For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద‌యం అర‌గంట న‌డిస్తే చాలు..ఈ 12 ఇబ్బందులు మీ ద‌రిచేర‌వు!

ఉద‌యాన్నే 30 నిమిషాల న‌డ‌క మీ జీవ‌న గ‌తినే మార్చుతుంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌, ఒబేసిటీ, గుండె రుగ్మ‌త‌లు లాంటివి ఉంటే ఉద‌య‌పు న‌డ‌క‌తో వీటి తీవ్ర‌త త‌గ్గుతుంది. కండ‌రాల‌కు, గుండెకు చాలా మంచిది. ఉద‌య‌పు

By Sujeeth Kumar
|

ఉద‌యాన్నే 30 నిమిషాల న‌డ‌క మీ జీవ‌న గ‌తినే మార్చుతుంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌, ఒబేసిటీ, గుండె రుగ్మ‌త‌లు లాంటివి ఉంటే ఉద‌య‌పు న‌డ‌క‌తో వీటి తీవ్ర‌త త‌గ్గుతుంది. కండ‌రాల‌కు, గుండెకు చాలా మంచిది. ఉద‌య‌పు చ‌లిగాలులు న‌రాల‌కు మంచిది. మూడ్‌ను బాగా చేసి రోజంతా ఉత్సాహంగా, సానుకూల దృక్ప‌థంతో ఉండేలా చేస్తుంది. మ‌రింకేం ఒక జ‌త వాకింగ్ షూస్ కొనుక్కొని ద‌గ్గ‌ర‌లోని పార్కుకు బ‌య‌లుదేరండి. 30 నిమిషాల ఉద‌య‌పు న‌డ‌క 2 గంట‌ల జిమ్‌తో స‌మానం. అయితే ఉద‌యం న‌డిస్తేనే మంచిద‌ని ఎందుకు అంటారు? శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం...

ఉద‌యాన్నే గాలిలో క‌లుషిత‌పు ఛాయ‌లు త‌క్కువ‌గా ఉంటాయి. తాజా గాలిలో ప్రాణ‌వాయువు పుష్క‌లంగా ఉంటుంది. ప్రాణ‌వాయువు శ‌రీరంలోని క‌ణాల‌కు బాగా అందుతుంది త‌ద్వారా అన్ని ప‌నులు సునాయాసంగా జరిగిపోతాయి. శ‌రీరం బాగా ప‌నిచేసిన‌ప్పుడు ఎలాంటి రోగాలు అంత తొంద‌ర‌గా ద‌రిచేర‌వు.

తెల్ల‌వారుజామున ఉండే గాలిలో నెగెటివ్ అయాన్లు ఉంటాయి. ఆక్సిజ‌న్ కూడా నెగెటివ్ గా చార్జ్ అయి ఉంటుంది. నెగెటివ్ అయాన్స్ ఉంటే ఏమ‌వుతుంది అంటారా? ఎక్కువ మొత్తంలో తాజా గాలి లోప‌లికి వెళ్లి మంచి తాజా భ‌రిత ఉల్లాస అనుభూతిని ఇస్తుంది.

Amazing Health Benefits Of A Morning Walk,

మీరెప్పుడైనా స‌మీపంలోని అడ‌వికి లేదా బీచ్ లేదా ఏ జ‌ల‌పాతం ద‌గ్గ‌ర‌కో వెళ్లార‌నుకోండి.. ఎలా అనిపిస్తుంది. ? చ‌ల్ల‌ని తాజా గాలితో మీ మ‌న‌సు తేలిక‌ప‌డుతుంది క‌దూ! అందుకే సెల‌వుల‌కు ఇలాంటి ప్ర‌దేశాల‌కు వెళ్లి వ‌స్తే చాలా హాయిగా ఉంటుంది. మ‌రి ఉద‌యాన్నే న‌డ‌క‌తో ఇలాంటి అనుభూతిని సొంతం చేసుకుందాం. మీరేమంటారు.

ఉద‌య‌పు న‌డ‌క‌కు ఏం ఉంటే బాగుంటుందో చూద్దాం...

ఒక జ‌త వాకింగ్ షూస్‌

షార్ట్స్ లేదా లెగ్గింగ్స్‌

స్పోర్ట్ టీ ష‌ర్ట్‌

ఆడ‌వారికైతే స్పోర్ట్స్ బ్రా

హెయిర్ బ్యాండ్‌

మంచి నీళ్ల సీసా

ఫిట్ బ్యాండ్‌- గుండె చ‌ప్పుడు, న‌డ‌క వేగాన్ని లెక్కించేందుకు

ఇక వీట‌న్నింటికంటే ముఖ్య‌మైన‌ది.. స్పూర్తి!! అదెలా తెచ్చుకొని ఉద‌య‌పు న‌డ‌క‌కు సిద్ధ‌మ‌వ్వాలో ఇప్పుడు చూద్దాం. మార్నింగ్ వాక్‌కు పురిగొలిపే 12 కార‌ణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గిస్తుంది

