For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లవంగాల వల్ల మీ ఆరోగ్యానికి కలిగే 8 అద్భుతమైన ప్రయోజనాలు !

లవంగాల వల్ల మీ ఆరోగ్యానికి కలిగే 8 అద్భుతమైన ప్రయోజనాలు !

|

లవంగము అనే ఒక చెట్టు మొగ్గ, ఒక ప్రత్యేకమైన సుగంధద్రవ్యంగా అన్నిరకాల వంటకాల్లోనూ ఉపయోగించబడుతుంది. తినే వంటకాలు స్పైసీగా

ఉండడంకోసం దీనిని ఉపయోగించినప్పుడు, లవంగం చెట్టు నుండి పూసినా పువ్వును బాగా ఎండబెట్టి, ఆ తర్వాత వంటకాలు రుచికరంగా ఉండటానికి దీనిని ఉపయోగిస్తారు.

8 Amazing Clove Health Benefits

మీరు వండిన వంటలు మరింత మంచి సువాసనను కలిగి ఉండటానికి ఎక్కువగా ఈ లవంగాలను జోడిస్తూ ఉంటారు. ఇది మీ ఆరోగ్యప్రయోజనాలను సంరక్షించే ఒక మంచి పదార్థము. గొంతు నొప్పిని నయం చేయడం దగ్గరనుంచి - సాధారణ జలుబుతో పోరాడుతూ, ఇంకా అనేక ఇతర వైద్యపరమైన ఔషధ గుణాలను ఈ లవంగములు కలిగి ఉన్నది.

ఈ లవంగాలు కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాలలో కొన్నింటిని ఇప్పుడు మనం పరిశీలిద్దాం !

1. అధికమోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంది :-

1. అధికమోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంది :-

ఈ చిన్నపాటి సుగంధభరితమైన మసాలాదినుసులో అనేక పోషకాలు & యాంటీఆక్సిడెంట్లు గొప్పగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ఊహించారా ? మెగ్నీషియం, విటమిన్ K & C, కొద్దిమొత్తంలో లభించే కాల్షియంతోపాటు, మాంగనీస్, విటమిన్ E & ఇతర ఫైబర్లు, మినరల్స్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఈ లవంగాలలో పుష్కలంగా ఉన్నాయి.

మాంగనీస్లో ఉండే ముఖ్యమైన మినరల్స్ - మీ మెదడు పనితీరు సక్రమంగా నిర్వహించడంలోనూ, బలమైన ఎముకలు నిర్మించేందుకు అవసరమవుతుంది. విటమిన్-సి రోగనిరోధక వ్యవస్ధను బలపరుస్తుంది, రక్తమును గడ్డకట్టించడంలో విటమిన్ కె ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇంకేం కావాలి ? ఈ లవంగాలలో కేలరీలు తక్కువ మోతాదులో కూడా లభిస్తున్నాయి !

లవంగాలలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులు అభివృద్ధికి ప్రధాన కారణమైన ఆక్సిడేటివ్ను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ లవంగాలలో 'యూజెనాల్' అని పిలువబడే సమ్మేళనమును కలిగి ఉంటాయి, ఇది శరీరంలో స్వేచ్చగా సంచరిస్తూ శరీర కణాలను నష్టపరిచే రాడికల్స్ను అడ్డుకోవడం ద్వారా సహజ ప్రతిక్షకారిణి వలె పనిచేస్తుంది.

అంతేకాకుండా, ఈ లవంగాలలో ఉండే విటమిన్-సి కూడా యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది, స్వేచ్ఛా రాడికల్స్ను తటస్థీకరిస్తుంది. దీనిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా కలిపి తీసుకోవడం వల్ల ఇతర గొప్ప యాంటీ ఆక్సిడెంట్లను అందించడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది.

2. హానికరమైన బాక్టీరియాను చంపుతుంది :

2. హానికరమైన బాక్టీరియాను చంపుతుంది :

లవంగాలు యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంది. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారమును వంటి రుగ్మతలను కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాల లో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్ష్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉన్నాయి కాబట్టి. మీ నోటి ఆరోగ్యాన్ని సంరక్షించేందుకుగానూ టీ-ట్రీ ఆయిల్తో పాటు ఈ లవంగమును కూడా కలిపి ఉపయోగించడం చాలా మంచిదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది.

3. కాలేయమును సంరక్షిస్తుంది :

3. కాలేయమును సంరక్షిస్తుంది :

లవంగంలో ఉండే యూజెనాల్ అనే సమ్మేళనము మీ కాలేయం ఆరోగ్యాన్ని సంరక్షించేదిగా ఉంటుంది. కాలేయ పనితీరును మెరుగుపరచేటమే కాకుండా, కాలేయ ఆరోగ్య పోషణకు అనుబంధంగా ఉండే మంచి కొవ్వును అందిస్తుంది. తద్వారా కాలేయంలో ఏర్పడే మంటను తగ్గించి, దాన్ని పూర్తి ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది. ఈ లవంగాలలో ఉన్న సుగంధ లక్షణాల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

4. బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది :-

4. బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది :-

లవణాలలో ఉన్న కాంపౌండ్స్ రక్తములో గల చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్న వారి రక్తములో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడే 'నైలిసిసిన్' అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రక్త కణాల నుండి చక్కెరను గ్రహించడంలో కణాల సామర్థ్యాన్ని నైలిసికన్ మెరుగుపరుస్తుంది, ఇలా మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయము చేస్తుంది.

