పురుషులలో కామోద్దీపనలకు ప్రత్యేకించిన 8 రకాల ఆహారపదార్ధాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రాచీన కాలం నుండి మానవుడు వంద్యత్వ సంబంధ సమస్యలు రాకుండా ఉండడం కోసం అనేక రకాల మార్గాలను అన్వేషిస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యమైనవి కొన్ని ప్రత్యేకించిన విర్యావర్తకమైన ఆహారాలను తీసుకోవడమే.

ఈ ఆహారపదార్ధాలు పురుషులలో, స్త్రీలలో కామోద్దీపనలు పెంచడమే కాకుండా వంద్యత్వ సమస్యలను సమూలంగా దూరం చేసే దిశగా సహాయం చేస్తాయి. ముఖ్యంగా వయసు ప్రభావం వలన వంద్యత్వ సమస్యలు సర్వసాధారణంగా ఉంటాయి, అలాంటి వారికి చక్కటి పరిష్కారాలుగా ఈ ఆహారపదార్ధాలు ఉండడం ఆహ్వానించదగ్గ విషయం.

10 Aphrodisiac Foods For Men

ఈ విర్యావర్తక ఆహారపదార్ధాలను రెండు రకాలుగా విభజించారు. కొన్ని కామోద్దీపనలకై పనిచేస్తే మరికొన్ని టెస్టోస్టీరాన్ హార్మోన్ పెరుగుదలకై సహాయం చేస్తాయి.

ఈ విర్యావర్తక ఆహారాలు వృషణాలకు సరైన రక్త సరఫరాను అందిస్తూ, కండరాల పటుత్వానికి ఎంతగానో సహాయం చేస్తుంది.

బాదం :

బాదం :

కామోద్దీపనలకు పెంచడానికి అత్యంత దోహదంచేసే బాదం , సంతానోత్పత్తికి ఒక వరంలా ఉంది. ఈ బాదం పప్పులలో అత్యధిక స్థాయిలో ఉండే ఒమేగా ౩ క్రొవ్వు పదార్ధాలు, పునరుత్పత్తికి ఎంతగానో సహాయం చేస్తాయి. మరియు పురుషులలో టెస్టోస్టీరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు పెరగడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. మరియు అనేక రకాల అలర్జీలను దూరం చేస్తుంది.

ఎలా వాడాలి: బాదం నూనె తో మసాజ్ చేయవచ్చు, మరియు ప్రతిరోజూ నానబెట్టి తొక్కుతీసిన బాదం కనీసం 7 తినేలా ఉండాలి.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

సాధారణంగా వంటలలో రుచికి వాడే ఈ సుగంధ ద్రవ్యం అనేక సమస్యలకు పరిష్కారంగా చెప్పబడుతుంది. ప్రతిరోజూ ఏదో ఒకరూపoలో దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా, అనేకములైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించడమే కాకుండా, లైంగిక సామర్ధ్యాన్ని పెంచే దిశగా దీని పనితనం ఉంటుంది. ఇందులో అనేక రకాల రోగ నిరోధక తత్వాలు ఉండడంతో పాటు, రక్తంలోని చక్కర నిల్వలను సమతుల్యం చేయడంలో సహాయం చేస్తుంది.

ఎలా తీసుకోవాలి: వంటలలో ఎటుతిరిగీ వాడుతారు, అయినా గ్రీన్-టీ, సోయా పాలు, బాదం పాలలో తేనెతో సహా తీసుకోవచ్చు.

తేనె :

తేనె :

తేనె లైంగిక సామర్ధ్యం పెంచడంలో అత్యుత్తమంగా పని చేస్తుంది. మరియు శరీర జీవక్రియలను పెంచడంలో, ఊబకాయం తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. మరియు వృషణాలకు రక్త సరఫరా అందించడంలో, రక్తంలో గ్లూకోస్ నిల్వలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. పురుషులలో టెస్టోస్టీరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను పెంచడంలో తేనె అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది , తద్వారా లైంగిక ఆరోగ్యానికి విర్యావర్తక ఆహారంగా చెప్పబడుతున్నది.

ఎలా తీసుకోవాలి: పాలు , గ్రీన్ టీ వంటి వాటిలోనే కాకుండా రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు 2 స్పూన్ల తేనెను నేరుగా తీసుకోవడం ద్వారా అద్బుత ఫలితాలను పొందవచ్చు. లేదా రోజూ పరగడుపున నిమ్మ రసంతో కలిపి తీస్కోవడం కూడా అన్ని విధాలా మేలు.

అల్లం:

అల్లం:

అల్లంలో శరీరాన్ని విశ్రాంత పరచే తత్వాలు అధికంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా మాత్రమే కాకుండా , లైంగిక కోరికలను సైతం పెంచే గుణాలను కలిగి ఉంటుంది. శరీరంలోని విష పదార్ధాలను తొలగించుటలో, రక్త ప్రసరణను పెంచడంలో అల్లం ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. రోజూవారీ ఆహార ప్రణాళికలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం ద్వారా వంధ్యత్వ సమస్యలను దరికి చేరనివ్వకుండా చూస్తుంది.

