Just In
- 26 min ago
శరీరంలో ఎలాంటి నొప్పినైనా తగ్గించే సహజ నొప్పి నివారణలు
- 6 hrs ago
సోమవారం మీ రాశిఫలాలు (9-12-2019)
- 22 hrs ago
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- 1 day ago
ఆదివారం మీ రాశిఫలాలు (8-12-2019)
Don't Miss
- Sports
Ranji Trophy 2019-20: మైదానంలోకి పాము, భయపడ్డ ఆటగాళ్లు, నిలిచిన ఆట వీడియో
- News
ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: మొత్తం ఏడు వర్కింగ్ డేస్: బీఏసీలో నిర్ణయం..!
- Finance
విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
- Movies
'వెంకీమామ'లో ఆ 40 నిమిషాలు.. హైలైట్ సన్నివేశాలివే!
- Technology
జియోను అదిగమించిన వోడాఫోన్,ఎయిర్టెల్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఒత్తిడి మీ శరీరం పై చూపే ఏడు రకాల ప్రభావాలు మరియు దానిని అధిగమించే మార్గాలు.
ఒత్తిడి, ఇది ప్రతి చోట ఉంది లేదా రోజుకు ఒక్కసారైనా ఈ పదాన్ని ఎవరో ఒకరి నోటినుండి వినడం పరిపాటి అయ్యింది.
ప్రపంచవ్యాప్త జనాభాలో 80% మంది అనుదినం ఒత్తిడిని అనుభవిస్తున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 25 నుండి ఇరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి, ఒత్తిడి నిర్వహణకు సంబంధించిన శిక్షణ అవసరమని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ వయస్సులో వారు కనుక ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసుకొనకపోతే,తరువాతి దశలలో ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టతరమవుతుంది.
చాలావరకు కేసులు, కార్యాలయాల నుండి నివేదించబడ్డాయి. యువత అధికంగా ఒత్తిడికి బాధితులు అవుతున్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒత్తిడి అంటువ్యాధి వంటిది. అవును, మీరు చదివింది నిజమే!అధ్యయనాల ప్రకారం, మీరు ఒత్తిడితో బాధపడుతున్న వారి సాంగత్యంలో ఉంటే, మీ నాడీకణాలు కూడా అవే లక్షణాలను చూపిస్తాయి. అయితే, ఒత్తిడి అంటే ఏమిటి?
జీవితంలో ఎదురయ్యే కొన్ని అవాంఛిత లేదా ప్రతికూల అనుభవాలు,ఉదాహరణకు, భయాలు, బాధలు, ఆవేదనలు, అవమానాలు, ప్రమాదాలు మరియు బెదిరింపులకు మీ శరీరం స్పందించే తీరును ఒత్తిడి అంటారు. మీ శరీరం, మిమ్మల్ని సంరక్షించడానికి ఆ విధమైన ప్రతిచర్య చూపుతుంది. ఒత్తిడి ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నంతవరకు, మిమ్మల్ని కొన్ని సవాళ్ళను సాధించడానికి, ధ్యాస నిలిపి ఉంచడానికి, జగరూకతతో మెలగడానికి మరియు శక్తివంతంగా తయారవడానికి దోహదపడుతుంది.
కానీ ఒత్తిడి హద్దులు మీరితే, ఆందోళన, అవిశ్రాంతి, తలనొప్పి, ఛాతీ నొప్పి, క్రుంగబాటు, లైంగిక ఆసక్తి కోల్పోవడం , అలసట, కోపం వంటి లక్షణాలను కలుగజేస్తుంది. మన శరీరంలో.అరటి వ్యవస్థను దెబ్బతీస్తుంది. అదెలాగో, ఇక్కడ తెలుసుకోండి.

1. రోగనిరోధక వ్యవస్థ :
శరీరంలో నలత ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థను సత్వర చర్య తీసుకునే విధంగా ప్రేరేపిస్తుందని మనందరికీ తెలిసిందే! మన శరీరానికి తగిలిన గాయాలు, సోకే ఇన్ఫెక్షన్లు విషయంలో రోగనిరోధకత ఈ విధంగానే సహాయపడుతుంది. కానీ శరీరం ఒత్తిడికి లోనైనప్పుడు, ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి.

2. ప్రత్యుత్పత్తి వ్యవస్థ:
పురుషులు ఒత్తిడికి లోనైనప్పుడు, టెస్టిస్టిరోన్ హార్మోన్ అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది ఎక్కువ కాలం నిలువదు. అంటే మీరు కోర్కెను కోల్పోతారని అర్ధం. ఒత్తిడికి లోనైన శరీరం త్వరగా అలసిపోయి, శక్తిహీనం అయిపోతుంది. తీవ్రపరిస్థితులలో,అంగస్తంభనలు కలుగవు.
స్త్రీలలో నెలసరి మామూలుగా జరగకుండా అస్తవ్యస్తంగా, బాధతో కూడుకున్నట్టుగా మారిపోతాయి. లైంగిక వాంఛ సన్నగిల్లుతుంది.

3. కండర వ్యవస్థ:
సాధారణంగా, తాత్కాలిక ఒత్తిడి కలిగి ఉన్నపుడు కండరాలు బిగుసుకుపోతాయి. మీలో ఒత్తిడి తగ్గినప్పుడు అవి పూర్వ స్థితికి వస్తాయి. కానీ , మీరు దీర్ఘకాలిక ఒత్తిడికి లోనైనట్లైతే అవి నిరంతరంగా బిగుసుకుని ఉంటాయి.
దీని మూలంగా మీలో తలనొప్పి, కీళ్లకు గాయాలు, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, భుజం నొప్పి, లేదా పూర్తి శరీరం నొప్పి కనిపిస్తాయి. మీరు వ్యాయామం చేయలేరు. వైద్యుని సంప్రదించవలసి వస్తుంది. .

