For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీటిని ఎక్కువగా తాగాలనుకునేవారు ఈ 8 ముఖ్య విషయాలను గుర్తుపెట్టుకోవాలి !

నీటిని ఎక్కువగా తాగాలనుకునేవారు ఈ 8 ముఖ్య విషయాలను గుర్తుపెట్టుకోవాలి !

|

నీరు అనేది రుచి, వాసన లేని పారదర్శకమైన ద్రవము, ఇది ప్రాణుల జీవితానికి చాలా అవసరమైనది. అందువల్ల దీనిని సార్వత్రిక ద్రావణమని అంటారు. జీవిత మనుగడకు నీరు చాలా ముఖ్యమైనది. ఈ అద్భుతం ద్రావణం లేకుండా ఒక ప్రాణి కేవలం కొన్ని రోజులు మాత్రమే మనుగడను సాగించగలదు. ఎందుకంటే మన శరీరం బరువులో 60% -70% నీరునే కలిగి ఉంటుంది.

శరీరంలోని అన్ని కణాలకు నీరు చాలా ముఖ్యము; శరీర ముఖ్యమైన భాగాలకు పోషకాల రవాణా, వ్యర్థాల తొలగింపుకు, ఎంజైముల పనితీరుకు, శరీర ఉష్ణోగ్రతకు, శ్వాసక్రియ వంటి మొదలైన అనేక జీవక్రియ ప్రక్రియలకు నీరు అనేది చాలా అవసరము. చెమట రూపంలో, శ్వాసక్రియ మరియు వ్యర్థాల తొలగింపు వంటి ఇతర మార్గాల ద్వారా మన శరీరంలో ఉన్న నీటిని కోల్పోతాము. శరీర యంత్రాంగాలను సమకాలీకరించడానికి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ రీహైడ్రేట్గా ఉంచుకోవాలి.

8 Important Things To Know About Drinking More Water

మీరు మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను చదివేటప్పుడు, మీరు మరింత ఎక్కువగా నీరును తాగేలా చేస్తుంది. ఇది నిజంగానే ఒక తెలివైన విషయం, కానీ మీరు ఈ పద్ధతిని ఫాలో అయ్యే ముందు దాని గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి.

మీరు ఎక్కువగా నీటిని తీసుకోవాలన్న ఆలోచన ను కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ క్రింది విషయాలను గుర్తుపెట్టుకోవాలి : అవి,

 1. చక్కెర పానీయాలను క్రమక్రమంగా తగ్గిస్తూ, నీటి వినియోగాన్ని పెంచండి :-

1. చక్కెర పానీయాలను క్రమక్రమంగా తగ్గిస్తూ, నీటి వినియోగాన్ని పెంచండి :-

మీరు ఆరోగ్యకరమైన జీవన శైలికి మారాలనుకుంటే చక్కెర పానీయాలను పూర్తిగా మానుకోవటమనేది మంచి ఆలోచన అని మీరు అనుకోవచ్చు, అవును చెక్కెర పానీయాలను తగ్గించుకోవటం మంచిది కానీ అకస్మాత్తుగా అలా చేయడం వల్ల మీ శరీరం గందరగోళానికి లోనయ్యి, చెడు ప్రభావాలకు గురికాగలదు. కాబట్టి మీరు సోడా వినియోగాల నుండి నెమ్మదిగా నీటి వినియోగానికి మారుతూ ఉండాలి. ఇలా మీరు ఇచ్చిపుచ్చుకోవటాన్ని నెమ్మదిగా ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు. నీటిలో పండ్లరసాలను జోడించి తీసుకోవడం ద్వారా మీరు నెమ్మదిగా ఈ మార్పును ప్రారంభించవచ్చు.

2. మంచి నీటి పరిమాణాన్ని కలిగి ఉన్న ఆహారాలు తినండి :-

2. మంచి నీటి పరిమాణాన్ని కలిగి ఉన్న ఆహారాలు తినండి :-

నీటి వినియోగమంటే, ఒక గ్లాసు నీటిని తీసుకుని త్రాగటమనేది ఒక్కటే కాదు. అధిక నీటిని కలిగి ఉండే పుచ్చకాయలను & కర్బూజా పండ్ల వంటి వాటిని వినియోగించవచ్చు. ఇవి కూడా మీ రోజువారీ లెక్కలో మీరు తీసుకునే నీటిని లెక్కించబడుతుంది. మీరు తీసుకునే హెర్బల్ టీ కూడా అందులో లెక్కించబడుతుంది.

3. రోజు మొత్తంలో మీరు నీరు తాగడానికి సరైన సమయమును ఏర్పాటు చేసుకోండి :-

3. రోజు మొత్తంలో మీరు నీరు తాగడానికి సరైన సమయమును ఏర్పాటు చేసుకోండి :-

మీరు దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు తాగాలనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది, కానీ కొన్ని అదనపు ప్రయోజనాల కోసం మీరు వాటిని నివారించే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఉంటాయి. మీరు ఉదయాన్నే మేల్కొనేటప్పుడు, స్నానం చేసే ముందు, భోజనం చేసే ముందు, అలానే నిద్రించే ముందు వంటి కొన్ని నిర్దిష్టమైన సమయాలలో మంచినీళ్లను ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే శరీర బరువు కోల్పోయేందుకు ప్రయత్నించేవారు తక్కువ కేలరీలను తీసుకునేలా చేయటంలో సహాయపడుతుంది.

4. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీటిని తాగడం ప్రారంభించండి:

4. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీటిని తాగడం ప్రారంభించండి:

మీరు ఎక్కువ స్థాయిలో నీటిని తాగడం ప్రారంభించినట్లయితే, నెమ్మదినెమ్మదిగా ప్రారంభించడానికి చాలా ఉత్తమం. మిమ్మల్ని మీరు నీటితో పూర్తిగా నింపుకోవటాన్ని మొదలుపెట్టినట్లయితే అకారణంగా నీరుని తాగాలన్న కోరిక మీలో పెరుగుతుంది, అలా మీరు తరచుగా నీరుని తాగడానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు నెమ్మదినెమ్మదిగా నీటి వినియోగాన్ని పెంచుకోవాలి.

5. ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని మానుకోండి:

5. ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని మానుకోండి:

ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని మానుకోవడం వల్ల కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా మీ శరీరానికి కూడా చాలా మంచిది. ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు దాని యొక్క మన్నికను & రంగు వంటి అనేక ఇతర కారకాలను కలిగి ఉంటాయి. ఈ రసాయనాలు భవిష్యత్తులో మీ మూత్రపిండాలపై తీవ్ర దుష్ప్రభావాలను కలుగచేయగలవు. BPA రహిత బాటిల్సు కూడా ఇదే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. చల్లని & వేడినీళ్లను నిల్వచేయడానికి స్టీల్ బాటిల్స్ అత్యుత్తమంగా ఉపయోగపడతాయి.

6. నేరుగా నీటిని తీసుకోవడానికి బదులుగా, కొన్ని ఫ్లవర్స్ను ఉపయోగించండి :

6. నేరుగా నీటిని తీసుకోవడానికి బదులుగా, కొన్ని ఫ్లవర్స్ను ఉపయోగించండి :

మీరు ఎక్కువ స్థాయిలో నీటిని తాగడాన్ని ప్రారంభించినట్లయితే, ఇది వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న లెమోనేడ్ (లేదా) ఫ్రూట్ పంచ్ మిక్సింగ్ వంటి ఫ్లవర్స్ను ఉపయోగించడం వల్ల ఇది మీకు ఎక్కువ నీటిని తీసుకోవడానికి సహాయపడగలవు. అలా మీరు త్రాగే నీళ్లకు మంచి ముడి చక్కెరను జోడించటం మంచిదే కానీ, మీరు సాధారణమైన నీరు తాగటమే ఉత్తమమని గుర్తుంచుకోండి.

7. తాజా పండ్లు & కూరగాయలు అదనపు రుచి కోసం ఉత్తమమైనవి :-

7. తాజా పండ్లు & కూరగాయలు అదనపు రుచి కోసం ఉత్తమమైనవి :-

మీరు తాగే నీరు రుచిగా ఉండాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తే, మీరు పండ్లు & కూరగాయలను ఎందుకు ఉపయోగించకూడదు ? మీరు చేయాల్సిందల్లా, ఎంపిక చేసిన తాజా పండ్లు & కూరగాయలను చిన్న ముక్కలుగా చేసుకొని, వాటిని ఒక బాటిల్లోకి తీసుకొని ఆ బాటిల్ను పూర్తిగా నీటితో నింపండి. ఆ మిశ్రమాన్ని కొన్ని గంటల వరకు అలాగే ఉంచిన తరువాత, తాగడానికి సిద్ధంగా ఉంటుంది.

8. ఎక్కువ శాతంలో హైడ్రేషన్ను కలిగి ఉండటం వల్ల మీ శరీరం నుంచి పోషకాలు బయటకుపోతాయి :-

8. ఎక్కువ శాతంలో హైడ్రేషన్ను కలిగి ఉండటం వల్ల మీ శరీరం నుంచి పోషకాలు బయటకుపోతాయి :-

అవును ఇది నిజమే, మీరు ఎక్కువగా నీరును త్రాగటం వల్ల ఈ పరిస్థితి కలుగుతుంది. కొన్నిసార్లు మన శరీర పనితీరు సాఫీగా కొనసాగేందుకు కేవలం 2 లీటర్ల నీరు మాత్రమే అవసరమవుతుంది కానీ, మనము 4 - 5 లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో అతిముఖ్యమైన ఖనిజాలను, విటమిన్లను బయటకు పంపివేస్తుంది. మనము అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని వినియోగించడం వల్ల - నీటిలో సులభంగా కరిగిపోయే విటమిన్లు B1, B2, B3, B6, B12 & విటమిన్ C వంటి వాటిని మానవ శరీరం నుంచి బయటకు పంపివేస్తాయి.

English summary

8 Important Things To Know About Drinking More Water

Water is the tasteless, odourless, transparent liquid that is essential for life. It is called the universal solvent. Water is critical for the proliferation of life. Without this miracle liquid a living being could only survive for a few days. This is because water forms about 60%-70% of our body weight. R
Story first published:Friday, June 22, 2018, 6:43 [IST]
Desktop Bottom Promotion