సరికొత్త పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

శాస్త్రవేత్తలు పురుష గర్భనిరోధక మాత్రలను కల్పన చేయడానికి ఒక అడుగు దగ్గరగా వచ్చారనే ఒక కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల కలయిక ద్వారా ఉత్పత్తి చేసిన గర్భనిరోధక మాత్రలు కేవలం స్త్రీలు వినియోగించడానికి సరిపడే విధంగా ఉండేవి. వీటివల్ల బరువు పెరగడం, వికారం మరియు కల్లోల మానసిక స్థితి వంటి సమస్యలు తలెత్తుతాయి.

పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే:

ప్రస్తుతానికి పురుష గర్భనిరోధక సాధనాలు కేవలం కండోముల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇవి కూడా సరైన పద్దతిలో ధరించకపోతే 18%వరకు విఫలం అయ్యే అవకాశాలు ఉంటాయి.

All You Need To Know About The New Male Contraceptive Pill

నార్త్ కరోలినా స్టేట్ యూనివ‌ర్శిటీ వారి అధ్యయనంలో, EP055 అనే పదార్థం శుక్రకణ ప్రోటీన్లకు అంటిపెట్టుకుని, హార్మోన్ల వ్యవస్థపై ఎటువంటి దుష్ప్రభావం చూపించకుండా దాని చలనాన్ని తగ్గిస్తుందని, కనుక ఇది సమర్ధవంతమైన పురుష గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుందని తమ ప్లస్ ఒన్ అనే జర్నల్ లో తెలియజేసారు.

EP055 కు శుక్రకణం యొక్క ఈదే సామర్థ్యాన్ని తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీని వలన శుక్రకణం యొక్క ఫలదీకరణ సామర్థ్యం తగ్గిపోతుంది.

ప్రస్తుతానికి కండోములకు ప్రత్యామ్నాయం క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న హార్మోనల్ మందులు మాత్రమే. ఇవి శుక్రకణం యొక్క ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఆడవారిలో గర్భనిరోధక మాత్రలు కలిగించే దుష్ప్రభావాలే మగవారిలో కూడా ఇవి కలిగిస్తాయి.

స్త్రీలలో గర్భనిరోధక మాత్రలు అండోత్సర్గంను నిరోధిస్తాయి. వివిధరాకాల మాత్రలలో ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడివిడిగా లేదా కలిసి ఉంటాయి. ఇవి లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టలేవు. కేవలం కండోముల వలనే అది సాధ్యం.

సాధారణంగా గర్భనిరోధక మాత్రలు ఈ క్రింది దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. వికారం, నెలసరిల మధ్యలో రక్తస్రావం, తలనొప్పి మరియు మైగ్రేన్, రొమ్ములలో సున్నితత్వం, బరువు పెరగడం, నెలసరి రాకపోవడం, యోని ద్వారా స్రావాలు రావడం, లైంగిక పటుత్వం తగ్గడం, కాంటాక్ట్ లెన్స్ వాడేవారిలో కంటిచూపు మందగించడం మొదలైన దుష్ప్రభావాలు కలుగుతాయి.

గర్భనిరోధక మాత్రలు కలిగించే దుష్ప్రభావాల గురించి విశదంగా తెలుసుకోవాలనుకుంటే ఇక చదవండి:

1. నెలసరిల మధ్యలో రక్తస్రావం:

1. నెలసరిల మధ్యలో రక్తస్రావం:

నెలసరిల మధ్యలో అకస్మాత్తుగా యోని ద్వారా రక్తస్రావం జరుగుతుంది. ఇలా గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం మొదలుపెట్టిన మూడు నెలలలోపే జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పటికీ, మీరు మనేయకుండా సక్రమంగా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే సక్రమంగా పనిచేస్తాయి. ఒకవేళ ఇదేవిధంగా రక్తస్రావం ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రోజులుపాటు జరిగినా లేక మూడు లేదా అంతకన్నా ఎక్కువ రోజులపాటు తీవ్ర రక్తస్రావం జరిగితే తక్షణమే వైద్యుని సంప్రదించండి.