1. డ‌యాబెటిస్ రిస్క్ త‌గ్గిస్తుంది

డ‌యాబెటిస్ అత్యంత సాధార‌ణ జీవ‌న‌శైలి రుగ్మ‌త‌ల్లో ఒక‌టిగా త‌యార‌వుతుంది. అయితే ఉద‌య‌పు న‌డ‌క‌తో డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని తగ్గించుకోవ‌చ్చు. ఒక రీసెర్చ్ ప్ర‌కారం రోజుకు 30 నిమిషాలు న‌డిస్తే ర‌క్తంలో చ‌క్కెర‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. అదీ కాక డ‌యాబెటిస్ 2 ఇన్సులిన్ స‌మ‌ర్థంగా ఉంటుంది. దీని వ‌ల్ల కండరాల్లో క‌ణాలు గ్లూకోజ్‌ను స‌మ‌ర్థంగా ఉప‌యోగించ‌గ‌లుగుతుంది. శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డంలో ఇది స‌హ‌క‌రిస్తుంది. బీఎమ్ఐ మెరుగుప‌డుతుంది.

2. గుండె ప‌దిల‌మ‌వుతుంది

2. గుండె ప‌దిల‌మ‌వుతుంది

గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్ట‌యితే పరుగు మంచిది కాదు. అయితే న‌డ‌క మంచిదే. బ్రిస్క్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె వ్యాధులు త‌గ్గుతాయి. ఉద‌యాన్నే 30 నిమిషాలపాటు న‌డ‌వ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. ప్ర‌తి రోజు ఉదయాన్నే న‌డ‌క‌ను అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంది.

3. బ‌రువు త‌గ్గుతారు

3. బ‌రువు త‌గ్గుతారు

చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒబేసిటీ కార‌ణం. రోజులో ఎక్కువ స‌మ‌యం క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం వ‌ల్ల ఒబేసిటీ వ‌స్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే డాక్ట‌ర్ స‌ల‌హాతో ఉద‌య‌పు న‌డ‌క‌ను మొద‌లుపెట్ట‌వ‌చ్చు. దీంతో గుండె ప‌దిలంగా ఉంటుంది. అదీ కాక తొంద‌ర‌గా అల‌సిపోరు. 30 నుంచి 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే బాగుంటుంది. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి క్యాల‌రీలు ఖ‌ర్చ‌య్యేలా చేస్తుంది. ఇది బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది. నిపుణులు ఏమంటారంటే ఎలాంటి డైట్ నియ‌మాలు పాటించ‌కుండానే ఉద‌య‌పు న‌డ‌క‌తో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు అంటారు.

4. అర్థ‌రైటిస్ ను నివారిస్తుంది

4. అర్థ‌రైటిస్ ను నివారిస్తుంది

అంత‌గా క‌ద‌లిక లేని జీవితాన్ని గ‌డ‌ప‌డం వ‌ల్ల మోకాలి కండ‌రాలపై ప్ర‌భావం చూపిస్తుంది. కీళ్ల‌లో మెల్లిగా ఆర్థ‌రైటిస్ మొద‌ల‌వుతుంది. తాజా ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం వారంలో కనీసం 5 రోజుల పాటు వాకింగ్ చేస్తే ఆర్థ‌రైటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఎముక‌ల దృఢ‌త్వం త‌గ్గుతుంది. నిదానంగా న‌డ‌వ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గి ఎముక‌లు దృడంగా త‌యార‌వుతాయి.

5. గుండెపోటును నివారిస్తుంది

5. గుండెపోటును నివారిస్తుంది

బ్రిస్క్ వాకింగ్ ఆరోగ్యంగా, బ‌లంగా ఉండేలా చేస్తుంద‌ని ముందే చెప్పుకున్నాం క‌దా! సౌత్ క‌రోలినా యూనివ‌ర్సిటీ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం వారానికి 5 రోజుల‌పాటు వాకింగ్ చేస్తే గుండె పోటు వ‌చ్చే స‌మ‌స్య త‌గ్గుతుంది. క్ర‌మంగా ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేసేవారికి గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం 40శాతం త‌గ్గిపోతుంది అని తేలింది.

6. అదుపులో కొలెస్ట్రాల్‌

6. అదుపులో కొలెస్ట్రాల్‌

శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు కొంచెం కొల‌స్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఐతే ఇది శ్రుతిమించితే మాత్రం గుండె స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాద‌ముంది. జీవ‌న శైలి మెరుగుప‌డ‌టంలో వాకింగ్ చాలా ఉప‌యోగ‌క‌రంగా మ‌లుస్తుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ నిల్వ‌లు తగ్గితే శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

7. ర‌క్త‌ప్ర‌స‌రణ మెరుగ‌వుతుంది

7. ర‌క్త‌ప్ర‌స‌రణ మెరుగ‌వుతుంది

ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ధ‌మ‌నుల గోడ‌ల్లో పేరుకుపోవ‌డం వ‌ల్ల అథెరో స్కెలోరిసిస్ అనే రుగ్మ‌త వ‌స్తుంది. ఇది ధ‌మ‌నుల లోప‌లి గోడ‌ల్లో పేరుకుపోవ‌డం వ‌ల్ల మెద‌డు, కిడ్నీలు, గుండె, కాళ్లు లాంటి అవ‌యవాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. కీల‌క భాగాల‌కు ర‌క్త ప్ర‌సర‌ణ త‌గ్గిపోతుంది. ఉద‌యాన్నే క్ర‌మం త‌ప్పకుండా న‌డిస్తే ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది.

