మామిడితో లెక్కలేనన్నీ ప్రయోజనాలుంటాయి.. వాటిని పండ్లుగా ఎలా మారుస్తారో తెలిస్తే తినరేమో!

Written By:
Subscribe to Boldsky

వేస‌వి సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌లో మామిడి పండు ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంది. వీటిని ఈ సీజ‌న్‌లో తిన‌డం చాలా మంచిది. ఎన్నో పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. శ‌రీరానికి శ‌క్తి అంది ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

మార్కెట్‌లోకి మామిడిపండ్లు విరివిగా వస్తున్నాయి. వాటికి సీజన్‌ ఇది. బంగారపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు. మామిడిలో క్యాలరీలు కూడా బాగానే ఉంటాయి. చిన్న కప్పు మామిడి ముక్కల్లో 100 క్యాలరీల శక్తి ఉంటుంది.

దీనిలో ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని ఒక అంచనా.

క్యాన్సర్‌ ను నివారిస్తుంది

క్యాన్సర్‌ ను నివారిస్తుంది

మామిడి పెద్దపేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది.కంటిచూపును దెబ్బతీసే జబ్బు ‘మాక్యులార్‌ డీజనరేషన్‌' ముప్పును తప్పించగల శక్తి దీని సొంతం.మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణించవచ్చు.

కంటి చూపును మెరుగుపరుస్తుంది

కంటి చూపును మెరుగుపరుస్తుంది

కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా-కెరటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.

రక్తపోటునూ నివారిస్తుంది

రక్తపోటునూ నివారిస్తుంది

మామిడిలో ఉండే పొటాషియమ్‌ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌)నూ, రక్తపోటునూ నివారిస్తుంది.

అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చు కానీ డ‌యాబెటిస్ ఉన్న వారు మాత్రం మామిడి పండ్ల‌ను తినేందుకు వెనుక‌డుగు వేస్తుంటారు.

మ‌ధుమేహం ఉన్న వారికి డౌట్

మ‌ధుమేహం ఉన్న వారికి డౌట్

ఎందుకంటే మామిడి పండ్ల‌ను తింటే ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు పెరుగుతాయ‌ని వారు భావిస్తారు. అయితే ఇది నిజ‌మేనా..? అస‌లు మ‌ధుమేహం ఉన్న వారు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చా, తిన‌రాదా..? ఇప్పుడు తెలుసుకుందాం.

తిన‌వ‌చ్చు

తిన‌వ‌చ్చు

ఒక సాధార‌ణ సైజ్ ఉన్న మామిడి పండు ద్వారా ల‌భించే క్యాల‌రీలు, ఒక‌టిన్న‌ర గోధుమ రొట్టెతో ల‌భించే క్యాల‌రీల‌కు స‌మానం. క‌నుక మామిడి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న వారు తిన‌వ‌చ్చు. అయితే ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే మాత్రం మామిడి పండ్ల‌ను తిన‌రాదు.

ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్

ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్

ఎందుకంటే భోజ‌నం వ‌ల్ల అప్ప‌టికే రావ‌ల్సిన‌న్ని క్యాల‌రీలు మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో వెంట‌నే మామిడి పండును తింటే దాంతో ల‌భించే క్యాల‌రీలు అన్నీ కొవ్వు కింద మారుతాయి. దీనికి తోడు ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. అయితే మ‌రి మామిడి పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న వారు తిన‌రాదా..? అంటే... తిన‌వ‌చ్చు. అందుకు ఓ ప‌ద్ధ‌తి ఉంది.

షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా

షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ న‌డుమ లేదా మ‌ధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్న‌ర్ న‌డుమ ఉండే స‌మ‌యంలో మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. దీంతో ఎలాంటి స‌మ‌స్యా రాదు. షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా పెర‌గ‌కుండా ఉంటాయి. సాధార‌ణంగా మామిడి పండు గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువే. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారాన్ని మనం తిన్న త‌రువాత అది ర‌క్తంలో ఎంత సేప‌టికి క‌లిసి గ్లూకోజ్ గా మారుతుంది. ఎంత సేప‌టికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను ప్ర‌భావితం చేస్తుంది అనే ఓ కొల‌త‌.

నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు

నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు

ఇది మామిడి పండ్ల‌కు 100కు 56గా ఉంటుంది. అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ జాబితా ప్ర‌కారం చూస్తే ఇది చాలా త‌క్కువే. క‌నుక మ‌ధుమేహం ఉన్న వారు నిర్భ‌యంగా మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే వాటిని పైన చెప్పిన స‌మయాల్లో తింటేనే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు..!