మధుమేహ నియంత్రణకు మీరు పాటించవలసిన ఇంటి చిట్కా ఏమిటంటే, 6 - 8 లవంగాలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి, 15 నిమిషాల వరకు వేడి చేయాలి. ఆ తర్వాత ఇలా మరగ కాచిన నీటిని వడబోసి ప్రతిరోజు అల్పాహారానికి ముందు తాగుతూ ఉండాలి. ఇలా కొన్ని నెలలపాటు చేయటం వల్ల మీ శరీరంలో వచ్చే తేడాను మీరే స్వయంగా గుర్తించగలరు.

5. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :-

5. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :-

లవంగాలలో ఎక్కువగా ఉండే యూజెనాల్ అనే సమ్మేళనము, నడివయస్సులో ఎముకల మెత్తబడటం వంటి సమస్యను దూరం చేస్తూ మీ ఎముకలకు బలాన్ని & గట్టి పడే అవకాశాలను పెంచుతుంది, తద్వారా ఎముకలలో ఏర్పడే పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఎముకలు దృఢంగా అభివృద్ధి చెందడంలో, లవంగాలలో ఉన్న మాంగనీస్ తనవంతు పాత్రను పోషిస్తుంది, అలానే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకాహారిగా కూడా ఉంది. ఎముక ఆరోగ్యమును మెరుగుపరచడానికి ఒక టీస్పూన్ మోతాదులో ఉన్న లవంగాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి.

6. పెయిన్కిల్లర్గా పని చేస్తుంది :

6. పెయిన్కిల్లర్గా పని చేస్తుంది :

కీళ్ళనొప్పుల ఉపశమనానికి లవంగ-నూనె బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ లవంగ-నూనె అందుబాటులో లేకపోతే, లవంగాలను మెత్తని పేస్టులాగా నూరి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మీకు సత్వరమే ఉపశమనమును కలగజేస్తుంది. పురాతన కాలం నుంచి కీళ్లనొప్పుల చికిత్సకు ఈ సహజసిద్ధమైన చికిత్సా విధానాన్నే అందరూ పాటిస్తున్నారు. ఒకవేళ మీరు పంటినొప్పితో బాధపడుతున్నట్లయితే, దంత వైద్యుడిని సంప్రదించే ముందు కొన్ని లవంగం ముక్కలను నమలటం వల్ల పంటినొప్పి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

7. యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది :

7. యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది :

లవంగాల పేస్ట్ను తయారు చేసి, చర్మంపై ఏర్పడే మంటలకు (లేదా) కాలిన గాయాలకు వర్తించండి. ఈ లవంగాల పేస్టును కూడా తెగిన చర్మంపై కూడా వర్తించవచ్చు. ఆయుర్వేదిక్ ఔషధశాస్త్ర ప్రకారం, ఈ లవంగాల పేస్టులో యాంటీ-ఫంగల్ & యాంటీ-గ్రిమిసిడల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది బ్యాక్టీరియాను చంపి, గాయం నుంచి ఇన్ఫెక్షన్ను వ్యాపించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

8. స్టమక్ అల్సర్ను తగ్గిస్తుంది :

8. స్టమక్ అల్సర్ను తగ్గిస్తుంది :

ఆంత్రమూలం, కడుపు (లేదా) ఆహారనాళంకు ఆనుకుని ఉన్న పొరలో ఏర్పడిన బాధాకరమైన పుళ్లను అనగా, స్టమక్ అల్సర్ను (లేదా) పొప్టిక్ అల్సర్ను తగ్గించడంలో లవంగాలు బాగా సహాయపడతాయి. కడుపులో అంతర్లీనంగా వుండే రక్షితపొర వివిధ కారణాలవల్ల దెబ్బతినడం వల్ల అల్సర్లు ఏర్పడుతాయి. లవంగ-నూనెను వినియోగించడం వల్ల మీ జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ శ్లేష్మ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది జీర్ణ ఆమ్లాల ద్వారా కడుపును సంరక్షించే రక్షితపొర దెబ్బతినకుండా కాపాడేందుకు ఇది ఒక అవరోధంగా పనిచేస్తుంది.

English summary

8 Amazing Health Benefits Of Clove

Clove has several other benefits than just adding taste and aroma to the dishes. Clove can cure sore throat, fight common cold, etc. Since it is high in antioxidants, it acts as a powerhouse of nutrients. Cloves have an abundance of nutrients, including Manganese, Vitamin K, Vitamin C, apart from small amounts of Calcium, Magnesium, Vitamin E and other fibres.
Story first published:Saturday, May 26, 2018, 12:10 [IST]
Desktop Bottom Promotion