8. డిప్రెష‌న్

8. డిప్రెష‌న్

ప్ర‌తి 10మందిలో ఒక‌రు డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల అటు యువ‌త‌, ఇటు పెద్ద‌వారిలో మ‌ర‌ణాల రేటు పెరుగుతోంది. ఐతే ఉద‌యం లేచి న‌డిస్తే మెద‌డులో పిచ్చి ఆలోచ‌న‌ల‌న్నీ త‌గ్గిపోతాయని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. ఎలాగంటే ఉద‌య‌పు న‌డ‌క స‌హ‌జ‌మైన నొప్పి నివారిణిలా ప‌నిచేస్తుంది. వారంలో 200 నిమిషాలు న‌డ‌క‌కు కేటాయిస్తే శ‌రీరం ఉత్సాహంగా త‌యార‌వుతుంద‌ట‌.

9. క్యాన్స‌ర్‌తో పోరాటం

9. క్యాన్స‌ర్‌తో పోరాటం

నిపుణుల ప్ర‌కారం ఉద‌య‌పు న‌డ‌క చాలా ర‌కాల క్యాన్స‌ర్ల నుంచి ర‌క్షిస్తుంది. చాలా మంది త‌మ బిజీ షెడ్యూళ్ల వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని కోరితెచ్చుకుంటున్నారు. తాజా గాలి వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. న‌డ‌క వ‌ల్ల ఒవేరియ‌న్‌, రొమ్ము, కిడ్నీ క్యాన్స‌ర్‌ల ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని తేలింది. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త‌గా ఉద‌య‌పు న‌డ‌క‌ను అల‌వాటు చేసుకోండి.

10. మెద‌డు చురుగ్గా...

10. మెద‌డు చురుగ్గా...

త‌ర‌చూ వ్యాయామ‌మో, న‌డ‌కో చేస్తుంటే జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌న్న సంగ‌తి తెలుసా? నైపుణ్యాలు పెరుగుతాయి. మార్నింగ్ వాక్ వ‌ల్ల శ‌రీరం పున‌రేత్త‌జిమ‌వుతుంది. న‌డిచిన‌ప్పుడు ఆక్సిజ‌న్ బాగా అంది ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది.

11. శ‌రీరాన్ని టోన్డుగా ఉంచుతుంది

11. శ‌రీరాన్ని టోన్డుగా ఉంచుతుంది

కొవ్వు క‌రిగించ‌డం వ‌ల్ల శ‌రీరం స్లిమ్‌గా, టోన్డుగా క‌నిపించ‌దు. టోన్డు బాడీ రావాలంటే వాకింగ్ మంచి ఎంపిక‌. కాళ్లు, పొట్ట మంచి టోన్డు షేప్‌లో వ‌స్తుంది. రోజు న‌డ‌క వ‌ల్ల శ‌రీరం దృఢంగా త‌యార‌వుతుంది. జిమ్‌లో చేర‌లేక‌పోతే ఉద‌యం న‌డ‌క బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

12. గ‌ర్భ‌స్రావం అవ్వ‌కుండా..

12. గ‌ర్భ‌స్రావం అవ్వ‌కుండా..

త‌ల్లి కాబోయేవారు స్విమ్మింగ్‌, వాకింగ్ లాంటివి చేస్తే వారి శ‌రీరంపై మంచి ప్రభావం ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ క్ర‌మంగా వృద్ధి చెందుతాయి. మ‌హిళ‌ల్లో గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశాలు త‌గ్గుతాయి. మూత్ర‌కోశ సంకోచాలు రాకుండా ఉంటాయి. అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇదంతా ఉద‌యం పూట 30 నిమిషాలపాటు న‌డ‌వ‌డం వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది.

English summary

Amazing Health Benefits Of A Morning Walk

A 30-minute walk in the morning can change your life! Especially if you suffer from a host of lifestyle-related diseases such as diabetes, obesity, heart disease, etc. A morning walk is easy on your joints and heart, and the fresh morning air can help calm your nerves, improve your mood, and keep you energetic and positive for the rest of the day. Just buy a pair of walking shoes and take a walk in the nearby park. Because a 30-minute morning walk is equivalent to 2 hours of gymming! But why should you walk only in the mornings? Well, here’s what science has to say…
Story first published:Friday, February 16, 2018, 16:09 [IST]
Desktop Bottom Promotion