మీరు ఆల్కహాలిక్ అవునో కాదో తెలుసుకోవడానికి ఈ 8 సమాధానాలు తోడ్పడతాయి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఆల్కహాల్ తో మీ పరిచయం ఎదో ఒక పార్టీలో మీ స్నేహితుల ద్వారా మీకు సాధారణంగా జరిగి ఉండవచ్చు.

బీర్ ను లేదా ఏదైనా స్ట్రాంగ్ పదార్థాన్ని టైనీ షాట్ లో మీరు ముగించి ఉండవచ్చు. మీరు అటెండ్ అయ్యే ప్రతి పార్టీలో మీరు డ్రింక్స్ తీసుకుంటూ ఉండటం మీకు అలవాటు అయిపోయి ఉంటుంది.

లేదంటే, కొన్ని సంవత్సరాల క్రితమే ఆల్కహాల్ మీద మీకు విరక్తి కలిగి ఉండవచ్చు. ఆల్కహాల్ అంటే మీకు బోర్ కొట్టింది. ఆ తరువాత మళ్ళీ మీరు ఆల్కహాల్ రుచిని చూశారు. ఇప్పుడు, ఆల్కహాల్ ను వదిలిపెట్టలేకపోతున్నారు.

మీ కథ ఏదైనా, గూగుల్ లో మీరు "నేను ఆల్కహాలిక్ నా?" అని సెర్చ్ చేశారంటే మీరు ఆల్కహాలిక్ అయి ఉండే అవకాశాలు బోలెడు ఉన్నాయి. కాబట్టి, ఈ 8 సమాధానాలు మీ సందేహాన్ని నివృత్తి చేస్తాయి.

1. ఆల్కహాల్ లేని ప్లాన్స్ ని మీరు క్యాన్సిల్ చేసుకుంటారు:

1. ఆల్కహాల్ లేని ప్లాన్స్ ని మీరు క్యాన్సిల్ చేసుకుంటారు:

మిమ్మల్ని ఏ ఈవెంట్ కైనా ఇన్వైట్ చేస్తే వారిచ్చే అతిథ్యంలో ఆల్కహాల్ లేకపోతే మీరు ఆ ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకుంటారు.

మీరు పెద్దవారయ్యారని, ఆల్కహాల్ తాగడం తప్పు కాదని మీరనుకుంటే మీకు ఆల్కహాలిక్ అని కచ్చితంగా చెప్పుకోవచ్చు.

2. ఇదివరకటి కంటే మీరు ఎక్కువగా తాగుతున్నారు:

2. ఇదివరకటి కంటే మీరు ఎక్కువగా తాగుతున్నారు:

మీ ఆల్కహాల్ మక్కువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటూ మీరు ఇదివరకటి కంటే ఎక్కువగా తాగుతూ ఆల్కహాల్ ని మరింత ఆస్వాదిస్తున్నట్టయితే మీరు ఆల్కహాలిక్ అని చెప్పుకోవచ్చు.

3. ప్రామిస్ చేసిన దాని కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు:

3. ప్రామిస్ చేసిన దాని కంటే ఎక్కువగా తీసుకుంటున్నారు:

మీలో మీరు ఇంతటితో ఆపేస్తాను అని అనుకున్నా కూడా మరింత ఆల్కహాల్ ను ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారా? అయితే, మీరు ఆల్కహాలిక్ కోవలోకే వస్తారు. మీకు డ్రింకింగ్ ప్రాబ్లెమ్ ఉందని ఈ విషయం స్పష్టం చేస్తోంది.

మీ ప్రామిస్ ను మీరే ప్రతి సారి బ్రేక్ చేసుకుంటున్నట్టయితే మీరు ఆల్కహాలిక్ అన్న విషయాన్ని మీరు గుర్తించాలి.

4. రోజు పూర్తవగానే మీరు బాటిల్ కోసం ఉవ్విళ్లూరుతారు:

4. రోజు పూర్తవగానే మీరు బాటిల్ కోసం ఉవ్విళ్లూరుతారు:

ప్రతి రోజు గ్లాసుడు ఆల్కహాల్ ను తీసుకోకపోతే మీకు రిలీఫ్ కలిగినట్టు అనిపించదు. ఇలా మీకు అనిపిస్తే మీరు ఆల్కహాలిక్ కేటగిరీలోకే వస్తారు.

