సంతానం త్వరగా కలగలాంటే మగవారు గుమ్మడి గింజలు తినాలి

Written By:
Subscribe to Boldsky

చాలా మంది గుమ్మడికాయలతో కూర లేదా తీపి వంటకాలను చేసుకుని తింటారు. అవి చాలా రుచిగా కూడా ఉంటాయి. అయితే గుమ్మడికాయలను కోశాక వాటిల్లో ఉండే విత్తనాలను పారేస్తారు. కానీ కింద చెప్పిన లాభాలను తెలుసుకుంటే ఇకపై ఎవరూ ఆ విత్తనాలను అలా పారేయరు. ఎందుకంటే గుమ్మడికాయ విత్తనాల లోపల ఉండే పప్పును తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఔషధ గుణాలు

ఔషధ గుణాలు

గుమ్మడికాయ విత్తనాల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. గ్యాస్ట్రిక్, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, కోలన్ క్యాన్సర్లు రాకుండా ఉండాలి. మహిళలు గుమ్మడికాయ విత్తనాలను తరచూ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.

హైబీపీని తగ్గిస్తాయి

హైబీపీని తగ్గిస్తాయి

గుమ్మడికాయ విత్తనాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హైబీపీని తగ్గిస్తాయి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుమ్మడికాయ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.

చర్మాన్ని రక్షిస్తాయి

చర్మాన్ని రక్షిస్తాయి

వయస్సు మీద పడడం కారణంగా వచ్చే ముడతలు తగ్గాలంటే గుమ్మడికాయ విత్తనాలను తినాలి. వీటిల్లో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు చర్మ సౌందర్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి. దీంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాంతివంతంగా, మృదువుగా కూడా మారుతుంది.

బట్టతల రాకుండా

బట్టతల రాకుండా

నేటి తరుణంలో చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి. కొందరికి చిన్న తనంలోనే బట్టతల వస్తున్నది. అలాంటి సమస్య ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాలను తినాలి. వాటిల్లో ఉండే ఫైటోస్టెరాల్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఫలితంగా హెయిర్‌ఫాల్ కూడా తగ్గుతుంది.

వీర్యం బాగా తయారు కావడానికి

వీర్యం బాగా తయారు కావడానికి

పురుషుల్లో జింక్ లోపం ఉంటే వారికి సంతానం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే జింక్ లోపం వల్ల పురుషుల్లో వీర్యం సరిగ్గా తయారుకాదు. దీనికి తోడు శుక్రకణాల్లో కదలిక కూడా ఉండదు. అదే గుమ్మడికాయ విత్తనాలను తింటే వాటిల్లో ఉండే జింక్ పురుషుల్లో సంతాన సాఫల్యత సమస్యను సరి చేస్తుంది. వారిలో వీర్యం బాగా తయారు అయ్యేలా చూస్తుంది. దీంతోపాటు అందులో శుక్రకణాలు కూడా సరైన కదలికలను కలిగి ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవడం లేదా ఆ విత్తనాలతో తయారు చేసే నూనెను రాయడం వంటి పనులు చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

కండరాల ఆరోగ్యం

కండరాల ఆరోగ్యం

గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి∙ గుమ్మడి గింజల్లో పనాగమిక్‌ ఆసిడ్‌ అనే పోషకం ఉంటుంది. దీన్నే పనాగమేట్, విటమిన్‌ బి-15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే వాయువుల మార్పిడి (సెల్‌ రెస్పిరేషన్‌) సక్రమంగా జరిగేలా చేస్తుంది∙ గుమ్మడి గింజలు కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ∙

గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

గుమ్మడి గింజల్లో ఉండే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌... ఫ్రీ రాడికల్స్‌ దుష్ప్రభావాన్ని హరించి వేస్తాయి ∙గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, రక్తం గాఢత (పీహెచ్‌)ను క్రమబద్ధం చేస్తాయి, ఒత్తిడిని నివారించడానికి దోహదపడతాయి.

స్థూలకాయం

స్థూలకాయం

గుమ్మడి గింజలు ఎక్కువగా తింటూ ఉంటే ఎప్పుడూ ఏదో తినాలనే కాంక్ష (క్రేవింగ్‌) తగ్గుతుంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలని జాగ్రత్తపడేవారు ఈ గుమ్మడి గింజలను తీసుకొని స్థూలకాయం బారిన పడకుండా కాపాడుకోవచ్చు∙

వ్యాధి నిరోధక శక్తి

వ్యాధి నిరోధక శక్తి

ప్రోస్టేట్‌ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి తోడ్పడతాయి ∙గుమ్మడి గింజలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆర్థరైటిస్‌ ముప్పును తగ్గిస్తాయి.

English summary

amazing health benefits of pumpkin seeds

amazing health benefits of pumpkin seeds
Story first published: Wednesday, May 2, 2018, 13:00 [IST]