For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలియని ఉసిరితో కూడిన 9 దుష్ప్రభావాలు ఇవే?

|

ఉసిరి వలన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయా? వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆయుర్వేదం నుండి గృహవైద్యం వరకు గొప్ప ఆరోగ్యప్రదాయినిగా ఉండే ఉసిరి వలన కూడా దుష్ప్రభావాలు ఉన్నాయంటే కూసింత ఆలోచన రావడం సహజం.

భారతీయ గూస్బెర్రీగా లేదా ఆమ్లాగా పేరుకలిగిన ఉసిరి అన్ని రకాల ఆయుర్వేద ఔషదాలలో వాడబడుతుంది. ముఖ్యంగా మధుమేహం, జుట్టునష్టం మరియు అజీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం ఇచ్చేదిలా అధిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది కూడా. ఎండబెట్టిన ఉసిరి లేదా ఉసిరిపొడి, మరియు తాజా ఉసిరిని ఔషధ ప్రయోజనాల దృష్ట్యా వినియోగిస్తారు. నిజానికి ఉసిరిచెట్టులోని అన్నిభాగాలలో వాటివాటి ప్రయోజనాలు దాగున్నాయి. ఉసిరికాయలు, పువ్వులు, విత్తనాలు, ఆకులు, వేర్లు మరియు బెరడుతో సహా చెట్టు యొక్క అన్నిభాగాలను ఔషద మూలికలవలె వినియోగిస్తారు. ఉసిరితో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మితిమీరిన వినియోగం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని చెప్పబడింది.

ఆయుర్వేద శాస్త్రం మరియు పరిశోధనల ప్రకారం, తక్కువ హీమోగ్లోబిన్ స్థాయిలు ఉన్న వ్యక్తులు, లేదా ప్రతిస్కంధక ఔషధాల కారణంగా ప్రభావితం అయిన వ్యక్తులకు ఉసిరి సురక్షితం కాకపోవచ్చు.

ఎటువంటి ప్రతికూల విషప్రభావాలను కలిగి ఉన్నట్లుగా ఏ అధ్యయనాలు కూడా పూర్తిస్తాయి నివేదికలు ఇవ్వనప్పటికీ, ఉసిరిని అధికంగా తీసుకోవడం మూలంగా కొన్ని రకాల మైల్డ్ రియాక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయని వైద్యులు ధృవీకరిస్తున్నారు. ఏదో ఒకరోజు పూర్తిస్థాయి నివేదికలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఉసిరి కారణంగా ఎటువంటి దుష్ప్రభావాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయో క్రింది విభాగంలో చూడండి.

1.అధిక రక్తస్రావం

1.అధిక రక్తస్రావం

ఉసిరి, రక్తనాళాల యొక్క స్థితిస్థాపకతను పెంచే విటమిన్-సి లో అధికంగా ఉంటుంది. తద్వారా రక్తనాళాలను మృదువుగా మరియు విస్తారంగా విచ్చుకునేలా చేసి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది క్రమంగా రక్తపోటును సైతం తగ్గించగలదు. కానీ, మరో వైపు, మీరు రక్తస్రావం సంబంధిత అనారోగ్యం కలిగి ఉన్న ఎడల, లేదా మీరు ప్రతిస్కంధక ఔషధాల దుష్ప్రభావాలను కలిగి ఉంటే మాత్రం, మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఉసిరి వంటి కొన్ని పదార్ధాలను అధికమొత్తంలో తీసుకోడం తగ్గించవలసి ఉంటుంది.

పరిశోధనల ప్రకారం ఉసిరి వాడకం, రక్తంలో 36శాతం ప్లేట్లెట్ల సంఖ్యను తగ్గిస్తుంది. మరియు ఇబ్యుప్రొఫెన్ , హెపారిన్ మరియు ఆస్పిరిన్ వంటి ఇతర ప్రతిస్కందక ఔషదాల రియాక్షన్స్ పెంచుతాయి. క్రమంగా రక్తస్రావం కూడా పెరుగుతుంది.

2.కాలేయం దెబ్బతింటుంది

2.కాలేయం దెబ్బతింటుంది

ఉసిరి అనామ్లజనకాలకు అద్భుతమైన మూలంగా ఉంటుంది. మరియు దాని హెపాటోప్రొటెక్టివ్ కార్యకలాపాలు కాలేయ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఏ ఆయుర్వేద సూత్రీకరణను అనుసరిస్తున్నా, ఉసిరిని ఒక మూలవస్తువుగా అందులో ఉపయోగిస్తున్న ఎడల, సీరం గ్లుటామిక్ పెరూవిక్ ట్రాన్సామినస్(SGPT) అని పిలువబడే కాలేయ సంబంధిత ఎంజైమ్ మోతాదులో పెరిగిన స్థాయిల కారణంగా కాలేయ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

అయినప్పటికీ, ఉసిరి మాత్రమే, కాలేయాన్ని దెబ్బతీస్తుంది అంటే పొరపాటే. అల్లం, టినోస్పోరా కార్డిఫోలియా, మరియు ఇండియన్ ఫ్రాంకిన్సెన్సేమేతో కలిపి తీసుకున్న ఎడల కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కాలేయ పనితీరు మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.

3.హైపర్ అసిడిటీ

3.హైపర్ అసిడిటీ

ఉసిరిలోని విటమిన్-సి నిక్షేపాలు శరీరంలో ఆమ్లతత్వాలు పెరగడానికి కారణంగా ఉంటుంది. నిర్విషీకరణ కోసం ఖాళీకడుపుతో ఉసిరిని తీసుకునే వారు, తరచూ ఆమ్లప్రభావాలకు గురవుతూ ఉంటారు. క్రమంగా కడుపునొప్పితో బాధపడవచ్చు. ఇది ఉసిరి యొక్క మరొక దుష్ప్రభావంగా చెప్పబడింది.

