For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీరు పాటించే ఈ 8 పరిశుభ్రత అలవాట్లు, మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనవి !

  |

  "దైవత్వం తర్వాత పరిశుభ్రత" అనేది ఉందని గతంలో చెప్పబడిన ఈ సూక్తి చాలా మంచి భావనను మనందరిలో కలిగిస్తుంది, ఎందుకంటే ఒక వ్యక్తి తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవాలంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం!

  మన చుట్టూ ఉన్న పరిసరాలనే కాక, మనము వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రతను కలిగి ఉండాల్సిన ప్రయత్నం చెయ్యటానికి అందరూ తగిన ప్రాముఖ్యతను చూపాలి.

  8 Common Hygiene Habits Which Can Be Dangerous To Your Health!

  పరిశుభ్రత చిట్కాలు :

  దుమ్ము, ధూళిని బాగా కలిగి వున్న ఆఫీసులో పనిచేయడం మీకు ఎలా అనిపిస్తోంది ? అలాంటి పర్యావరణంలో పనిచేయడం వల్ల మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని వేరేగా చెప్పక్కర్లేదు.

  అదేవిధంగా, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి మీరు కృషి చేయనప్పుడు, అనగా మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, అది కూడా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

  ఉదాహరణకు, మీరు స్నానం చేయకుండా శరీరాన్ని రోజూ కడగకుండా ఉండటం వల్ల చర్మంపై అనేక అంటువ్యాధులకు, చర్మ సమస్యలకు కారణమైన శిలీంధ్ర పెరుగుదలకు ఇది దారితీస్తుంది.

  వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

  కాబట్టి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడమనేది చాలా ముఖ్యం, అయితే, ఈ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని మనం తరచూ అనుసరించవచ్చు, ఇది మనకు ఏమాత్రం హానికరం కాదు!

  కాబట్టి, మనము తరచూ సాధారణంగా పాటించే కొన్ని పరిశుభ్రత అలవాట్లు మన ఆరోగ్యానికి హానికరమైనవిగా మారేవాటి గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం !

  1. ఇయర్ బడ్స్ను ఉపయోగించడం :

  1. ఇయర్ బడ్స్ను ఉపయోగించడం :

  మనకు తెలిసిన దాని ప్రకారం, చెవులో దాని అంతర్భాగంలో పర్యావరణం ద్వారా సేకరించిన దుమ్మును & మలినాలను వడకట్టడంలో భాగంగా వాక్స్ అనబడే మైనము వంటి పదార్థాన్ని తయారుచేస్తుంది. మనలో చాలామంది ఈ రకమైన మైనపు ముద్దను తొలగించడానికి గానూ ఇయర్ బడ్స్ను ఉపయోగిస్తాము. అయితే, ఇది ఏమాత్రం సురక్షితమైనది కాదు. ఇయర్ బడ్స్ను ఇలా ఉపయోగించడం వల్ల చెవిలోపల భాగంలో గాయాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి బదులు నీటితో మీ చెవులను కడుక్కోవడం మంచి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.

  2. బబుల్ బాత్ :

  2. బబుల్ బాత్ :

  మీరు సువాసన భరితమైన బుడగలను కలిగిన స్నానపు తొట్టెలో మీ శరీరం నాని పోయేలా స్నానం చేయడం అనేది ఒక గొప్ప ఆలోచనలా మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ చర్మానికి హాని కలిగించవచ్చు, భవిష్యత్తులో ఎదురయ్యే స్కిన్ అలర్జీలకు, చర్మం పొడిగా మారడం వంటి చర్మ సమస్యలకు కారణం కాగలదు. ఎందుకంటే మీరు స్నానం చేసే ఈ తొట్టెలో బుడగలను ఉత్పత్తి చేసే ద్రవాలు విషపూరితమైన రసాయనాలను కలిగి ఉంటాయి.

  3. డచింగ్ :

  3. డచింగ్ :

  లిక్విడ్స్ను (లేదా) స్ప్రేలను ఉపయోగించి మహిళలు తమ జననాంగాలను శుభ్రపరచే ఒక అభ్యాసాన్ని "డచింగ్" అని అంటారు. గైనకాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం, ఈ లిక్విడ్స్ను & స్ప్రేల్లో ఉండే రసాయనాలు యోనిలో ఉండే సున్నితమైన కణజాలాలకు చాలా హానికరంగా మారి, ఈ అవయవం యొక్క సహజమైన pH స్థాయిని తగ్గిస్తాయి, అలాగే ఆ ప్రాంతంలో దురదలు, మంటలు మొదలైన వంటి సమస్యలు ఏర్పడటానికి కారణమవుతాయి. కాబట్టి ఈ రకమైన అలవాటుకు దూరంగా ఉండటం చాలా మంచిది.

