మీరు ఈ 7 రకాల శరీర నొప్పులను ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకూడదు !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నొప్పి అనేది అనేక జీవులచేత అత్యంత సాధారణంగా అనుభవించబడే అనుభూతులలో ఒకటి, అవునా ? మనలో చాలామంది రోజులో ఒక సారైనా చిన్న నొప్పిని ఎదుర్కొంటారు.

ఒక కారు తలుపు మధ్య మీ చేతి వేళ్లు ఇరుక్కోవడం, మీ కాలి యొక్క బొటనవేలు - బల్లకిబలంగా తగలడం, జీర్ణాశయ సమస్యల నుండి కడుపు నొప్పి రావడం, ఒత్తిడి కారణంగా తలనొప్పి రావడం, ఒక గేము ఆడుతున్నప్పుడు వచ్చే బెణుకుల వంటివిగా మనం చెప్పవచ్చు.

మనం ఒక నొప్పిని (లేదా) గాయాన్ని అనుభూతి చెందకపోతే, మన శరీరంలో అంతర్గతంగా ఎదురయ్యే గాయాలను (లేదా) ఇబ్బందులను మనం తెలుసుకోలేము.

7 Types Of Body Aches You Must Never Ignore

ఇదిలా ఎందుకంటే, నొప్పి అనేది ఒక ప్రత్యేకమైన వ్యాధి (లేదా) గాయం కారణంగా సంభవించే వాపు (లేదా) అంటురోగాల వల్ల కలిగే అనేక ప్రతికూల పరిస్థితుల యొక్క ముఖ్య లక్షణం.

మీ శరీరం మీద కొన్ని ప్రాంతాల్లో ఉన్న నరాలు (లేదా) కణజాలం ఎర్రబడినప్పుడు (లేదా) సంక్రమణకు గురయినప్పుడు నొప్పిని కలిగించవచ్చు, అలాంటప్పుడే వాపు (లేదా) ఇన్ఫెక్షన్లు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి.

ఇలాంటప్పుడు కొన్ని రకాల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి, వీటిని గుర్తించిన వెంటనే చాలామంది వైద్య సహాయం తీసుకోవడం కోసం ప్రయత్నిస్తారు.

మీ శరీరం యొక్క కొన్ని భాగాలలో వచ్చే ఇతర నొప్పులు చాలా తీవ్రంగా ఉండవు, అలాంటి నొప్పుల గూర్చి చాలామంది పట్టించుకోరు, కానీ అప్పటికే చాలా ఆలస్యం కావచ్చు.

కాబట్టి, ఇక్కడ మీరు ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని శరీర నొప్పులు ఉన్నాయి.

1. వెన్ను-నొప్పి :

1. వెన్ను-నొప్పి :

చాలామంది ప్రజలు తమ జీవితాల్లో వెన్ను నొప్పిని అనుభవించారు, ఎందుకంటే ఇది వయస్సు వల్ల వచ్చే వివిధ కారణాల వల్ల ఎదురయ్యే సాధారణమైన నొప్పులలో ఒకటని చెప్పవచ్చు. వీపు వెనుక ఉన్న కండరాలు, శరీరం యొక్క ఎగువ మరియు దిగువ భాగాల రెండింటికి మద్దతును ఇస్తాయి, కాబట్టి అవి చాలా ఒత్తిడికి గురవుతాయి! ఇప్పుడు, మీరు నిరంతరంగా ఈ వెన్ను నొప్పిని ఎదుర్కొంటున్నట్లు అయితే, మీ కాలిలోనూ మరియు పాదాలలోనూ జలదరింపును కలిగి ఉంటుంది. ఈవిధంగా అది వెన్నెముకలో దెబ్బతిన్న డిస్క్ను సూచిస్తుంది కాబట్టి మీరు ఈ నొప్పిని ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.

2. దవడ నొప్పి :

2. దవడ నొప్పి :

చాలామంది ప్రజలు తరచుగా దవడ నొప్పిని కలిగి ఉండరు, ఒకవేళ ఈ నొప్పి వారికి ఎదురైనప్పుడు కూడా దాని గూర్చి అస్సలు పట్టించుకోరు. అది ఒత్తిడి కారణంగా ఎదురైనా ఉంటుందని ఎవరూ ఆలోచించారు. ఈ దవడ నొప్పి అనేది ఒత్తిడి కారణంగా దవడ భాగంలో ఉన్న కండరాల వ్యాకోచాన్ని మరింత కష్టతరం చేసేదిగా ఉంటుంది. అయితే, ఈ దవడ నొప్పి స్థిరమైనది కొనసాగుతూ మరియు నొప్పిని కలిగి ఉండటం వల్ల, అది తేలికపాటి ఛాతీ నొప్పిని కలిగి భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన గుండె జబ్బులను సూచిస్తుంది!