తక్కువ ధరకు కొనుగోలు చేసి

తక్కువ ధరకు కొనుగోలు చేసి

మామిడి పండ్లను కొనుగోలు చేయడం వ్యాపారులకు ఆర్థికంగా పెట్టుబడి ఎక్కువ కావడంతో కాయలను ఎంచుకుంటున్నారు. మామిడి తోటల్లో కాయలు, గాలి దుమారంకు కింద పడిన కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాములకు తరలిస్తారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బైట్‌ను కొనుగోలు చేస్తారు.

కాయలు పండ్లుగా

కాయలు పండ్లుగా

ఈ రసాయనాన్ని పొట్లాలుగా మారుస్తారు. 20 కిలోల మామిడి కాయల బాక్స్‌లలో, నేలపై రాశులుగా వేసిన కాయల మధ్య ఐదు నుంచి 50 వరకు కార్బైట్ పొట్లాలను మధ్య మధ్యన పెడతారు. ఆ కార్బైట్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. ఆ రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రత పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి.

అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి

అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి

నాలుగు రోజులపాటు బాక్స్‌లలో, నేల మీద రాశులుగా ఉన్న మామిడికాయలు పండ్లుగా మారతాయి. పూర్తి పచ్చదనంలోకి వచ్చి మామిడి ప్రియుల నోర్లు ఊరించేలాగా మారుతాయి. అలా తయారైన మామిడి పండ్లను మార్కెట్లోకి రిటైల్ అమ్మకం దారులకు విక్రయిస్తారు. అలా చేతులు మారిన మామిడి పండ్లు మామిడి ప్రియుల చేతికి చేరి కడుపులోకి వెళ్లి అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి.

గ్యాస్ ద్వారా

గ్యాస్ ద్వారా

గ్యాస్ ద్వారా కూడా మామిడి కాయలను పండ్లుగా మార్చడం కొత్త పద్ధతి. గతేడాది మంచిర్యాలలో ప్రారంభమైంది. కాల్షియం కార్బైట్ తక్కువ ఖర్చుతో పండ్లుగా మార్చే వీలున్నప్పటికి పెద్ద మొత్తంలో పండ్లుగా మారడం సాధ్యం కాదు. దాంతో కూలింగ్ స్టోర్ విధానం ద్వారా కాయలను పండ్లుగా మారుస్తున్నారు.

ఇథిలేన్ అనే గ్యాస్‌ని

ఇథిలేన్ అనే గ్యాస్‌ని

ఒకేసారి 8 వేల కిలోల వరకు కాయలను పండ్లుగా మార్చే సౌలభ్యం కూలింగ్ స్టోర్‌లో ఉంటుంది. ఇథిలేన్ అనే గ్యాస్‌ని కూలింగ్ స్టోరేజ్‌లోకి పంపుతారు. పగలంతా కూలింగ్, రాత్రి వేళ మాత్రమే గ్యాస్‌ను స్టోర్‌లోకి విడుదల చేస్తారు. అలా రసాయనాల ప్రభావంతో నాలుగు రోజుల్లోనే కాయలు పండ్లుగా మారతాయి.

అంత వ్యయం చేస్తున్నారంటే

అంత వ్యయం చేస్తున్నారంటే

ఒక మామిడిపండే కాకుండా అరటికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. పండ్లను మాగ పెట్టడానికి కూలింగ్ స్టోరేజ్‌లు పెట్టడానికి రూ.25 లక్షల నుంచి రూ.30 వరకు వ్యయం చేస్తున్నారంటే లాభాలు ఎలా ఉన్నాయో తేట తెల్లం అవుతుంది.

నిషేధించారు

నిషేధించారు

బహిరంగ మార్కెట్‌లో కార్బైట్ విచ్చలవిడిగా దొరుకుతోంది. కిలో విలువ రూ.80 ఉంటుంది. దీనిని స్టీలు రంగు మార్చేందుకు, వెల్డింగ్ కోసం ఉపయోగిస్తారు. పండ్లపై వీటి వాడకాన్ని నిషేధించిన అమలుకావడం లేదు.

వాడకాన్ని తగ్గిస్తే

వాడకాన్ని తగ్గిస్తే

వ్యాపారులు గోదాముల్లో కార్బైన్‌ను వినియోగించి మాగబెడుతున్నా పట్టించుకోవడం లేదు. వీటి వాడకాన్ని తగ్గిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారు అవుతారు. అధికారుల నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఏటా రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

English summary

amazing benefits of mangoes

amazing benefits of mangoes
Story first published: Wednesday, May 2, 2018, 15:00 [IST]