For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె ఆరోగ్యానికి గుడ్లు హానికరమా ?

గుండె ఆరోగ్యానికి గుడ్లు హానికరమా ?

|

గుడ్లు సాధారణంగా రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అందువల్ల, ఒక మనిషి తన డైట్లో అవసరమైన గుడ్లను కంటే ఎక్కువ గుడ్లను వినియోగించడం వల్ల గుండె జబ్బులకు దారితీసే ప్రమాదముంది.

గుడ్లు అధిక కేలరీలు కలిగి ఉంటాయి, కాబట్టి వీటిని మీరు అధికంగా తినడం వలన, ఆ వ్యక్తి బరువు పెరగడానికి దారితీయవచ్చు. ఎక్కువ గుడ్లును తినడం ద్వారా ఒక వ్యక్తి అధిక బరువును పొందుతాడు.

అందువల్ల, శరీరానికి అవసరమైన శక్తిని, కొలెస్ట్రాల్ను & క్రొవ్వు పదార్ధాలను గరిష్ట స్థాయిలో గుడ్లు అందజేయగలవు. అలా ఇవి గుండె జబ్బుల విషయంలో సంపూర్ణ బాధ్యతను వహిస్తాయి.

Are Eggs Harmful For Heart Health?

1. గుడ్లు వల్ల కలిగే లాభనష్టాలు :
ఒక పూర్తి గుడ్డులో 210 mg కొలెస్ట్రాల్ ఉంటుంది, అంటే ఇది ఒక వ్యక్తికి రోజులో అవసరమైన కొలెస్ట్రాల్ కంటే 2 రెట్ల కొలస్ట్రాల్ను ఎక్కువగా కలిగి ఉంటుంది. ఒక గుడ్డు కూడా దాదాపు 5 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, ఇందులో 1.6 గ్రాముల సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. దాదాపు అన్ని గుడ్డు పచ్చసొనలో కొలస్ట్రాలు & సంతృప్త కొవ్వులు కనిపిస్తాయి. ఒక గుడ్డు తెల్లసొనలో 0.06 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది, వీటిలో కొలెస్ట్రాల్ & సంతృప్త కొవ్వు మాత్రం ఉండదు.

గుడ్డు పచ్చసొనలో సంతృప్త కొవ్వు & కొలెస్ట్రాల్తో పాటు, 100-200 mg పచ్చసొనలో గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా కలిగి ఉంటాయి. గుడ్డు తెల్లసొనలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను మాత్రం కలిగి లేదు. కాబట్టి, అధిక మొత్తంలో గుడ్లును తినడం వల్ల మానవ హృదయానికి అనారోగ్యకరమైన సంకేతముగా ఉంటుంది, కాబట్టి గుడ్లను తక్కువగా వినియోగించడం వల్లే మనకు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది.

గుడ్లు కొలెస్ట్రాల్ను కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డును వినియోగించడం వల్ల హృదయ రుగ్మతలకు లొంగిపోడని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మధుమేహ బాధితులు రోజుకు ఒక గుడ్డు వినియోగాన్ని అనుకుంటే చాలా మంచిది, లేదంటే వారు గుండెజబ్బుల బారిన పడతారు. మధుమేహ రోగులు గుండెజబ్బులను నివారించడానికి వారంలో మూడు గుడ్లను మాత్రమే తినడం మంచిది.

Are Eggs Harmful For Heart Health?

2. గుడ్డు వినియోగాన్ని ద్వారా జరిగే నష్టాన్ని ఎలా అధిగమించాలి?

ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఒక రోజులో ఒకసారి (లేదా) వారంలో కొన్ని సార్లు గుడ్డును తినడం చాలా మంచిది. గుడ్డు తినేటప్పుడు కొలెస్ట్రాల్ & కొవ్వులను కలిగివున్న నెయ్యి, వెన్న, ఎర్రని మాంసం, బంగాళాదుంపలు, సాసేజ్ల వంటి ఇతర ఆహారాల వినియోగాన్ని తప్పక తగ్గించాలి.

మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు గుడ్డు పచ్చసొన వినియోగమును వారానికి 3 (లేదా) అంతకంటే తక్కువగా ఉండటమే వారి ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు గుర్తించారు. గుడ్డు వినియోగాన్ని (లేదా) గుడ్డు పచ్చసొన వినియోగాన్ని మానుకున్న వారు, గుడ్డు తెల్లసొన వినియోగాన్ని ప్రయత్నించవచ్చు. ఒక పూర్తి గుడ్డుకు, 3 గుడ్ల తెల్లసొనను కలిపి తయారుచేసిన ఆమ్లెట్ను తినవచ్చు. ఎందుకంటే, గుడ్డు తెల్లసొనతో తయారు చేసినందువల్ల వాటిలో కొలస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.

ఈ విధంగా గుడ్డు తెల్లసొన కంటే, పచ్చసొన ఆరోగ్యానికి మరింత హానికరమని చాలా పరిశోధనల ద్వారా బయటపడిన వాస్తవం, కాబట్టి రోజువారీగా వినియోగించే గుడ్ల సంఖ్యను పరిమితి చేయడం చాలా మంచిది. గుండె సమస్యలు, మధుమేహం & అధిక రక్తపోటు గలవారు గుడ్డు పచ్చసొనను తినడాన్ని వైద్యులు నిషేధించారు. అయినప్పటికీ, అనేక సందర్భాల్లో డాక్టర్లు, గ్రుడ్డులోని పచ్చసొన పక్కన పెట్టి, తెల్లగా గుడ్డు భాగాన్ని తినడానికి రోగులకు అనుమతిస్తారు.

Are Eggs Harmful For Heart Health?

3. గుడ్లు, శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలకు ముప్పుగా మారుతోంది :

పరిశోధకులు - ప్రతివాదకుల మధ్య జరిగే వాదనల ప్రకారం, గుడ్లలో ఉండే పోషకాలు చెడ్డవని వారంతా ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే గుడ్లు అధిక కొలెస్ట్రాలను కలిగి ఉండటమే అందుకు కారణం. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు పదార్థం, ఇది సహజంగా రక్తంలోకి చేరుతుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి కొంత మోతాదులో కొలెస్ట్రాలు అవసరమవుతుంది. ఉదాహరణకు:- కొలెస్ట్రాల్ అనేది శరీరకణాలను రక్షించే గోడల నిర్మాణానికి బాధ్యత వహిస్తుంది. ఒక వ్యక్తి రక్తంలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే, రక్తము గట్టి పడుతుంది. అందువల్ల మీ గుండె రక్తమును శరీర భాగాలకు సరఫరా చేయటం కష్టతరమవుతుంది. ఈ కారణం చేత మీరు అధిక రక్తపోటును (లేదా) గుండె జబ్బులను ఎదుర్కోవచ్చు.

చివరిగా మేము చెప్పదలచుకున్న వాస్తవము ఏమిటంటే, గుడ్లు వినియోగం వల్ల ప్రయోజనాలనే కాక, దుష్ఫలితాలను కూడా పొందగలరని తెలియజేస్తున్నాం. ఒక వ్యక్తి తన ఆహారంలో గుడ్ల ప్రయోజనాన్ని పట్టించుకోకపోతే, ఆ వ్యక్తి ఎముకల నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్ మూలాన్ని కోల్పోతాడు.

ఏదేమైనప్పటికీ, గుడ్లలో ఎక్కువగా కొలెస్ట్రాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే కొవ్వులను ఎక్కువగా కలిగి ఉన్నందున - గుండెజబ్బులు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. మీ డైట్కు సంబంధించిన మార్పులను చేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ల సలహాలు తీసుకుని, రోజుకి ఎంత మోతాదులో గుడ్లను వినియోగించాలో అన్న విషయాన్ని చూసుకోండి.

English summary

Are Eggs Harmful For Heart Health?

Eggs are a great source of protein, it is also linked to raise the blood cholesterol levels, they are high on calories, which lead to weight gain. Avoid consuming too many eggs, as they can trigger the risk of heart diseases. Having an egg once a day a few times in a week is enough for a healthy person.
Desktop Bottom Promotion