  4. సాన్టిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం :

  4. సాన్టిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం :

  మనలో చాలా మంది ఈ రోజుల్లో, పర్యావరణం నుంచి సంక్రమించబడిన జెర్మ్స్ను వదిలించుకోవడానికి, అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మన చేతులను శుభ్రపరచుకోవడానికి సాన్టిటైజర్ల (లిక్విడ్ హ్యాండ్ వాష్) ను ఉపయోగించే అలవాటును కలిగి ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యకరమైనది అయినప్పటికీ, ఈ అలవాటు అతిగా పాటించడంవల్ల బాక్టీరియా నిరోధకతలో అసమర్థతవంతమైన పనితనాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, ఈ ద్రవ పదార్ధాలలో ఉన్న రసాయనాలు మన నోటి నుంచి శరీరంలోనికి ప్రవేశించినప్పుడు - మన శరీరంలో హార్మోన్ల అసమానతలను కలిగించడానికి దారితీస్తుంది.

  5. హ్యాండ్ డ్రైయర్స్ను ఉపయోగించడం :

  5. హ్యాండ్ డ్రైయర్స్ను ఉపయోగించడం :

  మనము పనిచేసిన ప్రదేశాలలో, రెస్టారెంట్లలో చేతులు కడుక్కున్న తర్వాత, చేతులను పొడిగా మార్చకోడానికి హ్యాండ్ డ్రైయర్స్ను ఉపయోగిస్తాము. ఈ రకమైన అలవాటు హానికరమైనది ఎందుకంటే, కొన్ని అధ్యయనాలు సూచించిన దాని ప్రకారం; మీ చేతులను ఈ హ్యాండ్ డ్రైయర్స్తో శుభ్రం చేయడం వల్ల పూర్తిస్థాయిలో శుభ్రపరుస్తుంది కానీ బ్యాక్టీరియాను మాత్రం కాదు. ఒక వ్యక్తి చేతిలో ఉన్న బ్యాక్టీరియా గాలిలోకి వ్యాప్తి చెంది, అది మొత్తం అందరినీ ప్రభావితం చేస్తుంది.

  6. హాట్ షవర్స్ :

  6. హాట్ షవర్స్ :

  వేడిగా పారే నీటితో ఒక షవర్ క్రింద నిలబడి, స్నానం చేయడం చాలా మంచి అనుభూతిని కలిగించవచ్చు, అలా అక్కడ మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల మీరు చాలా పరిశుభ్రవంతులుగా అయ్యారని భావిస్తారు. ఏదేమైనప్పటికీ, ఈ రకమైన అలవాటు మీ చర్మం నుంచి సహజసిద్ధంగా ఉత్పత్తి చేయబడే శ్లేష్మమును తొలగించడం వల్ల పొడి చర్మం, దద్దుర్లు, అసమాన చర్మపు ప్యాచ్ల వంటివి కారణం కావచ్చు, అందువల్ల ఈ అలవాటు మీ చర్మానికి చాలా హానికరంగా ఉంటుంది. కాబట్టి, మీరు తక్కువ వ్యవధిలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.

  7. చేతుల్లోకి తుమ్మటం :

  7. చేతుల్లోకి తుమ్మటం :

  మీరు బహిరంగ ప్రదేశాల్లో పర్యటించినప్పుడు ఆకస్మికంగా వచ్చే తుమ్మును అడ్డుకోవడం కోసం మీ నోటిని & ముక్కును మీ చేతులతో అడ్డుకోవడాన్ని మర్యాదగా భావిస్తారు. అయినప్పటికీ, మీరు తక్షణమే కరెన్సీ నోట్లను, ఆహారాన్ని (లేదా) ఇతరులతో కరచాలనం చేసేటప్పుడు మీ చేతులను శుభ్రం చేయకుండా ఉండటం వల్ల అది బ్యాక్టీరియా విస్తరించడానికి కారణం కావచ్చు. కాబట్టి, తుమ్ములను అడ్డుకునే సమయంలో చేతిరుమాలును ఎల్లప్పుడూ వాడటం చాలా మంచిది.

  8. రోజూ తలస్నానం చేయడం :

  8. రోజూ తలస్నానం చేయడం :

  మనలో చాలామంది, వేసవికాలంలో (లేదా) వ్యాయామం చేసే ప్రతిరోజూ తలస్నానం చేయడం చాలా మంచిదని భావిస్తారు. కానీ అలా చేయడం వల్ల మాడుపై ఉత్పత్తి కాబడి శ్లేష్మము పూర్తిగా నివారించబడి, మీ తలచర్మమును పొడిగా మార్చి నిర్జీవంగా చేస్తుంది. ఇది కూడా మీ జుట్టు పతనానికి కారణం కావచ్చు. కాబట్టి, ఒక వారంలో 3-4 సార్లు తలస్నానం చేయడం మంచిది.

  English summary

  8 Common Hygiene Habits Which Can Be Dangerous To Your Health!

  8 Common Hygiene Habits Which Can Be Dangerous To Your Health!, It is said that, "Cleanliness is next to Godliness" and this age-old quote makes a lot of sense, as good hygiene is extremely important if a person wants to maintain good health! Be it personal hygiene or living in hygienic surroundings, one needs to mak
  Story first published: Tuesday, April 24, 2018, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more