ఉదయాన్నే ఆల్కహాల్ లేకపోతే రోజు ప్రారంభం అయినట్టు అనిపించదా? మీరు ఆల్కహాలిక్ అని కచ్చితంగా నిర్దారించవచ్చు. (ఈ అలవాటుకు మీకు బోనస్ పై మీరు బోనస్ పాయింట్స్ ఇచ్చుకోవద్దు)

5. తాగిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవుతారు:

5. తాగిన ప్రతిసారి గిల్టీగా ఫీల్ అవుతారు:

అప్పుడప్పుడు తాగేవారు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు గిల్టీగా ఫీల్ అవరు. నిజానికి, వారు ఆల్కహాల్ ని ఆస్వాదిస్తారు. ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకున్న ప్రతి సారి గిల్టీగా ఫీల్ అయితే మీరు ఆల్కహాలిక్ గా మారిపోయారని అర్థం.

లిక్కర్ కోసం మీరు ఉవ్విళ్ళూరుతూ క్వాంటిటీని ఎప్పటికప్పుడు పెంచేస్తూ ఉంటే మీరు ఆల్కహాలిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

6. ఎవరైనా మీ రూమ్ లోకి ఎంటర్ అవగానే మీ గ్లాస్ ని మీరు హైడ్ చేస్తారు:

6. ఎవరైనా మీ రూమ్ లోకి ఎంటర్ అవగానే మీ గ్లాస్ ని మీరు హైడ్ చేస్తారు:

గిల్టీగా ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని హైడ్ చేస్తాము. ఇటువంటి గిల్టీ మీకు ఆల్కహాల్ ని తీసుకుంటున్నప్పుడు కలిగితే మీరు ఆల్కహాలిక్ అయ్యే అవకాశాలు మెండు. మీరొక్కరే బాటిల్ ను ఫినిష్ చేసేస్తూ ఉంటే మీరు ఆల్కహాలిక్ కోవలోకే వస్తారు.

7. ప్రతిసారి మీరు బ్లాక్ అవుట్ కి గురవుతున్నారు:

7. ప్రతిసారి మీరు బ్లాక్ అవుట్ కి గురవుతున్నారు:

ఆల్కహాల్ ని మీరు ముందు రోజు రాత్రి తీసుకుంటే ఆ మరుసటి రోజు మీ మెమరీ పై దుష్ప్రభావాన్ని మీరు గమనిస్తున్నారు. ఆల్కహాల్ ను తీసుకునే ప్రతిసారి మీరు బ్లాక్ అవుట్ కి గురవుతూ ఉంటే మీరు ఆల్కహాలిక్ కోవలోకే వస్తారు.

8. మీరు తీసుకునే మోతాదుల గురించి మీరు అబద్దం చెప్తున్నారు:

8. మీరు తీసుకునే మోతాదుల గురించి మీరు అబద్దం చెప్తున్నారు:

మీరు తీసుకున్న డ్రింక్స్ కవుంట్ ని చెప్పేటప్పుడు మీరు ఎప్పుడు అబద్దం చెప్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఆల్కహాలిక్ అవవచ్చు. మీరు గిల్టీగా ఫీల్ అవకపోతే అబద్దం చెప్పారు కదా!

అదనంగా, మీకు ఈ ప్రశ్న ఎదురవుతూ ఉందంటే అదే మీరు సాధారణం కంటే ఎక్కువ తాగుతున్నారని స్పష్టం చేస్తున్న అంశం.

కాబట్టి, నిజం తెలుసుకుని, ఈ విషయంపై ఒక స్పష్టతను తెచ్చుకోండి.

English summary

Am I An Alcoholic? 8 Answers That Reveal You Are

Am I An Alcoholic? 8 Answers That Reveal You Are,If you just googled “am I am alcoholic”, there’s a good chance you actually are one. So here are 8 answers that will clear it up once and for all.
Story first published: Wednesday, March 28, 2018, 16:50 [IST]