3. రుతుస్రావం వల్ల కలిగే తిమ్మిర్లు :

3. రుతుస్రావం వల్ల కలిగే తిమ్మిర్లు :

గర్భాశయ గోడల చుట్టూ ఉన్న వాపు కారణంగా, స్త్రీ యొక్క రుతుస్రావం జరిగిన మొదటి రెండు రోజులలో ఈ తిమ్మిర్లు ఏర్పడతాయి. ఈ రోజుల్లో ఋతుస్రావం వల్ల తిమ్మిర్లు రావడం అనేది చాలామంది మహిళలలో సర్వసాధారణంగా జరిగే ఒక శారీరక చర్య మరియు కొన్ని రకాల ఔషధాలను ఉపయోగించడం వల్ల ఈ నొప్పి (లేదా) తిమ్మిర్లు భాధ నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే, మీరు ఈ మందులను దీర్ఘకాలంగా ఉపయోగించటం వల్ల ఆ నొప్పులు ప్రతిస్పందించని కారణంగా, మీరు STD's (లేదా) గర్భాశయ క్యాన్సర్ యొక్క ఉనికిని కలిగి ఉన్నట్లు సూచిస్తుంది!

4. తీవ్రమైన తలనొప్పి :

4. తీవ్రమైన తలనొప్పి :

ఇప్పుడు (లేదా) అప్పుడు అనే తేడా లేకుండా, ప్రతి వ్యక్తి స్వయంగా అనుభూతి చెందే నొప్పులలో తలనొప్పి అనేది అత్యంత సాధారణమైనది. తలనొప్పి రావడానికి ఒత్తిడి నుండి క్యాన్సర్ వరకు అనేక కారణాలు ప్రధానమైనవిగా ఉంటాయి! కాబట్టి తలనొప్పికి గల కారణాలను తెలుసుకునేందుకు అవసరమైన వైద్య పరీక్షలను చేయించుకునేంత వరకూ, దానిని ఎప్పుడు తేలికైన విషయంగా తీసుకోకూడదు. నిరంతరంగా మీకు తీవ్రమైన తలనొప్పి గానీ ఎదురైతే, మీ మెదడులో కణితుల యొక్క ఉనికిని (లేదా) గుండెకు ముప్పు ఉందని మనకు తెలియజేసే సూచిక. కాబట్టి మీరు తక్షణమే వైద్య సహాయం కోసం డాక్టర్ను సంప్రదించాలి !

5. పొత్తికడుపు నొప్పి :

5. పొత్తికడుపు నొప్పి :

మీ కడుపులో తలెత్తే జీర్ణాశయ సమస్యలు అనగా అసిడిటీ (లేదా) గ్యాస్ వంటి వాటి వల్ల వచ్చే కడుపు నొప్పి అతి సాధారణమైనదని చెప్పవచ్చు. అయితే, మీరు చాలాకాలం నుండి కడుపు కుడివైపు ప్రాంతంలో తక్కువ నిడివిగల నొప్పిని బాగా ఎదుర్కొంటున్నట్లయితే, అది అపెండిసైటిస్ (ఆంత్రప్రవాహము లో ఎదురైన ఇబ్బందిని) యొక్క ఉనికిని సూచిస్తుంది, ఇలాంటి సందర్భంలో మీరు తక్షణమే డాక్టర్ను కలిసి, స్కాన్ చేయించుకోవడం ద్వారా మీయొక్క సమస్యను నిర్ధారించుకోగలరు. అపెండిసైటిస్ను పట్టించుకోకపోతే అది ప్రాణాంతకమైన పరిణామాలకు దారి తీస్తుంది.

6. పాదాల నొప్పి :

6. పాదాల నొప్పి :

మీరు చేపట్టే వృత్తి కాలినడకకు సంబంధించినది అవడంవల్ల రోజు మొత్తంలో మీరు చాలా దూరం నడిచిన వ్యక్తి గాని అయితే మీకు వచ్చే పాదాల నొప్పికి చాలా సాధారణమైనది కావచ్చు. అయినప్పటికీ మీ పాదాలు మరియు కాళ్ళు పాక్షికంగా మొద్దుబారినట్లుగా ఉండి, మీరు నిరంతరమైన పాదాల నొప్పిని ఎదుర్కొంటున్నట్లు అయితే అది మధుమేహం (లేదా) డయాబెటికల్ న్యూరోపతి యొక్క ఉనికిగా సూచిస్తుంది. కాబట్టి, ఈ నొప్పిని మీరు విస్మరించడం వల్ల, చికిత్సను అందించటంలో మరింత ఆలస్యం కావచ్చు.

7. వీపు మధ్యలో ఎదురయ్యే నొప్పి :

7. వీపు మధ్యలో ఎదురయ్యే నొప్పి :

మీరు గాయపడకపోయినప్పటికీ (లేదా) సరైన కారణాలు లేకుండా మీరు మీ వీపు మధ్య భాగంలో నిరంతరమైన నొప్పిని కలిగి ఉన్నట్లుగా గమనించడమే కాకుండా, మీకు తరచుగా జ్వరం గానీ వస్తున్నట్లయితే, మీరు మీ మూత్రపిండలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ను కలిగి ఉన్నట్లు తెలియజేసే ఒక సూచిక అది ! సరైన సమయంలో సరైన చికిత్సను అందించకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారడానికి దారి తీయవచ్చు కాబట్టి మీరు ఈ నొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

English summary

7 Types Of Body Aches You Must Never Ignore

As humans, we experience many types of body aches, often. While some types of aches are normal and minor, others could be symptoms of dangerous diseases. Here are a few types of body aches you must never ignore!
Subscribe Newsletter