2. రొమ్ములలో సున్నితత్వం:

2. రొమ్ములలో సున్నితత్వం:

జన్మనిరోధక మాత్రలు లేదా స్త్రీల గర్భనిరోధక మాత్రలు రొమ్ములలో సున్నితత్వం లేదా రొమ్ములు పెరుగుదల కలుగజేస్తాయి. మాత్రలు వేసుకోవడం మొదలుపెట్టిన కొన్ని వారాల అనంతరం ఇలా జరగటం మొదలవుతుంది. మీ రొమ్ముల్లో గడ్డలు కనపడటం లేదా అదేపనిగా నొప్పి కలగటం లేదా సున్నితత్వం లేదా తీవ్రమైన ఛాతీ నొప్పి కలిగినప్పుడు తప్పక డాక్టరును సంప్రదించాలి. కెఫిన్ మరియు ఉప్పు అధికంగా కలిగిన పదార్థాలు తినరాదు. సున్నితత్వం తగ్గడానికి రొమ్ములకు ఊతమిచ్చే బ్రాను ధరించండి.

3. వికారం:

3. వికారం:

మొదటి మాత్ర తీసుకునేటప్పుడు స్త్రీలలో వికారం కలగవచ్చు. కొంతసేపటి తరువాత క్రమంగా వికారం తగ్గుతుంది. కనుక ఈ మాత్రను ఆహారంతో పాటుగా లేదా పడుకునే ముందు వేసుకుంటే మంచిది. మీలో వికారం కనుక తీవ్రంగా ఉంటే లేదా మూడు నెలల కన్నా ఎక్కువ కాలం పాటు ఉంటే మీకు వైద్య సహాయం అవసరం.

4. తలనొప్పి మరియు మైగ్రేన్:

4. తలనొప్పి మరియు మైగ్రేన్:

హార్మోన్ల కలయిక ద్వారా ఉత్పత్తి చేసిన గర్భనిరోధక మాత్రలు తలనొప్పి మరియు మైగ్రేన్ కలిగే అవకాశాన్ని పెంచుతాయి. వివిధ రకాల హార్మోన్లను వివిధ మోతాదులో కలిగివున్న మాత్రలు వివిధ రకాల లక్షణాలు కలుగజేస్తాయి. ఉదాహరణకు తక్కువ హార్మోన్ మోతాదు కలిగిన మాత్రల వలన తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్యలు తక్కువగా తలెత్తుతాయి.

5. బరువు పెరగడం:

5. బరువు పెరగడం:

కొన్నిరకాల హార్మోనల్ గర్భనిరోధక మాత్రలు వలన స్త్రీలలో బరువు పెరుగుతుంది. వీటిలో ఈస్ట్రోజన్ మోతాదు అధికంగా ఉంటుంది కనుక ఆకలి పెరిగడం మరియు ఒంట్లో నీరు చేరడంను ప్రేరేపించి బరువు పెరిగేందుకు దోహదపడతాయి.

6. కళ్ళలో మార్పులు:

6. కళ్ళలో మార్పులు:

గర్భనిరోధక మాత్రల వలన కలిగే హార్మోనల్ మార్పులు కళ్ళ లోని కార్నియాను దలసరిగా తయారు చేస్తుంది. అంతేకాక వీటిని తీసుకునేటప్పుడు ఒత్తిడి నివారణకు సంబంధించిన మందులు తీసుకున్నట్లయితే కంటి చూపు సామర్థ్యంలో అవాంఛిత మార్పులు చోటు చేసుకుంటాయి.

English summary

All You Need To Know About The New Male Contraceptive Pill

According to the study published by the University of North Carolina in the journal Plos One, a compound called EP055 binds to sperm proteins and reduces mobility without affecting hormones, making EP055 a potential male contraceptive pill without side effects. The compound turns off the sperm's ability to swim, significantly limiting fertilization capabilities.