4. జీర్ణ వ్యవస్థ :
ఒత్తుడి మూలంగా మీ జీర్ణ వ్యవస్థ యందు ఆహార కదలికలు ప్రభావితమవుతాయి. దీని మూలంగా మలబద్ధకం, అతిసారం, వాంతులు, కడుపు నొప్పులు, వికారం మొదలైనవి కలుగుతాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీ కాలేయం అధికంగా చెక్కెరలను ఉత్పత్తి చేయవలసినదిగా ప్రేరేపించబడుతుంది. మీ శారీరక అవసరమైన శక్తిని అందివ్వడానికి, రక్తంలో చెక్కెరల స్థాయి పెరుగుతుంది.
ఇది ఒక యిని దాటితే, మీలో మధుమేహం ప్రారంభమవుతుంది. దీర్ఘ శ్వాస, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, మరియు హార్మోన్ల ఉత్పత్తి అస్తవ్యస్తంగా మారడంతో మీలో ఎసిడిటీ, గుండెల్లో మంట మొదలవుతాయి.

5. హృదయనాళ వ్యవస్థ:
ఒత్తిడికి గురైనప్పుడు మీ గుండె కొట్టుకునే వేగం హెచ్చుతుంది. దీని మూలంగా, ఆక్సిజన్ ను అధికంగా మీ కణాలకు సరఫరా చేసే నిమిత్తం, మీ రక్తనాళాలు ద్వారా రక్తం అధికంగా ప్రసరింపబడుతుంది. కాండరాలై మరియు మెదడుకు అధిక ఆక్సిజన్ అవసరం కనుక ఇలా జరుగుతుంది. ఈ క్రమంలో రక్తపాటు పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు.

6. శ్వాస వ్యవస్థ:
ఒత్తిడి హార్మోన్లు శ్వాస వ్యవస్థను అతలాకుతలం చేస్తాయి. శ్వాసించే వేగం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ తో నిండిఉన్న రక్తం మీ శరీరానికి అవసరం. మీరి ఇదివరకే శ్వాస సంబంధిత ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నట్లైతే, అవి మరింత ఉధృతం అవుతాయి.

7. కేంద్ర నాడీ వ్యవస్థ:
ఇది అన్ని వ్యవస్థలకు అధిపతి వంటి వ్యవస్థ. మీ శరీరానికి అనుగుణంగా, ఈ వ్యవస్థ తన ఆజ్ఞల ద్వారా శరీర పనితీరును పర్యవేక్షించవలసి ఉంటుంది. మీరు ఒత్తిడికి లోనైనప్పుడు, మెదడులోని హైపోథలామస్ , ఒత్తిడి హార్మోన్లయినా, కార్టిసోల్ మరియు ఎడ్రినలిన్ లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు శరీరమంతటా వ్యాపించి, రక్తం అధిక ఆక్సిజన్ గ్రహించేటట్టు చేయడం, దానిని రవాణా చేయటం, స్పందనలు త్వరగా కలగడం వంటివి చేస్తుంది.
మీరు ఒత్తిపీ నుండి బయటపడ్డప్పుడు, హైపోథలామస్ తిరిగి శరీరం సాధారణ స్థితికి రావడానికి అవసరమైన సందేశాలను పంపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడికి గురైనప్పుడు, ఈ అవయవాల పనితీరు దారి తప్పి, ప్రాణాంతకంగా మారవచ్చు.
దీర్ఘకాలిక ఒత్తిడి మూలంగా అతిగా తినడం, మద్యపానం, మత్తుపదార్థాల వినియోగం, తగినంత తినకపోవడం మరియు నలుగురితో కలివిడిగా ఉండలేకపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.
ఒత్తిడి మన శరీరానికి ఏ విధమైన నష్టం కలిగిస్తుందో తెలుసుకుని, మనం దాని నుండి బయటపడే ప్రయత్నం చేయడమే కాక, మన చుట్టుపక్కల ఎవరైనా ఈ సమస్యతో బాధ పడుతున్నట్లైతే, వారిని బయటపడేసేందుకు సహకరించాలి. ఆరోగ్యవంతమైన జీవితం మీ హక్కు. ఎవరైనా కానీ, శరీరాన్ని బాధపెట్టుకుంటూ బతకకూడదు.

ఒత్తిడిని కొన్ని తేలికైన మార్గాల ద్వారా జయించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకోండి.
• రోజుకు కనీసం ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయాలి, దీర్ఘశ్వాస తీసుకోవాలి.
• నెమ్మదించి,ఈ క్షణంలో మీ పరిస్థితి అవగాహన చేసుకుని మెలగండి.
• అవసరమన్నప్పుడు, మీ ఆత్మీయులు లేదా వైద్యుని సహాయనికై అర్ధించండి.
• మీ శరీరాన్ని అర్ధం చేసుకుని దాని అవసరాలను కనిపెట్టుకుని ఉండండి.
• మీకు కలిగినడానికి సంతృప్తి చెంది, అందని వాటికై అర్రులు చాచి మీ శరీరాన్ని హింసించకండి.
దేహమే దేవాలయం కనుక ఒత్తిడి నుండి బయటపడి మీ శరీరాన్ని ప్రేమించండి.