For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవాలు బరువు తగ్గించడమే కాదు, అద్భుత ప్రయోజనాలు కూడా ఉన్నాయి

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. పోపుల పెట్టలో తప్పనిసరిగా ఉ

By Mallikarjuna
|

మన వంటగదిలో ఎన్నో ఔషధ గుణాలుండే దినుసులు వుంటాయి. వాటిలో నల్ల ఆవాలు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఆవాలు అనేవి వంటగదిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. పోపుల పెట్టలో తప్పనిసరిగా ఉండే ఈ ఆవాలు కొద్దిగా చేదు గా ఉంటాయి. పోపు పెట్టడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి వర్కౌట్లు చేయకపోయినా, సులభంగా బరువు తగ్గుతారు.

ఆవాలు లాగే ఆవ నూనెలో కూడా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇవి మెటబాలిజం వేగవంతం చేసి, ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

health benefits of mustard oil

మరి అయితే ఈ ఆవ నూనె బరువు ఎలా తగ్గించగలదు అనేగా మీ సందేహం ?అయితే తెలుసుకోవాల్సిందే!

పైన సూచించిన విధంగా ఆవాలు లేదా ఆవనూనె మెటబాలిజంను వేగవంతం చేసి, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సమాయపడుతుంది. శరీరంలో ఫ్యాట్ కణాలు నిల్వ చేరకుండా చేస్తుంది. పసుపు ఆవాల నూనెను వంటలకు ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.

ఆవాలలో బికాంప్లెక్స్ విటమిన్స్ అయిన నియాసిన్, రిబోఫ్లోవిన్లు శరీరం యొక్క జీవక్రియలను వేగవంతం చేయడానికి సహాయపడుతాయి. దాంతో వేంగంగా బరువు తగ్గుతారు.

<strong>వారానికి 3సార్లు ఆవనూనె, పసుపు మిశ్రమం తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!</strong>వారానికి 3సార్లు ఆవనూనె, పసుపు మిశ్రమం తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

ఆవనూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అన్ని నూనెల కంటే ఈ ఆవనూనె స్వచ్చమైనది, జీర్ణ శక్తిని పెంచడంలో ఆవనూనె గొప్పగా సహాయపడుతుంది!

ఆవనూనె బరువు తగ్గించడంతో , ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.

మరి ఆలస్యం చేయండా వాటిలో అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే పసుపు కలర్ గల ఆవాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సింది. దాని కంటే ముందు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

#1 కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది

#1 కార్డియో వాస్క్యులర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది

ఆవనూనె, ఇతర రిఫైండ్ నూనెల్లాగే, మోనోశాచురేటెడ్ ఫ్యాట్ మరియు పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉండే శరీరానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

#2 క్యాన్సర్ ప్రమాదంను తగ్గిస్తుంది

#2 క్యాన్సర్ ప్రమాదంను తగ్గిస్తుంది

ఆవాలలో గ్లూకోసినోలేట్ అనే కాంపౌడ్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. దాంతో క్యాన్సర్ వ్రుద్ది చెందకుండా నివారిస్తుంది. ఈ కాంపౌండ్స్ కొలెరెక్టల్ మరియు గ్యాస్ట్రోఇన్ టెన్సినల్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.

#3 ఆస్త్మా నివారిస్తుంది:

#3 ఆస్త్మా నివారిస్తుంది:

ఆవాలకు మరియు ఆస్త్మాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది, ఎందుకంటే పురాత కాలం నుండి దీన్ని ఆస్త్మా నివారణ కోసం ఉపయోగిస్తున్నారు. సైనసైటిస్ తో బాధపడే వారు ఆవనూనెను ఉపయోగించడం వల్ల ఆస్త్మా నుండి ఉపశమనం పొందవచ్చు. ఆవనూనెను ఉదరం, చాతీకి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శ్వాసనాళంకు గాలిబాగా ఆడుతుంది, నాజల్ ఫ్రీ అవుతుంది. రెగ్యులర్ గా ఆవనూనె తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

#4 డి కాగ్నిసెంట్ గా సహాయపడుతుంది

#4 డి కాగ్నిసెంట్ గా సహాయపడుతుంది

దగ్గు మరియు జలుబు తగ్గించడానికి ఆవనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా ఆవనూనెను వేడి చేసి, అరచేతులు, అరికాళ్ళకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల శరీరంలో వేడి కలిగి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెను చాతీకి అప్లై చేయడం లేదా వాసన చూడటం, ఆవిరి పట్టడం వల్ల మీ రెస్పిరేటరీ ట్రాక్ట్ క్లియర్ అవుతుంది.

#5 ఆకలిని పెంచుతుంది

#5 ఆకలిని పెంచుతుంది

ఆవనూనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది జీర్ణక్రియకు సహాయపడే రసాలను పొట్టలో ఉత్పత్తి చేస్తుంది. బరువు పెరగాలనుకునే వారికి ఇది చాల మేలు చేస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. శరీరంను ఆరోగ్యంగా ఉంచుతుంది.

#6 జీర్ణశక్తిని పెంచుతుంది

#6 జీర్ణశక్తిని పెంచుతుంది

ఇది వరకూ సూచించిన విధంగానే ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణింప చేస్తుంది. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఆహారం జీర్ణం అవ్వడానికి కావల్సిన, రసాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కాలేయం, పైత్య రసాలను ఉత్పత్తి చేస్తుంది.

<strong>స్కిన్, హెయిర్ కోసం ఆవనూనెతో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్..!!</strong>స్కిన్, హెయిర్ కోసం ఆవనూనెతో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్..!!

#7 నొప్పి తగ్గిస్తుంది

#7 నొప్పి తగ్గిస్తుంది

ఆవనూనెను ఎక్కువగా నొప్పులను తగ్గించుకోవడానికి మసాజ్ నూనెగా కూడా ఉపయోగిస్తుంటారు. ఇది బహు ప్రయోజనాలు కలిగిన నూనె, ఇది బాడీపెయిన్స్ తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల రుమటాయిడ్, ఆర్థ్రైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. ఇది మడమలు, జాయింట్ పెయిన్ ను కూడా తగ్గిస్తుంది!

#8 బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది

#8 బౌల్ మూమెంట్ మెరుగుపరుస్తుంది

ఆవనూనె ొక యాంటీఇన్ఫ్లమేటరీ లిక్విడ్, పొట్ట, ప్రేగులను స్మూత్ చేస్తుంది. బౌల్ మూమెంట్ యొక్కలైనింగ్ ను మెరుగుపరుస్తుంది. దాంతో ప్రేగుల్లో వ్యర్థాలు స్మూత్ గా బయటకు నెట్టబడుతాయి. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. యూటిఐ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

#9 చర్మ ఆరోగ్యానికి

#9 చర్మ ఆరోగ్యానికి

వింటర్లో ఆవనూనెను తరచూ ఉపయోస్తుంటే, శరీరం వెచ్చగా మారుతుంది. చర్మం డ్రై నెస్ తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా చేస్తుంది. ఇది చర్మానికి న్యాచురల్ గ్లో ఇస్తుంది. చర్మం యంగ్ గా ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది.

English summary

10 Amazing Benefits Of Mustard Oil For Weight Loss!

Mustard is a superfood that helps to shed that extra pound without even working hard. Mustard is known to have ingredients that can speed up your metabolism and help to digest the food faster, hence leading to weight loss. Let's find out how mustard oil can help you to lose that extra kilo and get back in shape!
Story first published:Wednesday, January 3, 2018, 17:20 [IST]
Desktop Bottom Promotion