Most Read: కొత్తగా పెళ్లయ్యింది, శృంగారంలో పాల్గొంటుంటే రక్తం వస్తుంది, ఏం చెయ్యమంటారు? హెమాటోస్పర్మియా అంటే

4.మలబద్దకానికి కారణం కావచ్చు

4.మలబద్దకానికి కారణం కావచ్చు

ఉసిరిలో ఫైబర్ నిక్షేపాలు అధికంగా ఉంటాయి. గాస్ట్రోఇంటెస్టినల్ సమస్యల కారణంగా కలిగే అతిసార సమస్యలను నివారించడంలో రోగనిరోధకశక్తి అందివ్వడంలో సహాయపడుతుంది. కానీ, పరిమితి దాటి తీసుకున్న ఎడల, మలబద్దక సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మలబద్దక సమస్యలు తలెత్తకుండా, ఉసిరి రసం లేదా ఉసిరి పొడి తీసుకునే క్రమంలో నీటిని ఎక్కువగా తీసుకొనవలసి ఉంటుంది.

5.రక్తపోటు సమస్యలను పెంచుతుంది.

5.రక్తపోటు సమస్యలను పెంచుతుంది.

ఒక వ్యక్తి రక్తపోటు మరియు మూత్రపిండ రుగ్మతలతో బాధపడుతున్నట్లయితే, ఊరగాయలను ముఖ్యంగా ఉసిరి ఆధారిత ఊరగాయలను తీసుకోవడం తగ్గించాలి. దీనికి కారణం, ఇందులో ఉప్పు మోతాదులు ఎక్కువగా ఉండడమే. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం మూలంగా శరీరంలో సోడియం నిల్వలు పెరిగి రక్తప్రవాహానికి అవరోధంగా తయారవుతాయి. ఇది మూత్రపిండాల పనితీరుని దెబ్బతీస్తుంది, క్రమంగా మూత్రపిండంలో నీటినిల్వలు పెరుగుతుంటాయి. మూత్రం వచ్చిన అనుభూతికి తరచుగా లోనవుతూ ఉంటారు కూడా. ఈ అదనపు నీటినిల్వల కారణంగా మూత్రపిండాలలో తలెత్తే ఒత్తిడి, క్రమంగా అధిక రక్తపోటుకు కారణమవుతుంది.

6.జలుబు ప్రభావాలను పెంచవచ్చు

6.జలుబు ప్రభావాలను పెంచవచ్చు

ఆమ్లా ఒక సహజసిద్దమైన శీతలకారిణిగా ఉంటుంది, జలుబు లేదా శ్వాస సంబంధిత సమస్యలతో భాదపడుతున్న ఎడల, ఉసిరిని నేరుగా, లేదా పొడిరూపంలో తీసుకున్నా సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఒకవేళ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ఉసిరిని తీసుకోవలసి వస్తే, త్రిఫల రూపంలో లేదా తేనెతో కలిపిన ఉసిరిపొడిని మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఇలా తీసుకోవడం ద్వారా, జలుబు మరియు దగ్గు సమస్యలకు చికిత్సగా పనిచేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో జలుబు మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో భాదపడుతున్న సమయంలో ఉసిరిని నేరుగా తీసుకోరాదని, ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు.

Most Read:అంగాంగం చూపించి మసాజ్ చేయించుకుంది, ఆ సుఖం మాత్రం ఇవ్వనంది, కంట్రోల్ చేసుకోలేకపోయా #mystory236

7.మూత్రవిసర్జనలో మంట

7.మూత్రవిసర్జనలో మంట

ఉసిరిలోని అధిక విటమిన్-సి కంటెంట్ ఆరోగ్యానికి ఖచ్చితంగా ఉపయోగకరమైనదే, కానీ పరిమితిని మించి తీసుకోవడం వలన అదనపు దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. మూత్రవిసర్జన సమయంలో మంట, తీవ్రమైన బాధ ఉంటుంది. అంతేకాకుండా మూత్రం రంగు మారడం, దుర్వాసన సమస్యలు తలెత్తుతాయి. కావున ఎక్కువ మోతాదులో ఉసిరిని తీసుకోరాదని సూచించబడింది.

8.అలెర్జీ రియాక్షన్స్(ప్రతిచర్యలు)

8.అలెర్జీ రియాక్షన్స్(ప్రతిచర్యలు)

ఉసిరి సంబంధిత అలర్జీకి గురైనట్లయితే, కడుపులో తిమ్మిరి లేదా నొప్పి, వాంతులు, వికారం, నోరు ఎర్రబారడం లేదా వాపునకు గురవ్వడం, చర్మం దురద పెట్టడం, తలనొప్పి, మైకము, చర్మం మరియు ముఖంపై దద్దుర్లు వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులను మీరు అనుభవించవచ్చు.

9.చర్మం తేమను కోల్పోతుంది

9.చర్మం తేమను కోల్పోతుంది

ఉసిరి, శరీరంలో నీటినిల్వలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. క్రమంగా గొంతు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున ఉసిరి తీసుకొనే సమయంలో వీలైనంత ఎక్కువ నీటిని తాగవలసినదిగా సూచించడమైనది.

Most Read: ఛాన్స్ దొరికిందని అడ్డూఅదుపు లేకుండా శృంగారంలో పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? సెక్స్ ఎక్కువ చేస్తే అంతే

English summary

9 Side Effects Of Amla Which You Aren't Aware Of

Amla or Indian gooseberry is savoured in many forms but did you know that they have side effects as well? It might not be safe for people having certain health conditions such as people with low haemoglobin levels or people on any kind of anticoagulant medications, according to Ayurvedic practitioners.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more