మీ నాలుకను శుభ్రపరుచుకోండి.
మీ నాలుకపై కనిపించే తెల్లటి పాచిని శుభ్రంచేయని ఫలితంగా దుర్వాసనతో కూడిన బ్యాక్టీరియాకు తగిన ఆవాసంగా మీ నోరు తయారవుతుంది.

5. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలను తీసుకోవడం మానివేయాలి.
ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలను తీసుకోవడం మానివేయాలి.ఎందుకంటే, అవి మీకు పుల్లటి రుచిగల శ్వాసను అందచేస్తుంది. మీరు ఈ రకమైన శ్వాసను కలిగి ఉండకూడదని కోరుకుంటే, మీరు ఉల్లి, వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని ప్రతీ రెండు-మూడు రోజులకు ఒకసారి తీసుకునేలా పరిమితం చేయాలి.

6. మీరు ధూమపానం చేసేవారైతే,
మీరు ధూమపానం చేసేవారైతే, మీరు ఈ అలవాటును మానుకోవడానికి మరోక కారణం ఉంది. ధూమపానం క్యాన్సర్కు మాత్రమే కారణం కాకుండా మీ దంతాలను & చిగుళ్ళను నష్టపరిచి, చెడుశ్వాసకు దారితీస్తుంది.

7. మీరు కొన్ని లవంగాలను (లేదా) సొంపుగింజలను తినాలి.
మీరు కొన్ని లవంగాలను (లేదా) సొంపుగింజలను తినాలి. వాటిలో ఉండే క్రిమినాశక లక్షణాలు చెడు వాసనకు కారణమైన బాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.



Click it and Unblock the Notifications