అల్లాన్ని నేరుగా తీసుకోలేని పక్షంలో, నిమ్మరసం, టీ, గ్రీన్ టీ, సలాడ్లలో, లేదా ఇతరములైన వంటలలో చేర్చుకోవడం ద్వారా తీసుకోవచ్చు.

దానిమ్మ :

దానిమ్మ :

క్వీన్ మార్గెరెట్ యూనివర్సిటీ వారి అధ్యయనాల ప్రకారం, దానిమ్మ పండు సహజ సిద్దమైన కామోద్దీపన లక్షణాలు కలిగిన పండుగా ఉన్నది. ఇది టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయిలను పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. తద్వారా లైంగిక సామర్ధ్య పెరుగుదలకు తోడ్పాటునిస్తుంది. రోజూవారీ ఆహార ప్రణాళికలలో భాగంగా తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి : సలాడ్ ద్వారా కానీ, నేరుగా కానీ, జ్యూస్ ద్వారా కానీ తీసుకోవచ్చు. జీవక్రియలు చక్కగా పని చేయాలి అంటే జ్యూస్ గా కన్నా నేరుగా తీసుకోవడమే మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో లో పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో, ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. మరియు లైంగిక సామర్ధ్యం తగ్గకుండా చూసుకోవడంలో సహాయం చేస్తుంది. స్వీట్ పొటాటోలలో పొటాషియo నిల్వలే కాకుండా బీటా కెరోటిన్, విటమిన్ - ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇవి పునరుత్పక్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో సహాయం చేస్తాయి.

ఎలా తీసుకోవచ్చు : ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. లేదా ఉడకబెట్టిన స్వీట్ పొటాటో తీసుకోవడం కూడా మంచిదే.

కొకోవా లేదా చాక్లెట్ :

కొకోవా లేదా చాక్లెట్ :

చాక్లెట్ మగవారికి ఉత్తమమైన ఆహార పదార్ధంగా ఉన్నది. ఇందులో రెడ్ వైన్, గ్రీన్ టీ కన్నా అత్యధిక మోతాదులో రోగ నిరోధక తత్వాలు కొలువు తీరి ఉన్నాయి. చాక్లెట్ లో ఫినైలెత్లమిన్ అనే రసాయనం లైంగిక పటుత్వానికి దోహదం చేసే గుణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజుకొక చాకొలేట్ ముక్క తీసుకోవడం స్త్రీ పురుషులిద్దరికీ మంచిది.

ఎలా తీసుకోవాలి : రోజుకొక చాక్లెట్ తీసుకోవడం మంచిదే లేనిచో కనీసం ఒక ముక్క తీసుకోవడం మంచిది. చాక్లెట్ కు నోటిలోని బాక్టీరియా పెంచే తత్వాలు అధికంగా ఉంటాయి, కాబట్టి తిన్న వెంటనే నోరు కడగడం అన్నిటా శ్రేష్ఠం. లేనిచో నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు లేకపోలేదు.

పుచ్చకాయ :

పుచ్చకాయ :

పుచ్చకాయ ఒకరకంగా వయాగ్రా లా పని చేస్తుంది అని నిపుణులు చెప్తుంటారు. టెక్సాస్ చెందినా పండ్లు మరియు కాయ గూరల పరిశోధనా సంస్థ వారు తెలిపిన కథనం ప్రకారం, సంబంధాలలో లైoగిక సామర్ధ్యం తగ్గకుండా చూడడంలో పుచ్చకాయ ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ పండులో ఉండే అమినో ఆమ్లాలు రక్త సరఫరా సరిగ్గా జరగడం లో ఎంతగానో సహాయం చేస్తాయి. ఇందులో ఉండే నీటి నిల్వలు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూడడంలో సహాయం చేయడమే కాకుండా, ఒత్తిడిని తగ్గించి అలసట లేకుండా చేస్తుంది. తద్వారా లైంగిక సామర్ధ్యం పెంచడంలో పుచ్చకాయ ఉత్తమమైన ఆహారంగా చెప్పబడుతున్నది.

ఇవి కాలానుగుణంగా పండే పండ్లు కాబట్టి, దొరికే సమయాల్లో ఖచ్చితంగా ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవడం అన్నిటా మేలు. నేరుగా కాని, జ్యూస్ గా కానీ, సలాడ్ల రూపంలో కాని తీసుకోవచ్చు.

English summary

8 Aphrodisiac Foods For Men

There are certain foods that stimulate sexual desire in men. Read here to know the aphrodisiac foods for men.
Story first published: Thursday, April 19, 2018, 19:00 [IST]