For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలకూర ఆకులను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగితే మగాళ్లు రాత్రి పూట అస్సలు మాట వినరు

ఆకుకూరల్లో ‘ పాలకూర ’ ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెల్సిన విషయమే. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వుంటాయంటున్నారు వైద్యులు. ఇది విటమిన్లను సమృద్ధిగా కలిగి వుంటుంది. పాలకూర.

|

ఆకుకూరల్లో ' పాలకూర ' ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెల్సిన విషయమే. దీన్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు వుంటాయంటున్నారు వైద్యులు. ఇది విటమిన్లను సమృద్ధిగా కలిగి వుంటుంది.

విటమిన్ ఎ , బి , సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విస్తారంగా లభ్యమవుతాయి. దీన్ని వండి, వండకుండా రెండు రకాలుగా కూడా తినవచ్చు. పచ్చి పాలకూర తింటేనే ఎక్కువ ప్రయోజనం. ఎన్నో పోషక విలువలు కలిగిన పాలకూర వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి.

రక్తపోటు నియంత్రణ

రక్తపోటు నియంత్రణ

పాలకూరలో పొటాషియం ఎక్కువగా వుండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె వ్యాధుల నిరోధానికి కూడా పనిచేస్తుంది.

కండరాలను బలపరుస్తుంది

కండరాలను బలపరుస్తుంది

పాలకూర యాంటీ ఆక్సిడెంట్ మరియు ప్రోటీన్ తత్వాలను ఎక్కువగా కలిగి వుండటం వల్ల కండరాలను బలోపేతం చేస్తుంది. ఆకలిని పెంచే గుణాలు కలిగి వుంది ఈ ఆకుకూర.కండరాలను బలపరుస్తుంది

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

ఊబకాయంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పాలకూర, క్యారట్లను కలిపి జ్యూస్ చేసుకుని తాగితే మంచి ఫలితం వుంటుంది. ఇది బలహీనతను తగ్గిస్తుంది మరియు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ

మెరుగైన జీర్ణక్రియ

జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోతే శరీరం మీద ఎన్నో వ్యాధుల దాడి చేసే అవకాశం ఎక్కువగా వుంటుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన కూరగాయలను, ఆకుకూరలను ఆహారంలో చేర్చడం ముఖ్యం. పాలకూర తినడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

కళ్ళకు ప్రయోజనకరమైనది

కళ్ళకు ప్రయోజనకరమైనది

పాలకూర, టమాట, క్యారెట్ల జ్యూసులు క్రమం తప్పకుండా తాగడం వల్ల కంటిచూపును మెరుగు పరుచుకోవచ్చు. వీటిలో కళ్ళకు మేలు చేసే విటమిన్ ‘ ఎ ' సమృద్ధిగా వుంటుంది.

పక్షవాతాన్ని నివారిస్తుంది

పక్షవాతాన్ని నివారిస్తుంది

పక్షవాతాన్ని నివారించే విషయంలో పాలకూర సమర్థవంతంగా ఉపయోగపడుతుందని చైనీస్‌ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో నిరూపించారు. పాలకూరలోని ఫోలిక్‌ యాసిడ్స్‌ వల్ల ఈ ప్రయోజనం జరుగుతుందని శాస్త్రవేతలు చెప్పారు. ముఖ్యంగా హైపర్‌టెన్షన్‌ (హైబీపీ) వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలను ఫోలిక్‌ యాసిడ్‌ బాగా నివారిస్తుందని, పాలకూరలో ఇది పుష్కలంగా ఉంటుందట. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది.

గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ

గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువ

వీరంతా హైబీపీని తగ్గించుకోవడానికి 'ఎనాలప్రిల్‌' అనే మందును వాడుతున్నారు.వీరికి ఈ మందుతో పాటు ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కవ మోతాదులో ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని ఇచ్చారు. అయితే ఫోలిక్‌ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో స్ట్రోక్‌ వచ్చేందుకు ప్రమాదం ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం పడిపోయాయని అధ్యయనవేత్తలు గమనించారు. దీనితో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయట.

25 శాతం ఐరన్‌

25 శాతం ఐరన్‌

ఐరన్‌ చాలా ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో దాదాపు 25 శాతం ఐరన్‌ ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు. పాలకూరలో విటమిన్‌-ఏ తోపాటు విటమిన్‌-సి కూడా చాలా ఎక్కువ. అందుకే దీనితో మంచి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది.ఇందులో ఉంటే ల్యూటిన్, జియాగ్జాంథిన్‌ వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ను అరికట్టి, క్యాన్సర్‌ నుంచి రక్షిస్తాయి.

విటమిన్‌–కె ఎక్కువ

విటమిన్‌–కె ఎక్కువ

పాలకూరలో విటమిన్‌-కె పాళ్లు కూడా ఎక్కువ. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడటంతోపాటు ఎముక సాంద్రత పెంచుతుంది. మెదడులోని న్యూరాన్లకు రక్షణ కల్పిస్తూ... వయసు పెరిగాక వచ్చే అలై్జమర్స్‌ వ్యాధిని నివారిస్తుంది.పాలకూరలో విటమిన్‌-బి కాంప్లెక్స్‌లోని అన్ని పోషకాలూ ఉన్నాయి. పుట్టుకతో వచ్చే అనేక జబ్బులను ఈ పోషకాలు నివారిస్తాయి. అందుకే డాక్టర్లు పాలకూర ఎక్కువగా తినమంటూ గర్భిణులకు సిఫార్సు చేస్తారు.

పొటాషియం, మెగ్నీషియం

పొటాషియం, మెగ్నీషియం

పాలకూరలోని పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాదు.. ఇది తిండి యావను కూడా తగ్గిస్తున్నట్టు బయటపడింది. పాలకూరలోని థైలాకాయిడ్ల సారం కొవ్వు త్వరగా జీర్ణం కాకుండా చూస్తున్నట్టు.. ఫలితంగా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే తిండి మీద యావను తగ్గిస్తుందన్నమాట. కడుపు నిండిందనే సంకేతాన్ని అందించే హార్మోన్ల ఉత్పత్తిని థైలకాయిడ్ల సారం ప్రోత్సహిస్తుండటం గమనార్హం.

పాలకూర పోషకాల గని

పాలకూర పోషకాల గని

పాలకూర రసం తీపి పదార్థాలను తినాలనే కోరికనూ తగ్గిస్తున్నట్టు గత అధ్యయనంలోనూ బయటపడింది. కాబట్టి పాలకూరను తరచుగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ కాలంలోనైనా అందుబాటులో ఉండే పాలకూర పోషకాల గని. దీనిలో ఇనుము దండిగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరులో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్ కూడా ఇందులో ఉంటాయి.

ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ కె పాలకూరలో లభించినంత మరే కూరగాయల్లోనూ ఉండదు!

శృంగార సమస్యలు తొలగిపోతాయి

శృంగార సమస్యలు తొలగిపోతాయి

శృంగార లోపాలను దూరం చేసుకోవాలంటే పాలకూర తినాలి. ఈ ఆకులో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లంతో పాటు విటమిన్ సి, ఐరన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను కూరగా కాకుండా.. ఆకును మిక్సీలో వేసి.. గ్రైండ్ చేసి ఒక గ్లాసు తాగినట్టయితే శృంగార సమస్యలు తొలగిపోతాయి. మీ భాగస్వామితో బాగా సెక్స్ చేయవచ్చు. వీర్యం కూడా చాలా స్కలించవచ్చు. మీ దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పాలకూర తోడ్పడుతుంది.

English summary

amazing benefits of spinach

amazing benefits of spinach
Desktop Bottom Promotion